This Story Tells Us Why Relations Should Stay Stable Despite The Change In Technology

Updated on
This Story Tells Us Why Relations Should Stay Stable Despite The Change In Technology

Contributed By Praveen Reddy Gaddam

2052
Time: Evvaru pattinchukonantha
Oxygen: Undalsinantha
CO2: Kavalsinantha
Place:Marsha house,Elon musk colony, MARS.


Martha: అమ్మ! నాకు Assignment కి ఓక స్టోరీ కావాలి, ఏదైనా చెప్పవ.
Amma: నేను నా fav సీరియల్ 100k episode చూస్తున్నాను నన్ను disturb చెయ్యకు బంగారం.
Martha: నాన్న నువ్వైనా చెప్పవా
Nanna: నేను holographic-meeting లో ఉన్న బేబీ Earth వాళ్ళతో. ఇప్పుడు కాదు తరువాత చెప్తాను.
Martha: నేను వెళ్లి తాతయ్య ని అడుగుతాను
Amma: నో బేబీ, తాతయ్య కి హెల్త్ బాలేదు కదా rest తీస్కొని. Why can’t you ask your Pet robot and artificial intelligence
Martha: అది ఏమో theory లు ఇస్తుంది అమ్మ నాకు robot వి కాదు మనవి ఏదైనా జరిగిన స్టోరీస్ కావాలి.
Amma: వెళ్లి నాని(నానమ్మ)ని అడుగు
Martha: అమ్మో! నాని నా.. తాతయ్య ఎప్పుడు నానిని తిడ్తూ ఉంటాడు నాని కి ఎం తెలియదు, She is dumb అని.. సరే వెళ్లి అడుగుతా.
‘నాని ని లైఫ్ లో ఏదైనా సంఘటన లేదా ఏదైనా గొప్ప మార్పు గురించి నాకు చెప్పవ, నాకు Assignment కి కావాలి.

Earth.. అందులో మన INDIA, Year 2020.. Rhyming బాగుంది, ఆ సంవత్సరం కూడా బాగుంటుంది అని అనుకున్నాం.అప్పుడొచ్చింది ఒక వైరస్. కోవిడ్ వైరస్. ఆ వైరస్ అన్ని కంట్రీస్ కి వరల్డ్ టూర్ కి వెళ్లినట్టు ఇండియాలోకి వచ్చింది.తొందర వెళ్తుంది అనుకున్నాం కానీ ఒక సంవత్సరం పాటు వెంటాడుతుంది అనుకోలేదు.జైల్లో మనుషుల్లాగా మేము ఇంట్లోనే కాలక్షేపం చేసేవాళ్ళం.కర్చు లేకుండా కోపం ఒకటే అనుకున్న కానీ , ఇపుడు వైరస్ మన పక్క వీధి వరకి వచ్చింది అబ్బా అనే రోజులు తొందరగానే వచ్చాయి.కలిసుండే కాలం కాస్త కోవిడ్ కాలం అయ్యింది. ఆ వైరస్ వల్ల ఎంతో మంది చనిపోయారు, ఎంతో మందికి ఉద్యోగం లేకుండా పోయింది. మన ఇంటికి పని చేసే కూలి నుంచి,మన ఇంట్లో పని చేసే మనిషి వరకు అందరూ రోడ్డున్న పడ్డారు. చాలా మంది ఇది అంతం అని భయపడ్డారు. అదొక మర్చిపోలేని పీడకల.
Martha: మరి ఆ తరువాత ఏమైంది నాని. తాతయ్య ఎందుకు నిన్ను ఊరికే తిడుతుంటాడు.

నేను మీ తాతయ్య మా చిన్నప్పుడు స్కూల్ exams లో కలుసుకున్నాం. మాకు అప్పట్లో అందరికి ఒకటే రూమ్ లో కూర్చోబెట్టి రాయించేవారు. మీ తాతయ్య రాగానే ముచ్చట్లు పెట్టి, కాసేపు నవ్వుకుని ఆ తరువాత exam రాసి bye చెప్పుకొని వెళ్ళేవాళ్ళం. నాతో మాట్లాడటానికి తాతయ్య Facebook ఉందా అని అడిగాడు..అదొక మాట్లాడుకునే app.మీ జనరేషన్ కి అది అవసరంలేదు, మీకు కావాల్సినప్పుడు మీ ఫ్రెండ్స్ తో Holographic virtual reality లో మాట్లాడుకుంటున్నారు. కాని నెంబర్ అడిగుండాల్సింది మీ తాతయ్య , నేను ఇచ్చేదాన్ని మా అమ్మ నెంబర్. లాస్ట్ exam అయ్యిపోయింది, అందరూ ఆనందంలో ఉన్నారు. అ అల్లరిలో మీ తాతయ్య నాకు కనిపించలేదు.పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ అన్ని వెతికిన ఎక్కడ కనిపియ్యలేదు. ఎప్పుడు లేట్ గా వచ్చే మానాన్న, ఆ రోజు వీళ్ళు కలవడానికి వీల్లేదు అని ఎవరో పంపినట్టు వచ్చాడు.నేను బండి మీద కూర్చొని మీ తాతయ్య కోసం వెతుకుతున్నాను. మీ తాతయ్య ని చూసాను, నా వైపే చూస్తున్నాడు. Bye చెప్పొద్దు bye చెప్తే నేను చచ్చిన మళ్ళీ చూడను నీవైపు అని మనసులో అనుకుంటున్న.బండి స్టార్ట్ అయ్యింది.బండి నుంచి వచ్చే సౌండ్ కంటే నా గుండె సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నాకు. స్కూల్ కాంపౌండ్ దాటినం, తాతయ్య ఇంకా అలానే చూస్తున్నాడు.. పరిగెత్తి రావచ్చుకధ కొంత దూరం అని ఒక ఆలోచన. అలా వచ్చుంటే మా కథ బాగుండేది అని ఒక ఆరాటం.నెంబర్ ఇవ్వకుండా నేను తప్పు చేసాను,పరిగెత్తి నన్ను పట్టుకోలేక మీ తాతయ్య తప్పు చేసాడని ఎన్నోసార్లు భాధపడ్డాను. ఏడు సంవత్సరాలు పట్టింది మేము మళ్ళీ కలుసుకోవడానికి. ఆ కొన్నాళ్లకే మా పెళ్లయింది. పెళ్లయ్యాక మా మధ్య ఆవేశం, అసూయ వల్ల గొడవలు అయ్యాయి, కానీ వెంటనే మాట్లాడుకునేవాళ్ళం. ఎప్పుడు గొడవ వచ్చిన మీ తాతయ్య ఆ ఏడు సంవత్సరాలు నేను నీ గురించే ఆలోచించాను నీకైనా అంత ప్రేమ ఉందొ లేదో అని అంటుండేవాడు.కోవిడ్ కి రెండు నెలల ముందు, మీ తాతయ్య కి Accident అయింది. Coma లోకి వెళ్లారు. అప్పటికి మీ నాన్న వయస్సు పది. నావల్లే అయింది అని మా అత్తగారి నుండి ఆరోపణలు.కోవిడ్ వల్ల ట్రీట్మెంట్ ఇంట్లోనే జరిగేది తాతయ్య కి.కోవిడ్ వల్ల జరిగే ప్రాణనష్టం మీ తాతయ్యకి తెలియదు అని ఆనంద పడాల,ఇకపై మాములు మనిషి అవుతారా అని బాధపడాలో అర్ధం అయ్యెదికాదు. మీ నాన్నని పెంచి పెద్దచేసే క్రమంలో ఎన్నో అవమానాలు. భర్త లేని ఆడదాన్ని సమాజం ఒకలా చూస్తుంది, భర్త అవసరం లేకుండా పని చేస్తున్న ఆడదాన్ని సమాజం ఇంకోలా చూస్తుంది. ఆ చూసే చూపుల వల్ల నష్టం ఆడదానికి మాత్రమే. ఇక నుంచి నా బాధ్యత ఒకరు కాదు ఇద్దరు అని ముందుకు అడుగేసా. ఆటంకాలు మనిషికి మరో చుట్టం లాంటిది.. అప్పుడప్పుడే వచ్చిన దాని ప్రభావం గట్టిది. మనం ఉన్నమో లేదో తెలియని చుట్టాలకంటే, మన బాగోగులు అడిగే ఆత్మీయులు ఉండాలి. వాళ్ళు ఇచ్చిన ధైర్యమే నా విజయం అయ్యింది.నాకు ఎన్ని ఆటంకాలు వచ్చిన నన్ను గెల్పిస్తూ వచ్చారు.
మా నాన్న నాకు ఇష్టం లేని చదువుని చదువుపించి, ఇష్టం ఉన్న అబ్బాయిని వద్దన్నాడు. కానీ ఆ చదువే మీ తాతయ్య calendar లోని డేట్లని మీ నాన్న కలల్ని ముందుకు తీసుకెళ్లింది. మీ నాన్నకి డ్రైవర్ లేని కార్ ని కొనిచ్చా, మీ నాన్న కష్టం తో డ్రైవర్ని పెట్టి కుటుంబాన్ని నడిపించాడు, నీకు అసలు డ్రైవర్ తో పనిలేని కార్ ని కొనిచ్చాడు. కాలం మారింది కన్నీళ్లు కాస్త ఆనంద భాష్పాలు అయ్యాయి.

Martha: కాని నాని, నువ్వేం చేయకున్న తాతయ్య నిన్ను తిడుతున్నాడు ఇప్పుడు కూడా

నాని : తాతయ్య coma నుంచి బయటకి వచ్చినా ,ఇంకా ఆ ఏడేళ్ల నుంచి బయటకి రాలేదు.అదే ప్రేమ యొక్క గొప్పతనం.. నేను ఇంకా తనని వెతుక్కుంటూ రాలేదు , తనతో తన ప్రపంచం లో లేను అని అనుకుంటున్నాడు. ఆ ఏడేళ్లు తను నన్ను ఎంత ప్రేమించాడో ఎంత తల్చుకున్నాడో నాకు తన కోపం లొనే అర్థమైపోతుంది.. తాతయ్య ఎంత తిట్టినా నాకు తన మీద ఉన్న ప్రేమ తగ్గదు. అంతెందుకు తాతయ్య ఎంత తిట్టిన నాకు నువ్వు వద్దు నువ్వు వెళ్ళొపో అని ఎప్పుడు అనలేదు.. నాక్కూడా నువ్వంటే చాలా ఇష్టం, నికన్నా నేనె ఎక్కువ ప్రేమించాను ఆ రోజు నువ్వు అడగకున్న నీకు నెంబర్ ఇవ్వాల్సింది లేదా బండి మీద నుంచి దిగి నిన్ను పట్టుకొని నాకు కావాలి నువ్వు అని చెప్పాలనిపించింది తను దూరం అయ్యాకా.అలా చెప్పే అవకాశం నాకు రాలేదు అని భాధపడ్డాను.. తను ఏడేళ్లు తల్చుకున్నాడు, నేను తల్చుకున్న అనే అసూయ లో నా Argument మొదలయ్యేది. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది, మీ తాతయ్య ఎంత తిట్టిన అది ప్రేమ అనే ముందుకు వెళ్ళాలి , తగ్గి ఒదిగి ఉండాలి అని. అనుకున్నప్పుడల్లా , నాకు మీ తాతయ్య ఫేవరేట్ హీరో సినిమా లో dialouge గుర్తేచేది ఎక్కడ నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో తెలియాలి అని.
ఆలోచనలు , అవమానాలు, ఆరాటాలు , ఆత్మీయత, ఆవేశం,అసూయ, ఆటంకాలు,అవకాశాలు ఎల్లప్పుడు మనిషితో పాటు ఉండేవి. సందర్భాన్ని బట్టి వచ్చి వెళ్తుంటాయి మన దూరపు చుట్టంలా. కాని ఒక దానికి ఒకటికి చాలా దగ్గర బంధుత్వం ఉంటుంది.

ఏడేళ్లయిన ఎనభై ఐనా అవి మనతో వచ్చే పాత TECHNOLOGY..