వందేమాతరం శ్రీనివాస్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు.. గీత రచయిత, నటుడు, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఇప్పటికి సుమారు 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి 9 నంది అవార్డులు(సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా), 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు మరియు ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు సాగించిన 32సంవత్సరాల సుధీర్ఘ కెరీర్ లో చాలా వరకు ఉద్యమాలే ప్రధానాంశంగా తీసిన సినిమాలకే ఎక్కువ పనిచేయడం వల్ల కొంతమంది ప్రేక్షకులు శ్రీనివాస్ గారు ఒకే తరహా పాటలు కంపోజ్ చేశారనుకుంటారు. కాని ఆయన విప్లవ గీతాలను ఎంతటి స్థాయిలో రుపొందించగలరో ప్రేమ, సెంటిమెంట్, భక్తి ఇలా దాదాపు అన్ని రకాల పాటలను కూడా అంతే స్థాయిలో కంపోజ్ చేయగలరు. అందుకు ఉదాహరణే ఆయన అందుకున్న అవార్ఢలు.. ఇప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్ గా మూడు నందులు ప్రభుత్వం నుండి అందుకున్నారు దానిలో స్వయంవరం, ఒసేయ్ రాములమ్మ, దేవుళ్ళు ఇలా మూడు విభిన్న తరహా సినిమాలకు అందుకున్నారు. ఈ మధ్య సినిమాకో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్న కాని అందులో ఎవ్వరు కూడా వందేమాతరం శ్రీనివాస్ గారి లాంటి పాటలను అందించలేరు. ఈమద్య వందేమాతరం శ్రీనివాస్ గారి పాటలు అంతగా రాకపోయినా కాని ఇప్పటికి గ్రామాలలో వారి పాటలకు అశేష అభిమానులున్నారు.
ఆయన ఒకే తరహా పాటలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల పాటలు కంపోజ్ చేశారు.. అందులోని కొన్ని గీతాలు..
1. పల్లె కన్నీరు పెడుతుందో.. (కుబుసం)
2. ఒకటే జననం.. (భద్రాచలం)
3. వందనాలమ్మ అమ్మ వందనాలమ్మా.. (అడవిలో అన్న)
4. మల్లె తీగకు పందిరి వోలె.. (ఒరేయ్ రిక్షా)
5. మనసైన నా ప్రియ.. (ఆహా)
6. దొస్తర దిన్ అందుమా.. (కుబుసం)
7. ఎర్రజెండ ఎన్నీయలో.. (చీమల దండు)
8. మరళ తెలుపునా ప్రియా.. (స్వయంవరం, నంది అవార్డ్)
9. తెలంగాణ గట్టుమీద చందమామ.. (చీమలదండు)
10. కర్మ భూమిలో.. (శ్రీ రాములయ్య)
11. జయ జయ శుభకర వినాయక (దేవుళ్ళు, నంది అవార్డ్)
12. నేస్తమా ఇద్దరిలోకం ఒకటే లేవమ్మా.. (పెళ్ళిపందిరి)
13. ఊరువాడ అక్కల్లారా ఉత్తరమొచ్చింది.. (ఎన్ కౌంటర్)
14. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం.. (కంటే కూతుర్నే కను)
15. ననుగన్న నా తల్లి రాయలసీమ.. (శ్రీ రాములయ్య)
16. అందరిబంధువయ భద్రాచల రామయ్య (దేవుళ్ళు)
17. హ్యాపిగా జాలీగా ఎంజాయ్ చేయ్ రా.. (జయం మనదేరా)
18. ఓ ముత్యలరెమ్మ.. ఓ మురిపాల కొమ్మ (ఒసేయ్ రాములమ్మ, నంది అవార్డ్)
19. ప్రియురాలి అడ్రెస్ ఏమిటో.. (ఆహా)
20. రామసక్కని తల్లి రాములమ్మో.. (ఒసేయ్ రాములమ్మ)
21. మేఘలే ఈవేళ.. (ఆయుధం)
22. విప్పపూల.. (శ్రీ రాములయ్య)
23. ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్నా.. (స్వప్నలోకం)
24. పికాసో చిత్రమా.. (స్వయంవరం)
25. నె పాడితే లోకమే పాడదా.. (మిస్సమ్మ)