Trivikram's Box-Office Mantras - మాటల మాంత్రికుడి బాక్స్ ఆఫీసు సూత్రాలు!

Updated on
Trivikram's Box-Office Mantras - మాటల మాంత్రికుడి బాక్స్ ఆఫీసు సూత్రాలు!
(This article has been contributed by Manu Chandra.) మన టాలీవుడ్ లో బాగా పదున ఐనవి ఒకటి రాజమౌళి కత్తి అయితే ఇంకొకటి త్రివిక్రమ్ పెన్ను. ఆ పెన్ను నుంచి జాలువారిన ఆణిముత్యాలు జనాలని నవ్వించడమే కాదు, ఆలోచించే లా కూడా చేస్తాయి. అవే మాటలకి ఇంకొంచెం పదును పెట్టి టాలీవుడ్ బాక్స్ ఆఫీసు మంత్రాలు గా మార్చి మీ ముందు కి తెస్తున్నాం! ఫేసు కొంచెం ఇటు టర్నింగ్ ఇచ్చి ఒక లుక్ ఎస్కోండి. 1. నువ్వే నువ్వే లో ప్రకాష్ రాజ్: కన్నతల్లిని, గుడి లో దేవుడిని మనమే వెళ్లి చూడాలి. వాళ్ళే మన దగ్గరకి రావాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది... 9 2. అత్తారింటికి దారేది లో రావు రమేష్ : రావి చెట్టుకి పూజ చేస్తాం దేవుడు అంటాం కాని అదే మన ఇంటి గోడలో మొలిస్తే పీకేస్తం... 7 3. నువ్వు నాకు నచ్చావ్ లో సుహాసిని: ప్రేమ ఫలానా టైం కి ఫలానా వాళ్ళ మీద పుడుతుంది అని ఎవరు చెప్పగలరు అదే తెలిస్తే ఎయ్ ఆడ పిల్ల ఆ టైం కి ఇంట్లో నుంచి బయటకి వెళ్ళదు... 5 4. అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్ : ఆనందం గా ఉండడం అంటే అన్నీ ఉండడం కాదు అత్త.. నలుగురి తో ఉండడం నవ్వుతు ఉండడం... 3 5. నువ్వే నువ్వే లో ప్రకాష్ రాజ్: మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పే వాళ్ళు మంచోళ్ళు. మనం ఏం చేసిన భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. 4 6. జులాయి లో అల్లు అర్జున్: క్లాసు రూం లో ఎవ్వడైనా ఆన్సర్ చెప్తాడు.. ఎక్సామ్ లో రాసే వాడే టాపర్ అవతాడు. 2 (3) 7. నువ్వే నువ్వే లో చంద్ర మోహన్: సంపాదించడం చేత కాని వాడికి ఖర్చు పెట్టె అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. 8 8. అతడు లో మహేష్ బాబు: బెంజ్ అందరు బాగుంది అంటారు పూరి, కాని అంబాసిడర్ నే కొంటారు. 1