అంతులేని ఆకాశం లో ఒక చిన్ని మేఘం లో వేల నీటి చుక్కలం మేము.. చల్లని గాలి వీచింది.. చిన్న చిన్న వాన చినుకులుగా ఈ నేలపై కి వచ్చాం. కొందరు ఎడారి లో పడి ఆవిరైపోతే.. కొందరు చెరువు గా మారి దాహం తీర్చారు. కొందరు ఆణి లో పడి ముత్యాలైతే.. కొందరు తామరాకు పై నీటి బొట్టు గానే మిగిలిపోయారు. కొందరు విత్తనాలపై పడి పంటను పండిస్తే.. కొందరు మహాసముద్రాన కలిసి పోయారు. నేను మాత్రం నా లాంటి వానచినుకు తో దాహం తీర్చుకునే చకోర పక్షి దాహం తీర్చాను తనని బతికించాను.. చకోర పక్షి లాంటి కళ కు ప్రతి కళాకారుడు వానచినుకే...