ముందుగా సుమారు ఒక 1000కోట్లు ఉండొచ్చు అనుకున్నారు కాని 1000 నుండి 15,000 కోట్లకు పైగా ఆస్థులున్నాయని విచారణలో తెలిసింది.. ఇదంతా సంపాదించిది కాదు దోచుకున్నది ఒకే ఒక వ్యక్తి అతనే నయీం..! అసలు నయీం ఎవడు ? అతని పేరు చెబితే అటు మావోయిస్టులు ఇటు పోలీసులు, మంత్రులు, ఎం.ఎల్.ఏ లు ఎందుకు వణికిపోతారు ?
నయీం పుట్టింది నల్గొండ జిల్లా భువనగిరి లో, డిగ్రీ పూర్తిచేశాడు. కొన్ని కారణాల మూలంగ అక్కడి లోకల్ పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టడంతో జైలు పాలైయ్యాడు. ఆ జైలులో ఖైదీలుగా ఉన్న కొంతమంది నక్సలైట్లతో ఏర్పడిన పరిచయం మూలంగా 19 ఏళ్ళకే పీపుల్స్ వార్ అనే మావోయిస్టు గ్రూపులో చేరి సమాజాన్ని ఏదో ఉద్దరించాలని అనుకున్నాడు.. స్వతహాగా నయీంకు చురుకుదనం ఎక్కువ చేరిన కొంతకాలానికే సుధాకర్, శాఖమూరి అప్పారావు లాంటి మావోయిస్ట్ అగ్రనేతలతో కలిసి పనిచేసేంతటి స్థాయికి ఎదిగాడు. అలా గ్రేహౌండ్స్ సృష్టికర్త ఐ.పి.ఎస్ వ్యాస్ ను చంపడంలో కీలకపాత్ర పోషించాడు. తన సోదరిని సాటి నక్సలైట్ ఈదన్న వేధిస్తున్నాడని అగ్రనేతలకు ఫిర్యదు చేసినా వారు పట్టించుకోక పోవడంతో ఆ దళం నుండి బయటకు వచ్చి వారిపై కక్ష పెంచుకొని మావోయిస్టులందరిని అంతం చేస్తానని శపదం చేశాడు. తమ్ముడు అలీమొద్దీన్ తో కలిసి ఈదన్నను హత్య చేయించాడు. ఈ హత్యకు ప్రతీకారంగా నయీం తమ్ముడిని పీపుల్స్ వార్ చంపేసింది.. తమ్ముడి హత్యలో కీలకంగా వ్యవహరించిన బెల్లి లలిత, పురుషోత్తంను వెంటాడి వేదించి బతికుండగానే 18 ముక్కలుగా నరికి చంపాడు నయీం.
ఇక అప్పటినుండి నయీం పోలీసులకు కోవర్టుగా మారిపోయాడు.. నక్సల్స్ రహస్యాలను చేరవేసి ఎంతో మంది నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేయడంలో నయీం సహకరించాడు. పోలీసుల అండతో కబ్జాలు, భూ దందాలు, సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా భువనగిరి నుండి హైదరాబాద్ వరకు విలువైన భూములలో తన స్థావరాలను ఏర్పాటు చేశాడు. నల్లమల్ల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సాకోబ్రాస్, క్రాంతి కోబ్రాస్ వంటి పదుల సంఖ్యలో గ్రూపులను ఏర్పాటుచేసి ఓ రౌడి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. తను అడిగినంతా డబ్బు ఇవ్వాలి, అడిగిన ధరకే భూమిని అమ్మేయాలి లేదంటే చంపటానికి కూడా వెనుకాడే వాడు కాదు..! బెదిరింపులు కూడా మాములుగా ఉండవు బాగా డబ్బున్న వ్యక్తుల వివరాలను తెలుసుకొని నేను అడిగినంత డబ్బులను ఇవ్వకుంటే పలానాచోట ఉన్న నీ కొడుకు చస్తాడు అని బెదిరించి, మనసికంగా హింసించి భయాన్ని పెట్టుబడి పెట్టిన రాక్షసుడు నయీం. నయీం గ్యాంగ్ ఒక పద్దతి ప్రకారం హత్యలు చేసేవారు. మాట వినని వారిని చంపి కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయేవారు. ఇలా సామ్రాజ్యాన్ని కొనసాగిస్తునే తనకు ఎవరు పోటి వచ్చినా చంపేసేవాడు అలానే మాజీ నక్సలైట్ సాంబశివుడు, రాములును హత్యచేయించాడు. నయీం ను నేను బహిరంగాంగ చంపుతా అని మీడియా ముందు చెప్పిన పటోళ్ళ గోవర్దన్ రెడ్డిని కోర్టులోనే వేట కోడవళ్ళతో నరికిచంపిన నరహంతకుడు నయీం.
అలా 70కి పైగా హత్య ఆరోపనలు, వందల సంఖ్యలలో బెదిరింపు కేసులు నయీంపై నమోదు అయ్యాయి.. పోలీసుల నుండి ప్రత్యేక్షంగా సహాయం అందేదని ఆరోపనలున్నాయి. పోలీసుల నుండి ఇప్పటికి 18 సార్లు తప్పించికోవడం అంటే వారి సహాయం లేకుండా ఇది సాద్యపడదు అన్న ఆరోపనలున్నాయి. కొంతమంది ఐ.పి.యస్ లు, ఐ.ఏ.యస్ లు, కొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 63 మంది జర్నలిస్టులను పెంచి పోషిస్తున్నాడని ఆరోపనలు కూడా ఉన్నాయి. కొంతమంది మంత్రులను బెదిరిస్తున్నాడని అందుకు రక్షణగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ వారికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నయీం చావు తర్వాత ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంటే తెలిసిన నిజాలేమిటంటే కేవలం హైదరబాద్ చుట్టు పక్కల ప్రాంతాలలోనే కొన్ని వందల ఎకరాల భూములున్నాయని 175 దస్తావేజులు స్వాధీనం చేసుకున్నాక తెలిసింది, ఇంకా బందువులు బినామి పేరు మీద ఉన్న కోట్ల ఆస్తుల వివరాలు కూడా బయటకు రాబోతున్నాయి.. కత్తి పట్టినోడు చివరికి ఆ కత్తివేటుతొనే చస్తాడు ఎన్ని కోట్లు అక్రమంగా సంపాదిస్తే ఏం లాభం చివరకు కుక్కచావు చచ్చాడు! దొరికిన వాడు మాత్రమే దొంగ ఇంకా నయీంకు సహకరించిన అధికారులు రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటపెట్టి వారిని కూడా శిక్షిస్తేనే ఇంకో నయీం పుట్టడు ..!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.