Meet Niharika, A Creative Artist From Amalapuram Who Makes Personalized Gifts On Demand

Updated on
Meet Niharika, A Creative Artist From Amalapuram Who Makes Personalized Gifts On Demand
రేపు ప్రవీణ బర్త్ డే ఉందనగా నిహారిక ఈరోజు ప్రవీణ ఇంటికి వెళ్లి తన చేతులతో తయారుచేసిన గిఫ్ట్ ను ఒక చోట దాచిపెట్టి వచ్చింది. ఉదయం వాట్సాప్ లో బర్త్ డే విషెస్ తో పాటు నీకో గిఫ్ట్ కూడా నిన్ననే ఇంట్లో పెట్టానని మెసేజ్ పంపించింది, ఆ గిఫ్ట్ అందుకోవాలంటే ముందు ఇంట్లో నికిష్టమైన ప్లేస్ లో ఒక క్లూ పెట్టాను వెతుకు అని చెప్పింది. ప్రవీణ తనకిష్టమైన ప్లేస్ వెళ్ళింది.. తీరా అక్కడికి వెళితే చిన్న పేపర్ ముక్క అందులో మరో క్లూ.. ఇంట్లో నువ్వు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతావు? అక్కడ ఇంకో క్లూ పెట్టాను వెళ్లి వెతుకు... ఇలా 10 క్లూలు ఇచ్చిన తర్వాత చివరకు దేవుడు గదిలో గిఫ్ట్ దొరికింది. "తన జీవితంలోని అద్భుత క్షణాలు మరల గుర్తుచేసే 15 ఫొటోలతో కూడిన ఓ పెద్ద క్రాప్ బుక్".. ప్రవీణ పుట్టినరోజుకి ఆనందబాష్పాలు అనుకోని అతిథులుగా వచ్చాయి.
మనకెంతో నచ్చిన వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇవ్వాలని మనమందరం ఆశిస్తాం, తీసుకోబోయేవారు కూడా నచ్చిన వ్యక్తి నుండి మెమరబుల్ గిఫ్ట్ రావాలని తపిస్తారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్న నిహారిక కూడా ఇలాగే స్నేహితులు పదే పదే చూసుకునే గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించింది. ఫలితంగా క్లాస్ మేట్స్ కు ఇవ్వడంతో పాటు డిగ్రీలో ఉండగానే ఓ స్టార్టప్ స్టార్ట్ చెయ్యడానికి దారి కనుక్కోగలిగింది. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మెండుగా ఉండడంతో ఉద్యోగం కాకుండా ఉద్యోగం ఇచ్చే పొజీషన్ లో ఉండాలనే తన కోరికను డిగ్రీ చదువుతుండగానే నెరవేర్చుకుంది.
నిహారిక చిన్నతనం నుండి చిన్న చిన్న క్రాఫ్ట్స్ అప్పుడప్పుడు చేస్తుంటుంది కాని expert కాదు. ఓరోజు ఒక ఫ్రెండ్ కోసం గ్రీటింగ్ కార్డ్ తయారుచెయ్యమని మరో ఫ్రెండ్ ని అడిగింది, ఎదో కారణం వల్ల ఆ ఫ్రెండ్ గ్రీటింగ్ కార్డ్ తయారుచెయ్యలేకపోయింది. టైమ్ లేదు బర్త్ డే డేట్ దగ్గరికి వస్తుందని మనసులో ఉన్న విజన్ ను చేతుల్లోకి తీసుకువచ్చింది. గ్రీటింగ్ కార్డ్ కు కావాల్సిన మెటీరియల్ తనే కొని అనుకున్న రూపానికి తీసుకువచ్చింది. అలా ఒక ఫ్రెండ్ కు గ్రీటింగ్ కార్డ్, మరో ఫ్రెండ్ కు ప్రత్యేకంగా తనే తయారుచేసిన కీ చైన్, మరొకరికి మరొకటి.. ఇలా ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరికి స్పెషల్ గా ఉండాలని Customised greeting card, handmade crafts, infinity box లాంటి 30 కి పైగా కొత్త ఆవిష్కరణలు నిహారిక నేర్చుకుంది. తయారుచేసిన గిఫ్ట్స్ అన్ని Instagramలో పోస్ట్ చెయ్యమని స్నేహితులే సజెస్ట్ చేశారు. గిఫ్ట్స్ బాగున్నాయి.. మాకు కూడా తయారుచెయ్యగలరా.? అని ఫాలోవర్స్ రిక్వెస్ట్ చెయ్యడం, నెమ్మదిగా స్టార్టప్ మొదలవ్వడం చకచకా జరిగిపోయాయి. స్నేహితుల మీద ఉన్న ఆ ప్రేమే తన జీవితానికి ఒక మార్గాన్ని చూపించింది. సుమారు సంవత్సరం క్రితం మొదలైన ఈ స్టార్టప్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది.
ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కాలేజ్, మళ్ళీ సాయంత్రం క్రాఫ్ట్ చెయ్యడంలో నిమగ్నమైపోవడం.. ఇలా ఒక పక్క చదువు, మరోపక్క స్టార్టప్ ఈ రెండింటిని ఓపికతో ప్లానింగ్ తో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. మీరు చూస్తున్న దాదాపు ప్రతి ఒక్క ఐటమ్ కూడా నిహారిక రెండురోజుల్లో పూర్తిచేసినవే. నిహారిక లో ఉన్న మరో గొప్ప లక్షణం "రీసెర్చ్". ఇండియాలో కొత్తగా ఎలాంటి గిఫ్ట్స్ వస్తున్నాయి, ఎలాంటి వాటితో వాటిని రూపొందిస్తున్నారు మొదలైన వాటన్నిటిని నిరంతరం తెలుసుకుంటూ ఉంటుంది. కస్టమర్స్ ఫలానా ఐటమ్ అడిగినా వేరే ఆర్టిస్టులతో తయారుచేయించడం కూడా చేస్తూ వారిని నిరుత్సాహానికి గురిచేయడం లేదు.
ఫ్యూచర్ అంతా క్రియేటివిటీ ఆర్టిస్టులదే, ఎందుకంటే ఇష్టం గాని, టాలెంట్ గాని దానంతట అదే రావాలే తప్ప బలవంతంగా రుద్దేది కాదు, క్రియేటివ్ వర్క్స్ అన్నీ ఈరోజు అనుకుని కొన్ని రోజుల్లోనే నేర్చుకునే కోర్సు కాదు.. అది సంవత్సరాల తరబడి మనం ప్రయాణం చేస్తే తప్ప ఈజీగా రాదు. అందుకే క్రియేటివిటీ ఆర్టిస్టులదే భవిషత్తు అంతా. ఇది ముందుగానే గమనించిన నిహారిక కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే మరికొందరు ఆర్టిస్టులతో కలిసి తన స్టార్టప్ మరింత విస్తరించాలనే ప్రయత్నంలో ఉన్నారు. Her Instagram page CLICK HERE 1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.