"నాకు ఓనమాలు రావు, ఛందస్సు తెలీదు, ఉపమేయాలు ఉపమానాల ఊసే లేదు కాని ఒక్కడ్ని నమ్ముకున్నాను, ఇప్పుడు ఈ పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చానంటే అదంతా ఆయన కృప వలనె." 'శబ్బాష్ రా శంకరా!' పుస్తకం ఆవిష్కరణ రోజు తనికెళ్ళ భరణి గారు చెప్పిన మాటలవి. భరణి గారు తెలంగాణ యాసలో తెలుగు భాషతో చదువురాని వాళ్ళకు కూడా అర్ధమయ్యేలా రాసిన 'శబ్బాష్ రా శంకరా!' లో ప్రపంచంలో ప్రతీ విషయానికి శివుడిని కలిపిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే కనుక... అన్నిటిని వెయ్యలేం కనుక... ఈ పుస్తకం గురించి తెలీని వారికి పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో కొన్నిటిని అందిస్తున్నాం.
పూర్తిగా చదవాలనుకుంటే ఇక్కడ చదవండి.