Remembering The Legendary Lyric Writer Veturi On His Birth Anniversary!

Updated on
Remembering The Legendary Lyric Writer Veturi On His Birth Anniversary!

Contributed by Vaibhav Seepana

ఈయన పాటలు అన్ని మూటగా చుట్టి ఒక చెట్టుకు పెడితే....తేనె తీగలు అన్ని తన పట్టుని వదిలి ఆ మూటని చేరుతాయేమో... మన తాతగారు....మన నాన్న గారు ...మనము...అందరు....కూన రాగాలు తీసుకొనే పాటలు ఏమైనా ఉన్నాయి అంటే...అవి ఈయన రాసినవే....ఇన్ని తరాల మనసులను కొల్లగొట్టిన పదాల వేటగాడు....పాటల రచయిత....

ఆంధ్రుల అన్నగారి నోటి మాటతో విశ్వనాధ్ గారికి పరిచయం అయ్యి.... విశ్వనాధ్ గారి కలకండంతో మనకు పరిచయం అయ్యి..... తన ఊహా ప్రపంచంలోంచి ఎన్నో అద్భుతాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన .. మాటల మాంత్రికుడు, రచయితల రారాజు...

మన శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారు

ఈయన కలం... పాత్ర లోకి పరకాయ ప్రవేశం చెయ్యగలదు... పడుచుని ప్రేమించగలదు.... పరువాన్ని పొగడగలదు.... పగ ని పోగొట్టగలదు.... ప్రకృతిని పరిచయం చెయ్యగలదు... ప్రయత్నాన్ని గెలిపించగలడు.... పరమాత్మని కలిపి కిందకి రప్పించగలదు...

అలాంటి కలానికి జన్మనిచ్చిన కళామ్మ తల్లి బిడ్డ జన్మదినం ఈ రోజు.... నేరుగా ఆయనకి శుభాకాంక్షలు చేద్దాం అంటే... మన మధ్య లేకపోవచ్చు.. అందుకే ఆయన పరిచయం చేసిన ఎన్నో పదాలకు చెప్పుకుందాం.... ఆయన కలం లోంచి జాలువారిన అపురూపమైన అక్షరాలకు చెప్పుకుందాం... మన తరుపున ఆయన రాసిన ఎన్నో ప్రేమ లేఖలకు చెప్పుకుందాం.... ఆయన రాతలలో ఉన్న రమ్యనికి చెప్పుకుందాం.... ఆయన పదాలలో ఉన్న తెలుగు సంస్కృతికి చెప్పుకుందాం....

చివరగా ఆయనతో కొన్ని మాటలు....

మీ పుట్టుక...మా తెలుగు సినిమాకు వరం మీ పాట...మా ఆలోచనలకు తేజం మీ అక్షరాల వేట... ఎన్నో పాటలకి ఆహరం మీ ఊహా ప్రపంచం ... మాకు స్వర్గం మీ ఒక్క జననం..... ఈరోజుకి పెంచెను గౌరవం