కొంతమంది కామెడి అస్సలు బోర్ కొట్టదండి.. అది ఎన్నిసార్లు చూసినా కాని అదే ఫీల్ ఉంటుంది అలాంటి కామెడి అందించిన ఆర్టిస్టులలో సుత్తివేలు కూడా తప్పక ఉంటారు. సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. సినిమాలో లానే చిన్నతనం లో చాలా అల్లరి చేసేవాడు. ఇంకా చాలా సన్నగా ఉండేవాడు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు.ఈయన నటించిన నాలుగు స్తంభాలాట లో ఈయన పాత్ర పేరు 'సుత్తి' ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాలంటే చాలా ఇష్టం..
సుత్తివేలు పుట్టింది 1947అగస్ట్8 భోగిరెడ్డి పల్లిలో. ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. పి.యు.సి చదివిన తరువాత హైదరాబాద్ లో ఉదోగం ప్రారంభించాడు. ఇలా కొన్ని సంవత్సరాలు చేసినా నటనమీద ఉన్న ఆసక్తితో ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారం లో అయనకు రిసెప్షనిష్టు గా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. ఆ తర్వాత జంధ్యాల తన సినిమాలలో వరుసగా అవకాశాలు ఇచ్చారు. సుత్తివేలు అంటే స్వచ్చమైన అచ్చతెలుగు కామెడి.. ఎక్కడా కూడా డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా మంచి కామెడిని పండించగలరు.
సుత్తి నటించిన కొన్ని మరుపురాని సినిమాలు
1.చంటబ్బాయ్
2.గీతాంజలి
3.అదిత్య 369
4.ఎదురుంటిమొగుడు పక్కింటి పెళ్ళాం
5.అనగనగా ఒక రోజు
6.నాలుగు స్తంభాలాట
7.సీతారామ కళ్యాణం
8.అప్పుల అప్పారావు
9.కలెక్టర్ గారి అబ్బాయి
10. హై హై నాయాక
11.నెలవంక
12.బంధువులు వస్తున్నారు జాగ్రత్త
13. శ్రీవారి శోభనం
Also, do SUBSCRIBE to our YouTube channel for more awesome video content, delivered directly to your inbox.