Here’s The Deeper Meaning Of The Lyrics Of ‘Gelupu Thalupule’ Song From Teenmaar

Updated on
Here’s The Deeper Meaning Of The Lyrics Of ‘Gelupu Thalupule’ Song From Teenmaar

కొన్ని పాటలు ఉంటాయి. అలా చెవిలో earphones పెట్టుకుని వింటుంటే, ఎందుకో తెలియకుండా కళ్ళల్లో నుండి నీరు జారుతుంది. ఏవో ఆలోచిస్తూ ఉంటాం. మొత్తానికి ఆ పాట అయ్యేలోపు మనతో మనం చాలానే మాట్లాడేస్కుంటాం.

అలాంటి పాట తీన్ మార్ సినిమా లో గెలుపు తలుపులే తీసే అనే పాట. ఈ పాట రాసిన రచయిత రెహమాన్ కి, పాడిన శ్రీ రామ చంద్ర చాలా మంచి గుర్తింపు తెచ్చింది. ఒక పాట నచ్చిందంటే కొన్ని సార్లు అది పాడిన వ్యక్తి వల్ల కావచ్చు, కొన్ని సార్లు మ్యూజిక్ డైరెక్టర్ వల్ల కావచ్చు, కొన్ని రాసిన రచయిత వల్ల కావచ్చు. ముందు గా మణిశర్మ గారి ట్యూన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కార్యక్రమం ఈ ట్యూన్ ని లైవ్ గా perform చేశారు. చూసిన ప్రతిసారి ఒక మంచి అనుభూతి కలుగుతుంది.

https://youtu.be/GlYbTyDvvZI?t=2691

సాహిత్యం:

గెలుపు తలుపులే తీసే ఆకాశమే .. నేడు నా కోసమే ..
అడుగు మెరుపులా మారే ఆనందమే .. వీడదీ బంధమే ..

ఈ సినిమా లో హీరో కి ఎప్పటినుండో కల కన్నా ఉద్యోగం వస్తుంది. టార్గెట్స్, పేరు, అన్ని పెరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్లిన గెలుపు తలుపులు తీసి పలకరిస్తోంది. అడుగు మెరుపులంతా వేగంగా పడుతూ ఎక్కడ ఆగకుండా సాగుతోంది. తనకి గెలుపు కి మధ్య ఉన్న బంధం ఇక వీడదు అనేంత విజయాలను తను చూస్తున్నాడు.

ఎటువైపు వెళుతున్న .. వెలుగుల్నె చుస్తున్న .. మెరిసావే రంగుల్లొన…
కల తీరే సమయాన .. అల నెనై లేస్తున్న.. అనుకుందే చేసేస్తున్న ..
దారులన్నీ నాతో పాటుగా .. ఊయ్య లూగి పాటే పాడగా..
నన్ను వీడి కదలదు .. కాల మొక క్షణమైనా…

తను ఎక్కడికి వెళ్తున్న వెలుగులే కనిపిస్తున్నాయి.. ఎన్నో రంగులు మధ్య తన గెలుపు అందంగా మెరుస్తోంది. తన కలలు, అల లాగ ఎగిరి పెట్టుకుంటున్నాడు. అనుకుంది చేసేస్తున్నాడు. దారులన్నీ ఊయలలు ఊపి తనను నడిపిస్తున్నాయి. కాలం ఎలా నడుస్తోందంటే, అతను కాలం తో పరిగెత్తడం కాదు. కాలమే తనని విడవకుండా నడుస్తోంది.

ఎదలొ ఆశలన్నీ .. ఎదిగే కళ్ళ ముందరే ..
ఎగిరే ఊహలన్నీ .. నిజమై నన్ను చేరెలే ..
సందేహమేది లేదుగా .. సంతోషమంతా నాదిగా .. చుక్కల్లో చేరి చూపగా ..
ఉప్పొంగుతున్న హొరుగా… చిందేసి పాదమాడగ .. దిక్కుల్ని మీటి వీణగా…
చెలరేగి కదిలెను గాలి తరగలే పైన…
గెలుపు తలుపులే తీసే ఆకాశమే .. నేడు నా కొసమే

ఎదలో తనకు పుట్టిన ఒక ఆశ.. కళ్ల ముందు ఎదుగుతోంది
ఎక్కడెక్కడో ఎగురుతున్న ఊహలు, నిజమై తనంతట అవే వచ్చి చేరుతున్నాయి.
చుక్కల్లో తనని చేర్చి సంతోషమంతా తన సొంతమయ్యింది. దిక్కులన్నీ వీణలా మీటుతూ పాదం ఆడుతుంటే హోరులా అతను గాలి తరగల పైన చెలరేగి పరిగెడుతున్నాడు.

అలుపే రాదు అంటూ .. కొలిచా నింగి అంచులనే ..
జగమే ఏలుకుంటూ .. పరిచా కోటి కాంతులే ..
ఇవ్వాళ గుండెలో ఇలా .. చల్లారిపొని శ్వాసలా .. కమ్మేసుకుంది నీ కల ..
ఇన్నాళ్ళూ లేని లోటులా .. తెల్లారిపొని రేయిలా .. నన్నల్లుకుంటే నువ్వీల ..
నన్ను నేను గెలిచిన ఒంటరిగ నిలిచానే ..

అలుపు అనేది లేకుండా.. నింగి అంచుల దాకా తన ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలాలి అనేది తన తాపత్రయం.

కానీ..

ఇన్ని గెలుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఎక్కడ అతనికి ఓటమి కనిపించట్లేదు.. కానీ ఈ సంబరాన్ని తనతో పంచుకునే ఆ వ్యక్తి ఇప్పుడు తనతో లేరు. ఆ వ్యక్తి తాలూకు జ్ఞాపకాల కలలు అతన్ని కమ్మేస్తున్నాయి. ఇన్ని రోజులు గెలుపు కోసం పరుగులు తీసిన అతనికి వెనక్కి తిరిగి చూసుకుంటే తను ప్రేమించిన ఆ వ్యక్తి లేని లోటు తెలుస్తోంది. తన చీకటి ఆ అమ్మాయి లేకుండా వెలగదు అని అర్థమయ్యింది

అది అర్ధమయ్యే క్షణానికి తనని తానూ ఎంత గెలిచినా ఒంటరి గా మిగిలిపోయాడు.

కథ ఉన్న పాట చాలా అరుదుగా ఉంటాయి. ఈ పాట అలాంటి పాట. ఈ పాట లో ఒక కథ ఉంది. సినిమా లో హీరో కే కాదు, బయట కూడా చాలా మందికి వర్తించే కథ ఇది. మనకే తెలియకుండా మనం, మన ఆశల వైపు పరుగులు తీసేస్తూ ఒకసారి గెలిచాక ఆ గెలుపు పంచుకోవడానికి నిజమైన వ్యక్తి కనపడక చుట్టూ చాలా మంది ఉన్న ఒంటరి గా మిగిలిపోతాం. గెలుపు ఎంత ముఖ్యమో, ఆ గెలుపు ని పంచుకోవడానికి ఒక వ్యక్తి అంతే అవసరం అని ఈ పాట విన్న ప్రతి సారి అనిపించడం వల్ల ఏమో, ఒక సారి ఆలా జ్ఞాపకాల పుటల్లోకి వెళ్లి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాం.

ప్రస్తుతానికి ఈ పాట మరోసారి వినండి. మరొక్కసారి మరొక్క మంచి పాట గురించి మరోసారి మాట్లాడుకుందాం.

https://youtu.be/kuUJAfcW3LY