What If...Comic Characters From Our Tollywood Movies Attack Donald Trump’s Policies?!

Updated on
What If...Comic Characters From Our Tollywood Movies Attack Donald Trump’s Policies?!

డోనాల్డ్ ట్రంప్,అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు. అయన పదవి స్వీకారానికి ముందు నుంచే వివాదానికి కేంద్ర బిందువు . అధికారం లోకి వొచ్చాక, వీసా ఆంక్షలు పెడుతూ విద్యార్థులకి,ఉద్యోగార్థులకు,కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. మన తెలుగు చిత్రాల్లోని కొన్ని పాత్రలు సరదాగా తమ శైలిలో విధానాలని ట్రంప్ విమర్శిస్తే ... ఓసారి చూద్దాం ఎలా ఉంటుందో …… ట్రంప్ గారి అభిమానులకి - సరదాగా తీసుకోవాలని మనవి. హాస్యం కోసం చేసిన చిన్న ప్రయత్నం .

శ్రీలక్మి From చంటబ్బాయ్ ఓరోరి ట్రంపు నీ మాటలతో చేస్తావు కంపు ………నా కవితలు వినసొంపు నువ్వా పేద్ద తోపు ?? ….. నా కవితలతో భళ్ళున పగిలేను నీ వీపు నువ్వో పెద్ద ముప్పు … నీకు కలగాలి కను విప్పు కొత్త వంటకం జామకాయ,జాజిపువ్వు,జీడిపప్పు కలిపి, జాజాజి జింగిరి అనే కొత్త వంటకం తయారు చేశా, అది పంపిస్తా . పడుకునేముందు తినేసేయ్. కాస్త పైత్యం తగ్గుతుంది .

TRP1

కొండల్రావు From SVSC ఎండోయ్ ట్రంపు గారు …………నాకు కజ్జికాయలంటే ఇష్టం మీకు గిల్లి కజ్జాలంటే ఇష్టం , మావాళ్లు మహా ముదుర్లండి , మా పెద్దోడు ఏకంగా పోలీసోడిని కొట్టేహేడు అనాసరంగా ఆయాసపడక హాయిగా కజ్జికాయలు తినండి

TRP2

జయసూర్య From కింగ్ రూల్స్ ఎలా ఉండాలి,????? నువ్వేం చేసావ్ అసలేమనుకున్నావ్ నీ గురించి చదువుకోడానికి అమెరికా వోచేవాడు ఒక వీసా కి అప్లై చేస్తాడు పెళ్లిచేసుకొని అమెరికా వోచే అమ్మాయి ఒక వీసా కి అప్లై చేస్తుంది ఉద్యోగం కోసం వొచ్చే వాళ్ళు,సెలవుల్లో వోచేవాళ్ళు ఇలా ఒక్కొక్కరు ఒక్కో వీసా కి అప్లై చేస్తుంటారు,వాళ్ళ అవసరాన్ని బట్టి వీసా ఇవ్వాలే కానీ ఈ ఆంక్షలేమిటి .. నీ నీచ భాషా నైపుణ్యం మీద పెట్టిన శ్రద్ధ ,మీవాళ్ళ వృత్తి నైపుణ్యం మీద పెట్టుంటే ఇలాంటి విద్వేషాలు వోచేవి కాదు అసలు మేము ఎక్కడికో వెళ్లాలనుకుంటాం మీరు వెళ్లనివ్వరు నేనేమంటానంటే ఐ వాంట్ visa . USA రావడానికి ,అక్కడ ఉండి కొన్నాళ్లపాటు అమెరికా శాస్త్రీయ సంగీతాన్ని ఉద్దరించాడనికి నాకు వీసా కావాలి .

TRP3

శ్రీశైలం అన్న of KSD Appalraju నా పేరు శ్రీశైలం నా గల్లీకి నేనే దాదా ఢిల్లీదాకా ఉంది నా దందా సై అంటే చేస్తా దోస్తీ నై అంటే పడతా కుస్తీ మా వాళ్ళను చెయ్యకు పరేషాన్ చేస్తే నీకుండదు రేషన్

TRP4

అరగుండు From అహనా పెళ్ళంటా ఒరేయ్ మళపత్రాష్టుడా చదుకోడానికి,ఉద్యోగాలకి మీ దగ్గరికొస్తే వింత వింత కండిషన్స్ పెడతావురా వికృత వీరా . మాబోటి వాళ్లంతా కలిస్తేనే కదరా మీరు ధనవంతులైంది . ఏరు దాటాక దాటాక తెప్పతగలేస్తావురా తింగరి సన్నాసి . మధ్యాహ్నం మండుటెండలో చెంబట్టుకొని మార్నింగ్ వాక్ కి వెళ్లే ఫైత్యేశ్వరా

TRP5

ఘంటస్తంభం వెంకటేశ్వరరావు From చాలాబాగుంది ఇదిగో అబ్బాయ్ ,నా మాటా ఆలకించు ……………నేరుగా హైడ్రాబాడ్ ఒచ్చెయ్ …..కోఠిలో దిగు …షేర్ ఆటో ఎక్కు , నాంపల్లి ఎల్లిపో . అక్కడ ఓ టీస్టాల్ ఉంటది,మాంచి ఇరానీ టీ తాగేయ్ …బస్సు ఎక్కు లక్డికాపూల్ ఎల్లిపో , ఖైరతాబాద్,దాటిపో ,అమీర్ పెట్ సిగ్నల్ దాటు,మైత్రీవనం దగ్గర ఆగకు,ఆ ట్రాఫిక్ లో తప్పిపోగలవ్ , ఎస్ఆర్ నగర్ దాటెయ్, మెల్లిగా ఎవరినైనా ఈ అడ్రెస్స్ అడుగు,లేదా నువ్ ఎప్పుడు అరుస్తావే అట్టా అరిసెయ్,ఆల్లే ఓచేసి తీస్కెళ్ళిపోతారు………….. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ……….

TRP6

ఖాదర్ From వెన్నెల ట్రంప్ కాక,గుస్సా ఎందుకైతావ్ Am Khadar ,U Dont Bother….మా దేశి పొరలకు నేనే చెప్పిన ఈడ దిల్ దార్ ఉండొచ్చని ..నువ్ గిట్ల ఆగం చేస్తే పొరలు ఎంగావాలే . బెంజ్ కొన్నంక లగ్గం చేస్కుంటా అని ఇన్నెండ్లు ఆగిన,ఇప్పుడు అమ్రిక పోరడు అంటే లగ్గానికి ఎవ్వల్ ఒస్తాలే. కాక ,నువ్ జరా బీపీ తగ్గించుకో . మా దేశి పొరలు మస్తు హుషార్ గాళ్ళు,నువ్ గిట్ల ఇదే లొల్లి చేసినవ్ అనుకో,మావోళ్ళే ఇండియా ని మీ దేశం కంటే గొప్పగా చేసేస్తారు,అప్పుడు ఇగ నీకు నిద్ర కూడా పట్టది . జరా సోచాయించు . ఉంటా .

TRP7