This Conversation Between Two Youngsters Will Show You The Exact Reason Why We Need Patriotism Today!

Updated on
This Conversation Between Two Youngsters Will Show You The Exact Reason Why We Need Patriotism Today!

ఫ్రెండ్ -1 : అరేయ్ మామ ! "My Experiments With Truth" అనే బుక్ చదివావా ? ఫ్రెండ్-2 : ఏరా ! కొత్తగా నువ్వు ఏనా రాస్తున్నావా ఏంటి ? ఇదెప్పట్నుంచిరోయ్ ! ఫ్రెండ్ -1 : అరేయ్ ! అది గాంధీగారి ఆటోబయోగ్రఫీ రా ! ఫ్రెండ్-2 : అరేయ్ , నువ్వు మరీ ఇంత పాతకాలపు మనిషివేంట్రా !! ఇప్పుడేమో గాంధీగారు అంటున్నావ్ , మొన్న ఏమో ఎవడో జార్జిబుష్ అన్నావ్ ! ఫ్రెండ్-1 : మామ అతను జార్జిబుష్ కాదురా... నెల్సన్ మండేలా ! ఫ్రెండ్ : అదే ఎవడొకడు ! ఇప్పుడేంటి నా ***** ఎవడికి కావాలి ? నామటుకు నేను Big bang T.V. Series చూస్తుంటే , ఏంటీ నీ గోల ?

Cut చేస్తే .......

పైన చెప్పినట్టు ఒక situation తీసుకుంటే, ఒక వందమంది యువత లో మహా ఐతే ఐదుగురు మాత్రమే దేశం పట్ల అవగాహనా , గౌరవం , బాధ్యత తో ఉంటున్నారు . బాధ్యత అనే పేద్ద పదాలు ఎందుకులేండి ! పైన చెప్పిన చిన్న conversation చాలు గా అర్థంచేసుకోడానికి !అవును కాసేపు ఏమాత్రం మొహమాటం లేకుండా ఒప్పేసుకుందాం . ఎందుకంటే , మనలో చాలామందికి Justin Bieber , Sunny leone తెలిసినంతగా మన దేశం గురించి కూసింతైనా తెలియదు . ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి . మనలో ఎంతమందికి "A Long Walk To Freedom" అనే Nelson Mandela గారి autobiography తెలుసు ? చాలామంది మొదటిసారి వింటుండచ్చు ఏమోకూడా .

ఈ విషయం లో అసలు మనది ఏ మాత్రం తప్పుకాదు . మనచేత చాలామంది తప్పులు చేయించేశారు . మొదటిది ............. స్కూల్ లో Independence Day నాడు , History లో చదువుకున్న గాంధీ , నెహ్రూ అని తెలిసిన పేర్లు చెప్పి , Flag Hoisting చేసేయడమే తప్ప , దేశం పట్ల మన కర్తవ్యం ఏంటి ?, మనం సమాజం లో ఎలా ఉండాలి అని ఏఒక్క ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పరు

రెండవది ...... ....... మన తల్లిదండ్రులు ! అవును వారే ! ఎప్పుడు వీలైతే అప్పుడు "ఎప్పుడూ ఆటలు , సినిమాలు , గాలికి తిరగడాలు .... ..... పుస్తకం తీసి చదువుకోవచ్చు గా " అని అంటారే తప్ప, నెలకి ఒకసారైనా వాళ్ళకి చదువు కాకుండా వేరే స్పెషల్ టాలెంట్ కూడా ఉందా అని మాత్రం చూడరు . చదువు ఎంత important ఓ , మనలో దాగున్న talents కూడా అంతే important . 21 ఏళ్ళకి సింధు Gold Medal కొడితే , మనం College లో Class జరుగుతుండగా Cricbuzz లో scores check చేసుకుంటుంటాం . అదీ తేడా అంటే !

మూడవది ........ మీరు చదువుతున్న కాలేజీ . అందులో మీకు తోడైన ఫ్రెండ్స్ . ఇది పైన చెప్పిన లాంటి situation ఏ లేండి . మనం పుట్టడం పుట్టడం ఒక మంచి దేశం లో పుట్టేసాం . ఎదో Social Studies లో History లో చదువుకున్నది తప్ప ఇంకేమైనా తెలుసా ? ఇంకేమైనా మానతరుపున దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా ?

Obama , Mandela లాంటి Global Leaders ని పక్కనపెడితే , కనీసం మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ , టంగుటూరి ప్రకాశం పంతులు , శ్రీశ్రీ .... ఇలాంటి వారి గురించి ఎప్పుడైనా విన్నామా ? మనం job చేసేటప్పుడు company గురించి ఎలా కచ్చితం గా తెలుసుకుంటామో , అలా మన దేశం గురించి తెలుసా ?గట్టిగా మాట్లాడితే Martin Luther King ఎవరో తెలీదు సరికదా .... మనం రిపబ్లిక్ డే అసలు ఎందుకు సెలెబ్రేట్ చేస్కుంటున్నామో చాలా మందికి తెలియనే తెలీదు .

జీవితం అంటే , Graduation -Enjoyment , Job-Enjoyment , Family-Enjoyment తప్ప ఇంకేముంది ? మొత్తం enjoyment ఏ గా . సరే కాలం ఇలాంటిది అని పక్కనపెడదాం . మనం ఇలా బ్రతికేస్తున్న దేశం లో స్వాతంత్య్రం కోసం ఎంతమంది 15 నుంచి 20 ఏళ్ల యువతీయువకులు ప్రాణాలు విడిచారో మనకి తెలుసా ? ఒక ఆడపిల్లల చదువు కోసం Malala Yousafzai ప్రాణాలు పణం గా పెట్టి పోరాడినందుకే Nobel Peace Prize ఇవ్వడం కరెక్ట్ ఏ అయితే , మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలొదిలిన వందలమంది యువత కి ఎన్ని Nobels ఇవ్వాలి ? అదే వయస్సు లో ఉన్న మనం ,, దేశం లో అత్యాచారాలు , బ్లాక్ మనీ కనిపిస్తుంటే , చూస్తూ కూర్చుంటున్నాం . డబ్బు సంపాదించి family ని పోషించాలి . కానీ డబ్బు అక్రమం గా ఎందుకు లాక్కోవాలి ? నీ చెల్లెలిని నువ్వు ఇంట్లో ఆటపట్టించచ్చు , కానీ నువ్వు.... బయట ఉన్న ప్రతీ అమ్మాయి ఒకడికి చెల్లి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావ్ ?

దేశం అంటే , కులం కాదు , మతం కాదు , ప్రాంతం కాదు . దేశం అంటే కలిసి కట్టుగా ఉండే ఒక జన సమూహం . దేశం మారాలి అంటున్నాం ,, మారాలి అంటే ?? మనలో మార్పు , ప్రజలలో మార్పు , Standard of Living లో మార్పు . చాలా మంది foreign వెళ్లే ఎందుకు చదువుకుని , అక్కడే settle అవుతారు ? ఎందుకంటే అక్కడ Standard of Living బావుంటుంది అని .. మరి మన దేశం లో ఎందుకు బాగోదు ? ఆ వచ్చింది Pin -Point question !!!

ఎందుకంటే ..... మన దేశం లో స్త్రీ కి రక్షణ సరిగ్గా లేనే లేదు . ఒక వయసొచ్చిన parents ని చూసుకోవడానికి , వాళ్ళ పిల్లలకి ప్రేమ లేదు . ఒక చిన్న పిల్లవాడి Passion ని అర్థంచేసుకొనే మనసు తల్లిదండ్రులకి లేదు . ఒక మనిషిని మరమనిషి గా మార్చేస్తున్న Colleges కి ఆలోచనా విధానం లేదు .. ఇవన్నీ మారినప్పుడే , మనిషి మారాడని గుర్తు . అలా ఒక్కోమనిషి మారినప్పుడే , మనుషులున్న ఈ సమాజం దేశాన్ని నిర్మిస్తుంది .

ఇలా అవ్వాలంటే నరనరాల్లో Patriotism ( దేశ భక్తి ) ఉండాలి ..... ఉండి తీరాలి . లేదంటే ఇంకా ఏ Big Bang T.V సీరీస్ చూసి టైంపాస్ చేస్తే , రేప్పొద్దున్న ఒక పదేళ్ళయ్యాకా కూడా మన పిల్లలు "India is STILL a developing country " అని చదువుకోవాల్సొస్తుంది .