Here's The 'Farmer's Version' Of SyeRaa Title Song

Updated on
Here's The 'Farmer's Version' Of SyeRaa Title Song

Contributed By Janardhan reddy

నిత్యం ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూ... తన జీవనాధారం కష్టమైనా.. లోకానికి జీవాధార అయిన ప్రతి రైతూ ఒక వీరుడే... అటువంటి వీరులకు ఈ గీతం అంకితం. Synchronise with lyrics of Syeraa title song.

సమస్త జాతి కడుపు నింపు అన్నదాత కదరా... జోహార్లు నీకు ధాత్రి పుత్రుడా... నేలమ్మ తల్లి పురుడు పోసి బతుకు పెంచితివిరా... జోహార్లు నీకు ధాత్రిపుత్రుడా...

హో సైరా.. హో సైరా.. హో సైరా.. మహరాజు లాగ నీవు సాగరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. తమస్సు నీకు బానిసాయెరా

మట్టి పరిమళాన్ని మదిలోన నింపి నీవు మానవాళినే పాలించినావురా ! గగన పొరలు చీల్చి, నీరమ్మ నేల చేర్చి నేలమ్మ మనసునే మధించినావురా !

కన్నీరు ఇంకె కటిక నేలలైనా హడలెత్తిపోని ఆత్మస్థైర్యమా! పన్నీరు పంచె పసిడి నేలలైనా ఈ మట్టి స్పర్శలో తరించినావురా

కరువు కాలమే కరిగిపోవనీ బంగారు పంటలే పలకరించనీ విశ్వాసం నీవేరా !!

నదీనదాలనన్నీ ప్రతీ పొలాన నింపి వరాల జల్లు తెచ్చినావురా... జనాల ఉనికి నిలిపే మరో విధాత అవగా ఈ అవని గడ్డ పులకరించెరా... సస్యశ్యామలముగా సమస్త భారతమును మార్చేసినావురా

ఓ హరిత వీరుడా ! అన్నపూర్ణ వంటి అనాది భారతాన్ని నీ ఒంటి చేతితో సృష్టించినావురా !!

హో సైరా.. హో సైరా.. హో సైరా.. మహరాజు లాగ నీవు సాగరా హో సైరా.. హో సైరా.. హో సైరా.. తమస్సు నీకు బానిసాయెరా