10 Most Underrated Lyricists From Telugu Movies Who Have Penned Beautiful Songs!

Updated on
10 Most Underrated Lyricists From Telugu Movies Who Have Penned Beautiful Songs!
సినిమా పాటలకి సాహిత్యాన్ని అందించడం కత్తి మీద సాము వంటిది . దర్శకుడి ఆలోచనలకి అక్షర రూపం పాట . అభిమానులని అలరించేలా, ప్రేక్షకులని ఆలోచించేలా చేసేది పాటలే . కొన్ని తరాల పాటు ప్రేక్షకుల మనసులో చెరగని జ్ఞాపకంలా మిగిలిపోతాయి సినిమా పాటలు , కాలదోషం అసలే ఉండదు పాటకి . కానీ కొన్ని సందర్భాలలో పాట ప్రాచుర్యం పొందినంతగా పాట రాసిన రచయిత అంతగా వెలుగులోకి రాకపోవొచ్చు రావాల్సినంత గుర్తింపు దక్కకపోవొచ్చు . ఆలా మన తెలుగు సినీ గేయరచయితలలో అపార ప్రతిభ కలిగి ఉండి కూడా underratedగా మిగిలిపోయిన కొందరు గేయరచయితలని ఓసారి చూద్దాం . 1. భువన చంద్ర:
దాదాపు రెండు దశబ్దాలుగా రెండు వేల పైచిలుకు పాటలు రాసారు భువనచంద్ర గారు . సినీ సంగీతాభిమానులకి వీరు సుపరిచుతులే అయినప్పటికీ వారి రచనల్లోని మాధుర్యాన్ని మన తరం అంతగా తెలుసుకోలేకపోయింది 2.వెన్నెలకంటి:
పరభాషల్లోంచి తెలుగులోకి వచ్చే అనువాద చిత్రాలలో వెన్నెలకంటి గారి పాట లేని చిత్రాలు చాలా అరుదు . డబ్బింగ్ చిత్రాలకే కాక ఎన్నో తెలుగు సినిమాలకి కూడా గొప్ప పాటలని అందించారు . 3. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు:
జొన్నవిత్తులవారు స్వతహాగా కవి , తొంభైవ దశకం నుండి సినీగేయ రచయితగా ఎన్నో మధురమైన పాటలు రాసారు . శ్రీరామరాజ్యం చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకున్నారు . 4. సాహితి:
“లాలూదర్వాజా లష్కర్ బోనాలపండగకు” అని ఆయన రాసిన పాట ఇప్పటికీ ఊర్రోతలూగిస్తూనే ఉంటుంది . కెవ్వుకేక అంటూ ప్రేక్షకులతో కేక పెట్టించేలా రాయగలరు . ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ) అంటూ ప్రేమికుల మనసు దోచే సాహిత్యం రాయగలరు . సాహితిగారు రాసిన ఇంకా ఎన్నో పాటలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి . 5. కులశేఖర్:
ఆనతికాలం లోనే గేయరచయితగా పేరు సంపాదించుకున్నారు కులశేఖర్ గారు .ఆర్ పి.పట్నాయక్ కులశేఖర్. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నో మధురమైన పాటలు వచ్చాయి . సరళమైన భాషతో సాహిత్యం రాయగలగడం కులశేఖర్ గారి శైలి . 6. కందికొండ:
పూరి జగన్నాధ్ గారి సినిమాలకి ఎక్కువగా పనిచేసారు కందికొండ గారు. మళ్ళి కూయవే గువ్వా అంటూ అయన రాసిన పాట ఇప్పటికి ఎందరికో ఇష్టమైన పాటల్లో ఒకటి . దాదాపు వేయి పాటలకి పైగా రాసారు కందికొండ గారు 7. వనమాలి:
అరెరే అరెరే మనసే జారే హ్యాపీ డేస్ లోని ఈ పాట తో మనందరికీ చిరపరిచితులు అయ్యారు వనమాలి గారు . ప్రేమ గీతాలకి చిరునామాగా మారారు .ఓయ్ , ఆరెంజ్ , ఆర్య 2 మనం వంటి ఎన్నో చిత్రాలకి పాటలు రాసారు 8.కృష్ణ చైతన్య:
పిల్ల జమిందార్ ,ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే ,స్వామి రారా వంటి విజయవంతమైన చిత్రాలకి సాహిత్యాన్ని అందించారు కృష్ణ చైతన్య . రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగానూ మారారు 9. చైతన్య ప్రసాద్:
బాహుబలి చిత్రాలలో లో హంసనావ , మనోహరి . ఈగ లో లావా లావా , రాజన్న లో మేలుకోవే చిట్టితల్లి , తకిట తకిట , బ్రోకర్ వంటి చిత్రాల్లోని పాటలకి సాహిత్యాన్ని అందించారు చైతన్య ప్రసాద్ గారు . 10.సిరాశ్రీ:
క్షణం సినిమాలో మనందరికీ నచ్చిన చెలియా పాటని రాసింది సిరాశ్రీ గారే . ఐస్ క్రీం , సత్య 2 సర్కార్ 3 వంటి చిత్రాలకి పాటలు రాసారు మరెవరినైనా మరచిపోయుంటే కామెంట్లతో మాతో పంచుకోండి..