Here's How This Telugu Software Employee Left Her Job To Fulfil Her Dream Of Organic Farming!

Updated on
Here's How This Telugu Software Employee Left Her Job To Fulfil Her Dream Of Organic Farming!

అభిలాష్ 13సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నారు. అతని భార్య గారు కూడా ఫార్మసీ పూర్తిచేసి ఓ మల్టినేషనల్ కంపెనీలో నెలకు 80,000 సాలరీతో జాబ్ చేస్తున్నారు. హ్యాపీ ఫ్యామీలి. ఫైనన్షియల్ గా కూడా ఏ రకంగాను ఇబ్బందులు లేవు. "మనం చేస్తున్న పని మనకు ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా డబ్బు కూడా ఆదాయంగా వస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది". ఏ.సి రూంలో జాబ్ చేస్తు డబ్బు సంపాదించడం కన్నా సొంత భూమిలో దుక్కి దున్ని, చెమడోడ్చి సంపాదించడంలోనే ఎక్కువ తృప్తి ఉందని వారిద్దరూ సంవత్సరం క్రితం నుండి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.

వీరిది అనంతపురం జిల్లా గుడిబండ గ్రామం. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ భారతదేశంలోనే అతి తక్కువ వర్షాలు పడే ప్రాంతాలలో అనంతపురం జిల్లా కూడా ఒకటి. అలాంటి ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరం. ఆ గ్రామంలో ఉన్న రైతుల పిల్లలు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఏ ఐటి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటుంటే ఈ దంపతులు మాత్రం మంచి జీతం వచ్చే ఉద్యోగాలను వదిలి ఎంతో ప్రేమతో, నమ్మకంతో వ్యవసాయం మొదలుపెట్టారు.

వారికి ఆ ఊరిలో మొత్తం ఉన్న 25 ఎకరాలలో మొదట 15 ఎకరాల భూమిని వ్యవసాయానికి అనుకూలంగా చదును చేశారు. అనంతపురం జిల్లాలో నీటిబోర్ పడడం చాలా కష్టం, కాని అదృష్టవశాత్తు ఈ భూమిలో రెండు చోట్ల పడ్డాయి. పవర్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీలతో సోలార్ మోటార్ మిషిన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పద్దతులతో అంజూర, నిమ్మ, మామిడి, పుచ్చకాయ, జామ పండ్లను పండిస్తున్నారు.

ఆర్గానిక్ ఫార్మింగ్.. సుష్మ, అభిలాష్ గారు వ్యవసాయాన్ని ప్రారంభించే ముందు చాలా రీసేర్చ్ చేసి పకడ్బంది ప్లానింగ్ రూపొందించుకున్నారు. ఆ భూమి, వాతావరణం ఏ రకమైన పంటలకు అనుకూలంగా ఉంటుందో అని సైంటిస్ట్ ల సలహాలు తీసుకున్నారు. మిగిలిన వారిలా కాకుండా పెస్టిసైడ్స్ వాడకుండా "గో మూత్రం, పంచగవ్యం, జీవామృతం" లాంటి మన పెద్దలు అనుసరించిన సంప్రదాయ ఎరువులను ఉపయోగిస్తున్నారు. మంచి లాభాలను కూడా అందుకుంటున్నారు.. చదువుకోకుండా వ్యవసాయం చేసేవారికన్నా బాగా చదువుకుని ప్రస్తుత పరిస్థితులకు అనుగూణమైన పద్దతులతో, మంచి మార్కెటింగ్ మెళకువలతో ముందుకు సాగితే వ్యవసాయం ఊహించిన దాని కన్నా ఎక్కువ లాభాన్ని ఇస్తుందనడానికి వీరే ఓ చక్కని ఉదాహరణ.