Meet Teja, A Man With Golden Hearts Who's Rescuing Thousands Of Stray Dogs From Past The 15 Years

Updated on
Meet Teja, A Man With Golden Hearts Who's Rescuing Thousands Of Stray Dogs From Past The 15 Years

పర్సనల్ పని మీద ఒకరోజు తేజ బైక్ మీద వెళుతున్నాడు. మార్గం మధ్యలో ఓ దుర్మార్గుడు రోకలి లాంటి లావు పాటి కర్రతో సంవత్సరం వయసున్న వీది కుక్కను తల చిట్లేలా బలంగా కొట్టి నాలుగు కాళ్ళను తాడుతో కట్టి రోడ్డు పక్కన పడెయ్యడానికి ఈడ్చుకుని పోతున్నాడు. ఈ ఘటన చూసిన తేజ హుటాహుటిన వీడియో రికార్డ్ చేసి, స్నేహితులకు అలాగే పోలీస్ వారికి తెలియజేశారు చేశారు. లావు పాటి కర్రతో అలాంటి పనిచేసిన ఆ వ్యక్తిని చూసి భయపడక తేజ ఆ వ్యక్తిని ఆపాడు. ఇలోపు పక్కనే ఉన్న స్నేహితులు పోలీసులు కూడా రావడంతో విషయాన్ని, వీడియో రికార్డును మిత్రులకు పోలీసులకు అందజేసి తను మాత్రం కొనఊపిరితో ఉన్న ఆ కుక్కను వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కేవలం బ్రతుకుతుందన్న 1% ఆశతో డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. కొట్టిన దొబ్బలకు తలలో రంద్రం, దెబ్బలకు కళ్ళు లోపలికి వెళ్లినా కానీ చుట్టూ ఉండే మనుషుల ప్రేమ, కుక్క శరీరతత్వం మూలంగా ఆ కుక్క బ్రతికింది. ఆ కొట్టిన వ్యక్తిపై Pc act 1960 428, 429 కింద కేసు నమోదు చేశారు. దానికి "ఫైటర్" అని పేరు పెట్టాడు, మూడు సంవత్సరాల ఫైటర్ ప్రస్తుతం తేజ దగ్గరే ఉంది. ఇలా జంతువుల ప్రాణాలను కాపాడే కార్యక్రమాలను 15 సంవత్సరాలుగా తేజ చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20,000 కుక్కల ప్రాణాలు కాపాడగలిగారు.

తేజ ఒక ప్రయివేట్ యానిమాల్ గెస్ట్ హౌస్ ని కూడా రన్ చేస్తున్నారు. యజమాని ఊరికి వెళ్ళేటప్పుడు వారి పెట్స్ ని ఈ షెల్టర్ లో అప్పజెబితే వాటి బాగోగులు చూసుకుంటారు.

కుటుంబమంతా.. అమ్మ గారు కాలేజీ HOD, అలాగే కామర్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు, నాన్న గారు పెట్ ఫుడ్ షాప్ నడిపిస్తున్నారు, తమ్ముడు పెట్ గ్రూమింగ్ చేస్తుంటారు. వీరు ఉండేది హైదరాబాద్ ఓల్డ్ నల్లకుంటలో. తేజ కు చిన్నతనం నుండి జంతువులంటే మమకారం, 10వ తరగతిలో బ్లూ క్రాస్ లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుండి 8 సంవత్సరాల పాటు అందులో పనిచేసి ఇప్పుడు వ్యక్తిగతంగా ఎన్నో దిక్కు మొక్కులేని వీది కుక్కలను, పిల్లులను, గేదెలు, ఆవులను మొదలైన జంతువులను కాపాడగలుగుతున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నందుకు కుటుంబం చిన్నతనం నుండి చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇంటికి రావడం ఒక్కోసారి ఆలస్యమైనా జంతువులను హింసిస్తున్నందుకు ఫలానా వ్యక్తుల మీద పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతున్నా అమ్మ నాన్నలు ఏనాడు కూడా తేజలో భయాన్ని నూరిపోయలేదు.

యానిమాల్ యాక్ట్ అంటూ ఒకటి ఉంది, అది అతిక్రమిస్తే శిక్షార్హులు అన్న విషయం చాలామంది అధికారులకు పోలీసులకు కూడా తెలియదు. వీటిపైన కూడా తేజ అవగాహన కల్పిస్తున్నాడు.

ప్రాణాలకు తెగించి: ఒకరోజు హైదరాబాద్ శివారు ప్రాంతం నుండి ఒక కాల్ వచ్చింది ఓ పిల్లి నీళ్లు లేని బావిలో పడిపాయింది. అది ఇంటి బావి కనుక ఒక మనిషి పట్టేంత వెడల్పు మాత్రమే ఉంటుంది, లోపలికి వెళుతున్న కొద్దీ చీకటి, ఒక్కోసారి ఆక్సిజన్ లేక వివిధ రకాల వాయువులు వెలువడుతాయి, ప్రాణాలకే ప్రమాదం. తేజ నడుముకు తాడు కట్టుకుని జాగ్రత్తగా బావిలోకి దిగాడు. అదృష్టవశాత్తు పిల్లి ఆరోగ్యంగానే ఉంది, కాకపోతే పిల్లి చాలా కోపంగా ఒక వ్యక్తి వచ్చి నన్ను ఏదో చెయ్యబోతున్నాడన్న ప్రాణభయంతో అటాకింగ్ మోడ్ లో ఉంది. పిల్లిని తేజ పట్టుకోవడానికి ప్రయత్నించబోతుంటే గోర్లతో రక్కడానికి ప్రయత్నిస్తుంది, ఐన కానీ తేజ ఓపికతో అది శాంతించే వరకు ఎదురుచూసి దానిని మచ్చిక చేసుకుని ఒక నెట్ లో వేసుకుని పైకి తీసుకువచ్చాడు. ఇలాంటి ప్రాణాలకు తెగించిన సంఘటనలు కోకొల్లలు.

తేజ ఇంతకు మునుపు 8 సంవత్సరాల పాటు బ్లూ క్రాస్ లో పనిచేశారు. ప్రస్తుతం ఒంటరిగా జంతువుల ప్రాణాలను కాపాడుతున్నారు, తేజకు అన్నిరకాల సహాయం అందించడానికి మిత్రులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

కుక్కలపై జాలిపడలా.? వాటి నుండి మనకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా.? తేజ డిగ్రీ పూర్తిచేసి, యానిమాల్ బిహేవియర్ థెరపీ మీద కోర్స్ చేశారు. కుక్కలు ఇతర జంతువులను చంపడం గాని ఒదిలివెళ్లడం కూడా నేరం కిందకి వస్తుంది. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్ వారు కుక్కలను అనుమతించము అని అంటుంటారు నిజానికి అది కూడా చట్ట వ్యతిరేకం క్రిందికే వస్తుంది. అవ్వి కూడా మనలాంటి ప్రాణులే బ్రతకనిద్దాం అని జాలి పడాల్సిన అవసరం లేదు, వాటివల్ల కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

1. ప్రతిరోజూ మనం ఎన్నో రకాల పని ఒత్తిడులు, టెన్షన్లతో సతమతమవుతాము ఒక పది నిమిషాలు పెట్స్, కానీ బయటి జంతువులతో గడిపితే చాలా రిలీఫ్ గా ఉంటుందని సయింటిఫిక్ గా ప్రూవ్ అయ్యింది.

2. జర్మన్ షెఫర్డ్, లాబ్ లాంటి జాతి కుక్కలు నేరపరిశోధనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, అవ్వే గనుక లేకుంటే పరిస్థితులు మరోలా ఉండేవి.

3. ఇంట్లో ఒక కుక్క ఉండడం వల్ల ఇంటికి కాపలాగా ఉంటుంది, బంధువులు ఇంటికి వచ్చినా రెండోసారి వారిని ఆత్మీయంగా పలుకరిస్తుంది. డిప్రెషన్, ప్రేమ విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఒక కుక్కను పెంచుకుంటే చాలు.

4. రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొన్ని కుక్కలు మొరుగుతుంటాయి, నిజానికి అవ్వి వాటి భావాలను వ్యక్తికరించడానికి అలా వ్యవహరిస్తాయి కానీ ఎక్కువ శాతం కుక్కలు కేవలం నడుస్తున్నందుకే కరవడం చెయ్యవు. ఒక్కసారి వాటికి ఏదైనా భోజనం పెట్టిచూడండి, జీవితంలో మిమ్మల్ని చూసి మొరగవు.

5. విదేశాల్లో నుండి వచ్చిన కుక్కల కన్నా మన దేశవాళీ కుక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుంటాయి, ప్రత్యేకమైన ఖరీదైన ఆహారం లాంటివి కూడా అవసరం లేదు మనం తినే భోజనంతో పాటు కాస్త ప్రేమతో పంచినా చాలు..

మరింత సమాచారం కోసం: Facebook: https://www.facebook.com/Panneeru-Teja-K9-Behaviourist-Trainer-1520208928045416/ PH: 9642556967