కోటి విద్యలూ కూటి కొరకే అన్నారు . మనం ఎంత కష్టపడ్డా,ఎంత సంపాదించినా మన కడుపు నింపుకోడం కోసమే కదా.మనకి నచ్చిన భోజనం గురించి మాట్లాడుకుంటుంటేనే ఆహా అనిపిస్తుంది . ఇక విందు భోజనాలు వాటిలో పదార్దాల గురించి వివరిస్తూ ఒక్కోదాన్ని వర్ణిస్తూ మన రచయితలు రాసిన పాటలు వింటే నోరూరిపోతుంది . వినసొంపైన రీతిలో నోరూరింపచేసే ఆ పాటలు ఓసారి విందాం ..
1. వివాహ భోజనంబు విందైన వంటకంబు రచన - పింగళి నాగేంద్రరావు గారు . చిత్రం మాయాబజార్
2. తద్దినంబు భోజనం తలచుకుంటే చాలురా నోరూరుచుండెరా రచన - పింగళి నాగేంద్రరావు . చిత్రం - సత్య హరిశ్చంద్ర
3. విందు భోజనం పసందు భోజనం రచన - సముద్రాల చిత్రం - బాల భారతం
4. పప్పు దప్పళం రచన - ఆరుద్ర . చిత్రం - పెళ్లి పుస్తకం
5. కొబ్బరి నీళ్లా జలకాలాడి రచన - వేటూరి . చిత్రం రెండు జెళ్ళ సీత
6.ఆహా ఏమి రుచి అనరా మైమరచి రచన - సిరివెన్నెల సీతారామశాస్త్రి.చిత్రం ఎగిరే పావురమా
7.చిక్కలేదు చిన్నదాని ఆచూకీ రచన – చంద్రబోస్ .చిత్రం పెళ్లి సందడి
8. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం రచన - వేటూరి . చిత్రం - బాబాయ్ హోటల్
9. పుల్లని పుల్లట్టు చిత్రం బాబీ
10. ఆవకాయ మన అందరిదీ రచన -తనికెళ్ళ భరణి. చిత్రం మిధునం
11.ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా రచన - చంద్రబోస్. చిత్రం - ఉలవచారు బిర్యాని
కొందరికి ఉదయం ఫలహారం తరువాత లేదా భోజనం చేసాక కొంతసేపటికి కాఫీ , లేదా తేనీరు తీసుకోడం కొందరికి అలవాటు. అలాగే ఇన్ని పసందైన పాటలు విన్నాక ఈ పాటలు కూడా వినాలి కదా….. ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ రచన - చంద్రబోస్ . చిత్రం - మృగరాజు
కాఫీ దండకం రచన - జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు . చిత్రం - మిధునం