Contributed by Naga arjun VCA
నమ్మాలనిపించే నిజం , అయినా నిజానికి అది ఒక అబద్దం .. ఆ అబద్ధం నిజమని నమ్మేలా ఉంది , ఆ క్షణంలో అలా అనిపించింది .. మనసుకి అది అబద్దం అని తెలుసు , కానీ ఆ క్షణంలో అబద్దానికి , నిజానికి మధ్య తేడా యొక్క విచక్షణని కోల్పోయా .. ..
నేను కోల్పోతుంది నా విచక్షణే కాదు , నా వివేకాన్ని అని తెలుసుకోలేకపోయా .. నా మనసుపొరల్లో అబద్దాన్ని నిజంలా ముద్రించుకున్నా , నా కళ్ళు చేసిన తప్పో నా మనసు చేసిన పొరపాటో తెలీదు ..
ఒక అవాస్తవ రూపానికి ప్రతిరూపంగా మారాను , మళ్ళి వాస్తవంలోకి రావాలనుంది .. చెడు మనసు చెప్పే చెడు ఊసుల ఊసలను తెంచుకుని , క్రొత్త ఆశలకి ఊపిరి పోయాలని అనుకుంటున్నా .. అనుకున్నా ఈ క్షణంలో ఏది జరగట్లేదు , జరగడానికి వీలులేని ఆలోచనలతో సతమతమవుతున్నా ..
జరిగిన, జరుగుతున్న ప్రతీ ఒక్కటి విరుద్దమైన వైరుధ్యాన్ని తెస్తుంది, నాపై కాలానికి కక్షో , లేక వివక్షో తెలీదు ప్రతీ సంఘటనకీ శిక్షిస్తుంది .. మరణ శిక్ష కాదు, అది మనసు శిక్ష నాతో నా వెంటే ఎప్పుడూ ఉండే నా ఆలోచనల యొక్క ఆవేశాలను నా అదుపులో లేకుండా చేసే శిక్ష .. నాలో లేని ఆలోచన "భయం", ఇప్పుడు అది నా ఆలోచనల ద్వారా నాలోకి క్రొద్దిక్రొద్దిగా చేరుతుంది ..
పారిపోవాలనుంది నేను ఉహించుకునే నా ఊహల నుండి, పోవాలనివుంది ఊహ లేని, ఆలోచన రాని, ఏ ఆవేశం చేరని చోటులోకి ... ...