This Small Govt School In Telangana Looks Like A Train & The Students Are Loving It

Updated on
This Small Govt School In Telangana Looks Like A Train & The Students Are Loving It

రాజన్న సిరిసిల్ల జిల్లా కు 34 కి.మీ దూరంలో ఉన్న వీర్నపల్లి ఆరు మండలాలకు కేంద్రం. ఇక్కడ మూడు ప్ర్తెవేట్ స్కూల్స్, ఐదు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి.. ప్ర్తెవేట్ స్కూల్స్ లోకి పిల్లలను పంపించడం చాలా తేలిక. అక్కడ రకరకాల ఆట వస్తువులు, కలర్ ఫుల్ గా క్లాసులు ఉండడం, మరి ముఖ్యంగా పేరెంట్స్ వేలు ఖర్చుపెట్టి ఫీజులు కడతారు కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారు. మరి ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటి?? ఇలాగే వీర్నపల్లి టీచర్స్ ఆలోచించారు.

ఇప్పుడు మనం చూస్తున్న స్కూల్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. ఓ వెలుగు వెలిగిన రాజు మరణం తర్వాత శిధిలమైన ఓ పురాతన భావనంలా ఉండేది. తమ పిల్లలలకు తమ కన్నా గొప్ప భవిషత్తును ఇవ్వాలనుకునే తల్లిదండ్రులు, చదువుతో పాటు ఆటలాడుకోవాలనుకునే పిల్లల దృష్టిలో ఈ స్కూల్ ఉండేది కాదు. ఇప్పుడు పటిష్టంగా నిర్మించి, పిల్లలకు ఇష్టమైన రైలు ఆకారంలో రంగులు వేయడంతో పిల్లలు, తల్లిదండ్రులే కాదు రాష్ట్రమంతా ఈ స్కూల్ గురుంచి మాట్లాడుకునే ప్రత్యేకతను సాదించుకున్నది.

వీర్నపల్లి లోని స్కూల్ పూర్తిగా రైలు ఆకారంలోనే ఉంటుంది. ముందు భాగంలో ఇంజిన్, తర్వాత బోగీలు పోలిన క్లాసు రూమ్ లు ఉంటాయి.. క్లాస్ రూమ్ తలుపులు, కిటికీలు కూడా పూర్తిగా రైలు తలుపులు, కిటికీలను పోలి ఉంటాయి. ఈ స్కూల్ గురుంచి తెలియని వారు ఎవరైనా సడెన్ గా చుస్తే మాత్రం ట్రైన్ ఏంటి ఇంత పెద్దగా ఉందని కాసేపు ఆశ్చర్యానికి లోనవుతారు ఖచ్చితంగా..

ఈ స్కూల్ ఇలా రూపాంతరం చెందడానికి గల ప్రధాన కారణం ఈ ఇందులో పనిచేసే స్కూల్ టీచర్స్. రైలు ఆకారం, గోడలమీద కార్టూన్ బొమ్మలతో స్కూల్ మారిస్తే బాగుంటుందని మంత్రి కే.టి.ఆర్ గారికి ఓ అర్జీ పెట్టుకున్నారు. ఈ ఆలోచన విభిన్నంగా ఉండడంతో మంత్రి గారు కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిధులు వాడుకోవచ్చని గైడెన్స్ ఇచ్చారు. ఈ విద్య సంవత్సరం ఇలా పూర్తిగా మారిపోవడంతో మునపటి కన్నా విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ స్కూల్ లో అడ్మిషన్ తీసుకుంటున్నారు..