The Actual Meaning Of These Lines From "Mari Anthaga" Song Is Hauntingly Beautiful!

Updated on
The Actual Meaning Of These Lines From "Mari Anthaga" Song Is Hauntingly Beautiful!
ఈ మధ్య 'Attitude' అనే మాట వింటున్నాము. 'ప్రేమ' అనే మాట తరువాత అంతటి తప్పుడు అర్థంతో ప్రాచుర్యం పొందుతున్న పదం ఈ 'Attitude' యే!

దీని పేరు చెప్పుకుని అస్సలు నవ్వడమే మానేసారు జనాలు... జోక్ వేసినా నవ్వరు! ఆనందం కలిగినా నవ్వరు! ఆఖరికి ఎదుటివాడిని పలకరిస్తూ కూడా నవ్వరు! వీడి ఆస్తి ఏదో వాడు రాయించుకోడానికి వస్తునట్టు మొహం 'ఉమ్మ్' అని పెడతారు!

అసలు Attitude అంటే ఇది కాదు! నిన్ను చూసి ఏడ్చేవాడి వైపు నువ్వు చూసి నవ్వగలగాలి, నీ నవ్వు చూసి వాడి తప్పు తెలుసుకుని సిగ్గుపడాలి! అది Attitude అంటే! మొహం మీద చెదరని 'చిరునవ్వు' ఆ 'చిరునవ్వు' ఆకాశంలో సూర్యుడిలాంటిది, అది లేని నీ మొహం నిశి మయం!

అలాంటి చిరునవ్వు గురించి సిరివెన్నెలగారు అర్థమయ్యే రీతిలో చెప్పారు!

'కన్నీరై కురవాలా? మన చుట్టూ ఉండే లోకం తడిసేలా! ముస్తాబే చెదరాలా? నిను చూడాలంటే అద్దం జడిసేలా!'

చుట్టూ ఉన్న లోకాన్ని తడిపేసేంత కన్నీరు కార్చాలా? అలా ఏడిస్తే 'Make-Up' చెదిరిపోతుంది అప్పుడు ఎలా ఉన్నావో చూసుకోడానికి వెళ్తే ఆ అద్దం సైతం భయపడుతుంది :P అద్దం భయపడడం ఏంటండీ! _/\_ ఎంత ఆలోచించి రాసారో ఆయన! పాటని చదువుతుంటేనే మొహంలో చిరునవ్వు వచ్చేస్తోంది

ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? ఏమి పోదు కదా? మరెందుకు ఏడవడం? ప్రయోజనం లేనప్పుడు! ఈ మాట మనం చాలా సార్లు విన్నాం, కానీ మనం ఆచరించం! 'అయ్యయ్యో' అని నెత్తి నోరు కొట్టేసుకోవడం వృధా! ఏమీ లాభం రాదు, సరి కదా నష్టమే అది!

చరణాలకి వస్తే ఈయన ఇచ్చే వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది! ఎండ-వాన-చలి, ఆయా కాలాలలో మనం సర్దుకుపోతామే తప్ప వాటి మీద కోప్పడం, శిక్షించం! పైగా ఉపయోగించేసుకుంటాము, ఎండకి ఊరగాయలనీ, వానకి నీటితో ఆటలు అలా... కానీ సాటి మనిషి విషయానికోస్తేనే మనం సర్దుకుపోము, అవతలవాడు సర్దుకుపోవాలని ఆనుకుంటాం! రోజూ ఏదో గొడవలు పడుతూ ఏంటి మనం సాధించేది?

అరేయ్! వాడు నవ్వలేదు, నువ్వు నవ్వి పలకరించొచ్చుగా? ఏ? ఏమవుతుంది అలా చేస్తే? వాడితో ఏదో ఇబ్బంది ఉంది, మాములుగా చెప్పు, కుదిరినంతవరకు సర్దుకుపో! అంతేకానీ అన్నింటికీ కోపమే ప్రత్యామ్న్యాయం కాదు కదా?

అసలు నీ ఇబ్బంది ఏంటి? చిరునవ్వు నవ్వడానికి? హా? దానికోసం నువ్వు చెమటలు ఏమైనా చిందించాలా? పోనీ పొలం దున్ని ఏమైనా పండించాలా? కాదే! సమాంతరంగా ఉన్న పెదవులని కాస్త ఆకారం మారిస్తే సరిపోతుంది!

అసలు మీరు గమనించారో లేదో, జంతువులకి నవ్వే అవకాశం లేదు, అవి నవ్వలేవు! నవ్వు కలిగిన, నవ్వగలిగిన ఏకైక జీవి మనిషే! (ఈ విషయం నేను కూడా గమనించలేదు, ఆయన చెప్పగా విన్నాను! కింద ఆయన మాటలలోనే చెప్పిన వీడియో లింక్ ఉంది!) అందుకే, నువ్వు జంతువువి కాదు మనిషివి అనేదానికి రుజువు(Proof) నీ చిరునవ్వే! అంతే కాదు మమతలను పెంచేది, మనసు తెరిపించేది కూడా అదే!

ఒక్క పాటలో, ఇంత అర్థవంతమైన భావాన్ని మనకి అందించారు ఆయన! _/\_

ఆఖరిగా నా మాటగా చెప్పేది ఏంటంటే... ‘చిరునవ్వుని’ నీ జీవిత కాలం మొహానికి అలంకరణలా ఉంచేసుకో! :) అంటే ఏదో కేవలం ఆనందం కలిగినప్పుడే కాదు! నవ్వోచ్చినప్పుడు ఎవ్వడైనా నవ్వుతాడు, కష్టాల్లో కూడా నవ్వగలిగేవాడే గొప్పోడవుతాడు! నీ నవ్వు ఎలా నవ్వలంటే, ఆ చంద్రుడు సైతం ఈర్ష పొందాలి! నిన్ను చూసి విధి వికటాట్టహాసం చేసినా, కాలం ఎడమ కాలితో తొక్కుతున్నా, అదృష్టం అణువంతయినా లేక, దురదృష్టం విశ్వరూపం దాల్చినా, ఆ దేవుడే పగబట్టి నీ వారిని చెరబట్టి నీకు ఒంటరితనాన్ని కట్టబెట్టినా, ఆఖరికి ఆ కాలుడే కాలపాశధరుడై ఎదురైనా, నీ నవ్వు నిన్ను వీడి వెళ్ళకూడదు!

ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించే ఆ దేవుడు సైతం, నీ చిరునవ్వు చూసి ఆయన చిరునవ్వు ఆపి ఆశ్చరం పొందాలి! 'వీడెవడురా బాబూ! ఎన్ని కష్టాలిచ్చినా ఈ నవ్వు మానట్లేదు! ఏం గుండె దైర్యంరా వీడిది!' అనుకోవాలి...

చివరాఖరిగా చెప్పొచ్చేదేంటంటే... అస్తమానూ నవ్వితే పిచ్చి అనుకుంటారేమో కానీ అస్సలు నవ్వకపోతే మాత్రం పశువు అనుకుంటారు!

Sirivennela gaaru about this song