The Shiva Temple Near Karimnagar That Was Built By A Descendant Of The Pandavas!

Updated on
The Shiva Temple Near Karimnagar That Was Built By A Descendant Of The Pandavas!
హిందువుల నమ్మకం ప్రకారం పరమశివుడే సర్వలోకాలకు అధిపతి ఆయనే దేవతలందరికి దిక్కు అని వారి ప్రగాడ విశ్వాసం. శివుడు భోళా శంకరుడు, భక్తులు వినమ్రతతో ప్రార్ధించినా చాలు వారి కోరికలు నెరవేరుస్తాడు. అంతటి మహిమాన్వితమైన దైవానికి పుణ్యస్థలం మన తెలంగాణాలో ఉంది.. హైద్రాబాద్ నుండి 160 కిలోమీటర్లు కరీంనగర్ నుండి 36 కిలోమీటర్ల దూరంలో వేములవాడ రాజ రాజేశ్వర దేవాలయం ఉంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్రతి శైవ క్షేత్రానికి ఒక ఘన చరిత్ర ఆ శివంతో మిళితమై ఉంటుంది.. అలాగే మన వేముల వాడ దేవాలయానికి కూడా ఉంది. పూర్వం అర్జునుడి ముని మనవుడు అయిన నరేంద్రుడు ఒక సాధు ఋషిని చంపి బ్రహ్మ మహాపాతకాన్ని కూడగుట్టుకున్నాడు.. ఆ పాపానికి ప్రయశ్చితానికై ప్రతి పుణ్యక్షేత్రం దర్శించి పాపాలు తొలగిపోయేల పూజలు చేసేవాడు అలా సంచరిస్తు ఒకనాడు ఇక్కడి కోనేరులో స్నానమాచరిస్తు ఉండగా నీటిలో శివలింగం ప్రత్యేక్షమైంది ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి గుడి నిర్మించడం మూలంగా తన పాపాన్ని ప్రయశ్చితం చేసుకోవడమే కాకుండా భవిషత్తులోని భక్తుల పాపాలను కడిగే ఒక పవిత్ర పుణ్యస్థలిగా ఈ దేవాలయం విలసిల్లుతుంది. 5 1 పురాణాల ప్రకారం ఇంకో కథ ఉంది.. భూలోకంలోని పాపులను, అశాంతిని చూసి తట్టుకోలేని నారద మహర్షి పరమేశ్వరుడుని వేడుకోగా భక్తులకు శాంతిని, కోరికలను తీర్చడానికి ఇక్కడే కొలువై ఉంటానని నారదుడికి వాగ్ధానం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.. దక్షిణ కాశిగా పిలవబడుతున్న ఈ శైవ క్షేత్రంలోని శిల్పసౌందర్యం కడు చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక్కడి అందమైన శిల్పాలలో కేవలం శివుడివి మాత్రమే కాక జేన, బౌద్ధ సంస్కృతులకు సంబందించిన శిల్పాలు కూడా ప్రతిష్ఠించారు. అన్ని మాసాలలో శ్రేష్టమైన కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువ.. శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివధ్యానంతో జాగరం చేసి రాజరాజేశ్వరుడిని దర్శించుకోడానికి భక్తులు తండోప తండాలుగా ఇక్కడికి వస్తారు ఈ ఒక్కరోజే దాదాపు 5లక్షలకు పైగా దర్శిస్తారని అంచనా. 3 2 కోడెను కట్టుట: తమ కోరికలు నెరవేర్చాలని భక్తితో కోరుకొని అందుకు దక్షణగా కోడెను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చిన్నారులు యువకులు అనే తేడా లేకుండా భక్తులందరూ ఉత్సాహంగా ఈ మొక్కును చెల్లించుకుంటారు. ఆ శివుని వాహనం నందినే కోడెలో చూసుకుంటు భక్తులు తమ మొక్కును చెల్లించుకుంటారు. 8 దర్గా: అవును మీరు చూసింది నిజమే... దేశంలో అరుదుగ కనిపించే ఇంతటి గొప్ప మతసామరస్యం వేములవాడలో దర్శినమిస్తుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన మహ్మదీయుడు గొప్ప శివభక్తుడు బతికున్నంత కాలం ఆలయంలో సేవలు చేశారు తన మరణం కూడా ఆలయంలోనే సంభవించింది. మరణించినా కూడా తనను ఈ దేవాలయం నుండి వేరుచేయకుండ ఇంకా ఈ మతసామరస్యం ఇలానే కొనసాగించాలన్న తలంపుతో ఇక్కడ గర్భగుడికి ముందే దర్గా ఉంటుంది. హిందువులు దర్గాని దర్శించి దీవెనలు అందుకుంటారు. 6 ఇక్కడి శివలింగాని ఎంతటి పవిత్రత శక్తి ఉందో కోనేటికి కూడా అంతే శక్తి ఉంది ఇంద్రుడు, మహా ఋషులు ఇత్యాదులు ఇక్కడ మునిగి వారి పాపాలను తొలగించుకున్నారని చరిత్ర చెబుతుంది. ఇక్కడి దేవాలయంలో సీతారామ చంద్ర స్వామి, బద్ది పోచమ్మ, నగరేశ్వర స్వామి, అనంత పధ్మనాభస్వామి, త్రిపురసుందరి కాలభైరవులు, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ గుడికి దగ్గరలోని భీమేశ్వర ఆలయం కూడ ప్రసిద్ధి. ఇక్కడి గండ దీపాన్ని వెలిగించడం వల్ల భక్తుల గండాలు తొలిగిపోతాయని నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేస్తారు. స్మార్థ ఆగమ శాస్త్రంలో పూజలు కైంకర్యాలు ప్రాత:కాల పూజ, మధ్యాహ్నం అన్న పూజ, సాయంత్రం ప్రదేశ పూజ, రాత్రికి నిశి పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్న చందంగా కేవలం తెలంగాణా ప్రాంతం నుండే కాక దేశం నలుమూలల నుండి వచ్చి శ్రీ వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 4 7 9