This Story Of A Common Man's Journey To Achieve His Dreams Will Definitely Inspire You!

Updated on
This Story Of A Common Man's Journey To Achieve His Dreams Will Definitely Inspire You!

"కడుపులో పేగులు ఆకలితో హాహాకారాలు చేస్తున్నప్పుడు పుట్టాల్సింది బాధ కాదు,కసి. ఏది ఏమైనా అనుకున్నది సాధించి తీరాలన్న బలమైన కోరిక. ఇవి చాలు.మనిషి మహాపురుషుడవడానికి" అన్న విషయాన్ని తన జీవితం ద్వారా prove చేసిన ఒక వ్యక్తి గురించే ఈ article.

రెక్కాడితే గానీ డొక్కాడని ఒక కుటుంబం లో పుట్టి inter fail అయి, పెళ్లి చేసుకుని ఆటో నడుపుకొని బ్రతికే ఒక సాధారణ వ్యక్తి కలలు ఎలా ఉంటాయి? మహా అంటే ఒక సొంతిల్లు, పిల్లలు తనలా కాకుండా బాగా చదువుకోవాలని అనుకోవడం. కానీ,అతను సివిల్స్ సాధించాలని కలలు కన్నాడు. కేవలం ప్రతిభ ను తట్టిలేపే ఇష్టంతో కూడిన కష్టం, ప్రతిక్షణం విజయం సాధించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే బరువైన బాధ్యతలు, ఇవే ఆయుధాలుగా పరిస్థితులపై చేసిన యుద్ధం లో గెలిచి ,సివిల్స్ సాధించి డ్రైవర్ Balaraam ని, N.Balaraam Naik, IRS officer గా మారేలా చేసాయి.

బలరాం గారు మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం, తిరుమలాగిరి తండాలో ఒక కూలీ చేసుకొని బ్రతికే కుటుంబం లో పుట్టారు. ఆరుగురు అన్న దమ్ములు,ఒక చెల్లి ఉన్న ఆ కుటుంబంలో పెద్ద వాడు అవడం వల్ల చిన్ననాటి నుండి కుటుంబ బాధ్యతలు మోయాల్సివచ్చింది. ఏడవ తరగతి వరకు ఆ గ్రామంలో ,పదవతరగతి జడ్చర్ల లో పూర్తిచేశారు.

చిన్నప్పుడు ఆ గ్రామానికి వచ్చిన అధికారులను , వారి వాహనాలు చూసి ఏదో ఒక రోజు తానూ ఒక ప్రభుత్వహోదాలో ఉండాలి అని కలకన్నాడు.తనతో పాటూ ఆ కల కూడా పెరుగుతూ వచ్చింది. కానీ ,10th తర్వాత అమ్మానాన్నలు బ్రతుకు తెరువు కోసం హైద్రాబాద్ రావడం వల్ల ఇక్కడే బాగలింగంపల్లి లోని Ambedkar Junior college లో M P C గ్రూప్ లో జాయిన్ అయి fail అయ్యారు. తల్లి దండ్రులు కూడా పెళ్లికి ఒత్తిడి తేవడంతో తలొగ్గి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత కష్టాలు రెట్టింపయ్యాయి. సరిపోని సంపాదన, పిల్లలకు ఫీజులు కట్టలేని పరిస్థితి. కానీ, అర్థం చేసుకొనే అర్ధాంగి దొరకడం వల్ల తన ఆశయాన్ని సాధించాలనే కసి మళ్ళీ మొదలయ్యింది. Open University లో B.A.చదవడం ప్రారంభించారు. ఒకవైపు, పగటిపూట నాన్న పని చేసే గ్యాస్ కంపెనీ లో బండలు మోస్తూ,మరోవైపు రాత్రిపుట ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఒక పుస్తకం కొనడానికి వారం రోజులు పట్టేది. ఇలా ఎం.ఫిల్. పూర్తి చేశారు. Fail అయిన ఇంటర్ కూడా pass అయ్యారు. సివిల్స్ preparation ప్రారంభించి, 2006 లో తన భార్యచేత ఒక చిన్న షాప్ పెట్టించి.. స్టడీ సర్కిల్లో రెండేళ్ల పాటు చదివి 2009 లో group 2 సాధించారు. అయినా వెళ్లకుండా చదివి 2010 లో IRS గా సెలెక్ట్ అయి తను అనుకున్న సివిల్స్ సాధించారు.

ఈ క్రమం లో ప్రోత్సాహించిన వారి కంటే అవమానించిన వారే ఎక్కువ. గ్యాస్ కంపెనీ దగ్గర ఒక పాకలో ఉండే వారు. బలరాం గారు ప్రిపేర్ అవుతున్న విషయం తెలిసి తిట్టారు. నమస్కారం చెప్పకపోతే కోప్పడేవాడు. బంధువులు పిల్లలతో కలిసి చదువుతావా అంటూ హేళనగా నవ్వేవారు. ఇలా ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన సందర్బాలెన్నో. అయినా, నవ్వినా నాపచేనే పండింది. అప్పుడు అవమానించినవారే ఇప్పుడు గౌరవిస్తున్నారు. తనలా ఏ పేద విద్యార్థి కష్టపడకూడదని గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవాకార్యక్రామలు చేస్తున్నారు.తన గ్రామం ప్రాంతాల్లో 4 library లు ప్రారంభించి నిర్వహిస్తున్నారు. దాదాపు 30000 competitive books పంపిణీ చేశారు. ప్రస్తుతం,assistant commissioner of Excise and service taxes గా పనిచేస్తున్నారు.ఇలాంటి వాళ్ళ గురించేనేమో వేటూరి గారు రాసింది..... "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...మహా పురుషులవుతారు" అని......

Share this to inspire your friends.. Tag your friends to say that you believe in them.