సాధారణంగా మనం చూసిన, చూస్తున్న చాలామంది రచయితలలో ఒక స్వార్ధం ప్రస్పుటంగా కనిపిస్తుంటుంది "నాకు పేరు ఎక్కువ రావాలి, ఆ పేరుకు తగ్గ డబ్బు రావాలి" అని విపరీతంగా పరితపిస్తుంటారు. కాని అతి కొద్దిమంది మాత్రమే తన కలంతో ప్రాణ ప్రతిష్ట చేసిన అక్షర సంతానం దిక్కు మొక్కు లేని వారికి ఒక వెన్నుముకలా ఉండాలని నిజాయితిగా కోరుకుంటారు అలా కోరుకునే రచయితలలో అలిశెట్టి ప్రభాకర్ ఒక్కడు.! బ్రతికింది 39 సంవత్సరాలైనా ఆయన ఒక వీర సైనిక యువకునిలా బ్రతికారు, అక్షర ఆయుధంతో ప్రజల అజ్ఞానంపై యుద్ధం చేశారు.. చేస్తున్నారు..! జగిత్యాలలో 1954 లో జన్మించిన ఈ కవి చిన్ననాటి నుండే కష్టాలతో పోరాటం చేయడం నేర్చుకున్నారు. ఏడుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములున్న కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న తండ్రి మరణంతో 11 ఏళ్ళ వయసులోనే పనిచేయడం మొదలుపెట్టారు.
18 సంవత్సరాల నుండే కవితాస్త్రాలను సంధించడం మొదలుపెట్టారు. ఆయన కవిత్వం ఎప్పటికి కదలని కొండగా ఉండదు ఒక్కసారి సంధిస్తే లక్ష్యాన్ని ఛేదించే గురితప్పని బాణంలా ఉంటుంది. సమాజ హితం కోసమే తన అక్షరం పోరాటం చేసేది అంతేకాని పేరు డబ్బు కోసం కాదు.. పేజీలు పదుల సంఖ్యలో ఉన్న పుస్తకాలు వందల రూపాయాలకు అమ్మే రచయితలలా కాకుండా పేదవారికి కూడా అందుబాటులో తన రచనలను ఉంచారు.. అయన రాసిన చురకలు అనే పుస్తకం ధర ఒక రూపాయి, ఇలా అతి తక్కువ ధరకే అందించిన పుస్తకాలెన్నో.. ఎర్రపావురాలు, మరణం నా చివరి చరణం కాదు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీలైఫ్ ఇలాంటి కవితాస్తిని మనకు వీలునామాగా రాసి తిరిగిరాని లోకానికి పయనమయ్యారు(ఆయన పుట్టినరోజు చనిపోయిన రోజు ఒక్కటే). అలిశెట్టి వారి శైలిలా ఒక్క లైన్ లో చెప్పాలంటే "నిత్యం మండుతున్న సూర్యుడు ఆయన కవిత్వం లోని భావం".
అలిశెట్టి ప్రభాకర్ సంధించిన కొన్ని అక్షరాస్రాలు..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
Designs by Madhav Sai Jaswanth