Here Are The Lyrics Of 'Sye Raa..' End Credits Song, That’s An Ode To Our Freedom Fighters.

Updated on
Here Are The Lyrics Of 'Sye Raa..' End Credits Song, That’s An Ode To Our Freedom Fighters.

సైరా సినిమాలో చంద్రబోస్ గారు ఒక పాట రాసారు. సినిమా అంత అయ్యాక మన స్వాతంత్ర సమరయోధులని స్మరిస్తూ వచ్చే పాట అది.

ఆ పాట ని రాసిన చంద్రబోస్ గారు, తన చేతి రాత లో ఉన్న ఆ పాట సాహిత్యాన్ని పోస్ట్ చేశారు.

చాలా సులువైన పదాలతో, గొప్ప అర్ధం దాగున్న సాహిత్యం ఉంది ఈ పాటలో.

పల్లవి: శ్వాసలోన దేశమే గుండె ఘోష లోన దేశమే ప్రాణనాడి లోన దేశమే ప్రాణమంత తల్లి కోసమే

మాట లోన దేశమే కత్తి వేటులోన దేశమే కాలి అడుగులోన దేశమే కాలి బూడిదైన తల్లి కోసమే దేశమే నువ్వురా... సందేశమయ్యెరా...

చరణం: చిన్నారి ప్రాయమందున కన్నోళ్ళనొదిలినావురా కన్నీట పదునుతేలెరా.. ఖడ్గమే

ప్రయాణమైన పోరులో ప్రేమింకా యింకి పోయెరా దోసిట్లో దాచి నావురా... సంద్రమే

ప్రజల స్వేచ్ఛకై ప్రాణాలనొదులుతూ పతాకమల్లె ఎగిరినావురా... దేశమే నువ్వురా...సందేశమయ్యెరా...

In Tinglish: Pallavi: Swaasalona Desame.. Gunde Ghoshalona Desame.. Praana naadilona Desame.. Praanamantha thalli kosame.. Maatalona Desame.. Kathi Vetulona Desame.. Kaali adugulona Desame.. Kaali bhoodidaina Thalli Kosame..

Desame Nuvvu Raa.. Sandesamayye Raa..

Charanam: Chinnari praayamanduna.. Kannollanu Odilinaavu Raa.. Kanneeta Padhunu Thele Raa.. Khadgame prayaanamaina Porulo.. Preminka Inki Poye Raa.. Dhositlo Dhaachinaavu Raa.. Sandrame..... Prajala Swechakai Praanaalanu Odhuluthoo... Pathaakamalle Egirinaavu Raa...

Desame Nuvvu Raa.. Sandesamayye Raa..

ఎందరో పోరాటానికి ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వతంత్రం. వాళ్ళ శ్వాసగా, గుండెచప్పుడ్ల, దేశాన్ని, దేశ స్వాతంత్య్రాన్ని మార్చుకున్నారు. చావువరకు ప్రతి అడుగున దేశం కోసమే పోరాడారు, దేశం లా నిలిచిపోయారు. వారి పోరాటం మనకు ఒక సందేశంగా నిలిచింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి లాంటి వాళ్ళెందరో, దేశం కోసం కుటుంబాన్ని, బంధాల్ని వదిలి పోరాడినవారు. వాళ్ళందరూ దేశ పతాక రెపరెపలో నిలిచిపోతారు. సైరా సినిమా అంత అయ్యాక ఈ పాట.. నేతాజీ, భగత్ సింగ్ లాంటి వీరులకి నివాళి గా నిలిచింది.