Here's Why K Viswanath Gari 'Swayamkrushi' Is A True Masterpiece

Updated on
Here's Why K Viswanath Gari 'Swayamkrushi' Is A True Masterpiece

కొన్ని సినిమాలు ,మనల్ని విజిల్స్ కొట్టేలా చేస్తాయి. కొన్ని సినిమాలు, మనల్ని ఒక పాఠాన్ని శ్రద్ధగా వినే విద్యార్ధి లా మార్చేస్తాయి. కే.విశ్వనాథ్ గారి సినిమాలలో ఎన్నో సినిమాలు మనలోని ఆ విద్యార్ధి ని తట్టిలేపేవే..."ఇలాంటి సినిమా ఒకటి తీయాలి" అని ప్రతి డైరెక్టర్ కి అనిపించే సినిమాలని ఆయన చాలా చేశారు.., అందులో ఒక సినిమా "స్వయంకృషి"

అప్పటికే చిరంజీవి కి "సుప్రీమ్ హీరో" అనే బిరుదు వచ్చేసింది. చిరంజీవి సినిమా అంటే బైక్ ఛేజ్ లు, ఫైట్ లు సాధారణం అయిపొయింది. అలాంటి టైం లో ఈ మూవీ లో చిరంజీవి పాత్ర చాలా సాధారణంగా,చెప్పులు కుట్టుకుంటూ, రేడియోలో హిందీ పాఠాలు వింటూ, చనిపోయిన తన చెల్లి కొడుకుని సాకుతూ.. ఒక పెద్ద చెప్పుల షాపు పెట్టుకోవాలని కలలు కనే ఒక సాధారణ మనిషి గా మొదలవుతుంది. చిరంజీవి పాత్ర లో ఉన్న క్రమశిక్షణ ని, నిబద్ధత ని విశ్వనాథ్ గారు చాలా బాగా చూపించారు. చిరంజీవి పాత్ర సాంబయ్య కలలో కూడా "తన షాపు లో ఉన్న చెప్పులను, షర్ట్ లను సర్దుతున్నట్టు ఊహించుకుంటాడు" ఆ ఒక్క షాట్ లో సాంబయ్య పాత్రని చాలా బాగా establish చేశారు.

ఈ సినిమాలో ఇంకో అద్భుతమైన పాత్ర, విజయశాంతి గారు చేసిన గంగ పాత్ర. సాంబయ్య తన మరదలిని ప్రేమిస్తున్నాడని తెలుసు కానీ, తనని అమితంగా ప్రేమిస్తుంది గంగ, సాంబయ్య పడే కష్టం లో తాను తోడు గా నిలుస్తుంది. ఆ పాత్ర లో ప్రేమ ని ఆప్యాయతని, చాలా బాగా చూపిస్తారు. వారి ఇద్దరి ప్రేమ లో పరిపక్వత ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే విధానం చాలా బాగుంటుంది. వీరి ప్రయాణం లో ని ఒడిదుడుకులే ఈ కథ..

తన మరదలిని ప్రేమిస్తాడు సాంబయ్య, ఆ అమ్మాయి వేరే అతనిని ప్రేమిస్తుంది, కానీ సాంబయ్య తన ప్రయాణాన్ని ఆపకుండా సాగిస్తాడు. తన చుట్టూ ఉండే స్నేహితులని, తనలా కష్టపడే వాళ్ళని, తనతో పాటే ఎదగడానికి సాయపడతాడు.., మనం ఎడుగుతున్నప్పుడు, మనతో పాటు పదిమందిని ఎదగనిచిన్నప్పుడు, ఎప్పుడైనా మనం కింద పడ్డప్పుడు మిగిలిన వాళ్ళ చేయూత మనకు దొరుకుతుంది. ఈ విషయాన్నీ చాలా బాగా చూపిస్తారు ఈ సినిమాలో

సినిమా మొదటి భాగమంతా, సాంబయ్య ఎదిగే క్రమాన్ని, తన ఎదుగుదలకు సాయపడే వ్యక్తులని, అడ్డుపడే వ్యక్తులని వీటన్నిటిని కలుపుకుంటూ సాంబయ్య గెలుపుని చూపిస్తారు. ఆ తరువాత భాగం లో ఎదిగిన సాంబయ్య తన చెల్లెలి కొడుకుని కూడా చిన్నప్పటి నుండి కష్టపడే తత్వాన్ని నేర్పించాలనుకుంటాడు... ఈ క్రమం లో good parenting & bad parenting మధ్య తేడాని చాలా సహజంగా చూపించారు విశ్వనాథ్ గారు. మంచి ఎంత కష్టమో చెడు / కి ఆకర్షణ అవ్వడం ఎంత సులువో "చిన్న" పాత్ర ద్వారా బాగా అర్థమయ్యేలా వివరిస్తారు.

ఒక పాత్ర ని సృష్టించి, ఆ పాత్ర పేరు నుండే ఆ పాత్ర గుణాన్ని తెలపాలి.., ఈ సినిమాలో హీరో కి శివుడి పేరుని పెట్టడమే కాదు, శివుడి వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా ఇమడ్చారు విశ్వనాథ్ గారు. మరి ముఖ్యంగా ఒక సమయం లో తను పెంచుకున్న చిన్న, సాంబయ్య ని కాదని వెళ్ళిపోతాడు. ఈ విషయం లో సాంబయ్య కి కోపమొస్తుంది, వెంటనే తన షాపు కి వెళ్లి చెప్పని కుట్టడం మొదలు పెడుతారు, వెనక background లో శివతాండవం వినిపిస్తుంది. ఈ సీన్ చాలా బాగుంటుంది.

ఏ తండ్రి అయినా తన కొడుకు విషయం లో కఠినంగా ఉంటారు,ఉండాలి. సాంబయ్య తన కొడుకు విషయం లో చాలా కఠినంగా ఉంటాడు, ఆ పిల్లడు ఎవరితోనో గొడవ పడితే, ఆ గొడవ పడిన వాళ్ళ ఇంటికి వెళ్లి తినేసి వస్తారు, షూ పోలిష్ చేయలేదని పనివాడిని కొడితే, కొడుకు చేతే పోలిష్ చేయిస్తాడు తను. ఈ క్రమం లో మొదట్లో తండ్రి అంటే ఇష్టపడని కొడుకుని తరువాత అర్ధం చేస్కుని తండ్రి మార్గం లో ప్రయాణిస్తాడు.. ఇలా ఎన్నో సన్నివేశాల మధ్య మనిషి ఆదర్శ వంతమైన ప్రయాణాన్ని చూపించిన సినిమా స్వయంకృషి. హీరో గా కన్న నటుడిగా చిరంజీవి ని elevate chesina cinema.