మనకెప్పుడు నిజమైన స్వతంత్రం - A Short Poem On True Essence Of Independence

Updated on
మనకెప్పుడు నిజమైన స్వతంత్రం - A Short Poem On True Essence Of Independence

మళ్లీ ఎప్పటిలాగే స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేసింది. దేశమంతా వేడుకలు చేసుకుంటూ, స్వాతంత్ర్యపు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూన్నది .మనం కూడా బాగానే జరుపుకుంటున్నాం.కానీ ఒకామె తప్ప... ఆమె చూడటానికి బాగా బతికిన మనిషి లాగే ఉంది, కానీ పాపం అమేకంటు ఎవరు లేని ఒంటరి లాగా ఉంది .ముఖం పాలిపోయి , నిస్సత్తువగా , దీనంగా ఉంది .రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండాను చూస్తూ ఇలా పాడుతున్నది....

జరుపుకుందాం జెండా పండుగ , ఒక ఆడది క్షేమంగా బయటకి వెళ్లి వచ్చినప్పుడు...... జరుపుకుందాం జెండా పండుగ , పురిట్లో పిల్లలను కాటికి పంపించనప్పుడు......

జరుపుకుందాం జెండా పండుగ , లక్షలు దోచుకుంటున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసిన రోజునా..... జరుపుకుందాం జెండా పండుగ , విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిన రోజునా....

జరుపుకుందాం జెండా పండుగ , వేల మంది డాక్టర్లు ఉన్న ఈ దేశంలో కొంత మంది నిర్లక్ష్యంతో వైద్యం అందక జరుగుతున్న చావులు ఆగిన రోజున..... జరుపుకుందాం జెండా పండుగ , స్వార్ధపు రాజకీయాలు అంతరించిన రోజునా......

జరుపుకుందాం జెండా పండుగ , ఓటును , 5 ఏళ్ల తన జీవితాన్ని ఒక వెయ్యికి , సారా సీసాకి అమ్ముకోని రోజునా..... జరుపుకుందాం జెండా పండుగ , దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత , మత్తులో నుంచి మెల్కున్న రోజున....

జరుపుకుందాం జెండా పండుగ , వార్తలు చదవవలసిన వార్త ఛానెళ్లు చెత్తని చదవని రోజున.... జరుపుకుందాం జెండా పండుగ , స్వాతంత్రం అంటే రెండు చాక్లెట్లు ,ఒక బిస్కట్ ప్యాకెట్ కాదు అని విద్యార్థి తెలుసుకున్న రోజున....

జరుపుకుందాం జెండా పండుగ ,చనిపోయినప్పుడు కాటికి కూడా తీసుకుపో ని ఈ మనుషులకు మానవత్వం వచ్చిన రోజున..... ఇలా ఇంకా పాడుతూ ఉండగా, ఒక అతను ఆమె వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు...

అమ్మ మీరు వచ్చి మా టీవీ ఛానెల్లో పాడతారా ,మా ఛానెల్ కి మంచి రేటింగ్స్ వస్తయమ్మా ... దానికి ఆమె నవ్వుతూ సున్నితంగా తిరస్కరించింది. ఆ T.V ఛానెల్ అతను కనీసం మీ పేరైన చెప్పండమ్మ అని అన్నప్పుడు ...ఆమె తన పేరు చెప్పింది. భరతమాత అని.