When You Don't Have Time To Help.. At Least Support The Ones Who Are Helping.. A Short Story

Updated on
When You Don't Have Time To Help.. At Least Support The Ones Who Are Helping.. A Short Story

Contributed By Hari Atthaluri

ఏంట్రా ఏం చేస్తున్నావ్ అంటూ కృష్ణ ఫోన్ చేశాడు... లిఫ్ట్ చేసి ఏముంది రా.. As usual lock down ,ఇంకేంటి రా కబుర్లు అని నేను అనడం ఆలస్యం, వాడు one by one, Instagram stories లా అందరి గురించి update ఆపకుండా ఇస్తూనే ఉన్నాడు...

ఇంతలో ప్రతాప్ గాడి topic తీశాడు వాడే.. ఆ ప్రతాప్ గాడు ఏంటి రా , ఈ కరోనా టైమ్ లో కూడా అలా రోడ్స్ మీదే తిరుగుతున్నాడు...

వీడు ఇచ్చేది 400 బిస్కట్ ప్యాకెట్లు.. దానికి 40 ఫోటోలు పెడతాడు.... చిన్న హెల్ప్ చేయటం.. ఇలా Facebook lo , insta lo, WhatsApp లో వేసేయటం.. ఆ photos తో పాటు మళ్లీ మంచి మంచి quotation లు...అవి వెతకటానికి ఓ పూట..ఆ తీసిన ఫొటోస్ లో మంచివి వెతుక్కుని పోస్ట్ చేయటానికి ఇంకో పూట... వాటికి వచ్చిన likes, comments చూసుకుంటూ రోజు అంతా వాడికి time pass యేరా అంటూ వెటకారంగా నవ్వాడు...

ఈ లోపు నాకు అర్దం ఐయ్యింది ఏంటి అంటే, ten minutes back ఆ post కే good job man అని నేను పెట్టిన కామెంట్ చూసి, వీడు నాకు కాల్ చేసాడు అని... మళ్లీ వాడే అందుకున్నాడు, నీకు గుర్తుందారా వాడు చిన్నప్పుడు రూపాయి తీయటానికి కూడా ఎంత ఆలోచించేవాడు రా.. ఇపుడేమో పెద్ద దాన కర్ణుడు అన్నట్టు full buildup...

వాడు అలా ప్రతాప్ గురించి చెప్తుంటే.. నాకొకటి అనిపించింది..

"ఎవడి గురించి ఐనా మంచి చెప్పాల్సి వేస్తే మొహమాటం కొద్దీ చెప్తారు కానీ చెడు చెప్పాలి అంటే మాత్రం, లేని చెత్త కూడా కలిపి చెప్తారు అని" ఇంక ఆ మాటల ఫ్లో లోనే.. ఆ మాటలు నేను వినలేను అన్నట్టు నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఐపోయింది... ఛార్జింగ్ పెట్టీ, ఆగిపోయిన వాడి మాటల వెల్లువ దగ్గర నుంచి ఆలోచిస్తున్నా... "నీకు గుర్తు ఉందారా, చిన్నప్పుడు" అని వాడు అన్నప్పుడే flashback లోకి వెళ్ళిపోయాను...

అవును ! అప్పట్లో ప్రతాప్ నిజం గా రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించేవాడు... నేను కూడా చాలా సార్లు ఏంటి వీడు అనుకునే వాడిని... కానీ మాలో చాలా మందికి వాడు అక్కడ వరకే తెలుసు... ఒకసారి బస్ లో వెళ్తూ చూసా... రోడ్ సైడ్ ఉన్న వాళ్లకి ఫుడ్ ప్యాకెట్లు ఇస్తుంటే.. ఇంకోసారి ఇంకెవరో చెప్పారు, ఫ్రీ గా పేద పిల్లలకి tution చెప్తున్నాడు ని... వాడి birthday కి ఒక్కసారి కూడా మమ్మల్ని invite చేయలేదు...మేము కూడా అడగలేదు... కానీ వాడు తన పుట్టినరోజు ని కాకుండా దగ్గర్లోని అనాధ శరణాలయం లోని 30 మంది పుట్టిన రోజులని, ప్రతి సంవత్సరం వాడు దాచుకున్న pocket money తోనే చేస్తున్నాడు అని.. ఇలా ఇవన్నీ మా వరకు రాలేదు కాబట్టి వాడిని కొంత మంది ఇంకా పిసినారి గానే అనుకునే వాళ్ళు .. తను కూడా ఇలా చేసేది ఎవ్వరికీ చెప్పేవాడు కాదు... మాక్కూడా తెలిసేది కాదు... వాడూ, వాడి మంచి మనసు అలా కొంత మంది వరకే తెలిసి ఆగిపోయింది...

కానీ చాలా సంవ్సరాల తర్వాత, ఓ సారి అనుకుకుండా వాడిని హాస్పిటల్ లో చూసా.. వాడు చాలా కంగారు గా ఉన్నాడు...నేను వెళ్లి ఏరా గుర్తు పట్టావా ! ఏం అయ్యింది రా. ఇంట్లో వాళ్ళకి ఏమైనా సీరియస్ ఆ అని... సీరియస్ యే కానీ, ఇంట్లో వాళ్ళకి కాదు రా, నాకు తెలిసిన కుర్రోడు రా, పాపం ఎవరూ లేరు.. ఆక్సిడెంట్ అయ్యింది... interview కోసం అని హైదరాబాద్ వచ్చి ఇలా అయ్యింది... నాకు ఏం చేయాలో అర్థం కావట్ల... నా దగ్గర ఉన్న రెండు లక్షలు కట్టేసా.. కానీ ఇంకా అయ్యేలా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్ల అని.. వెంటనే నువ్వు కంగారు పడకు..

ఈ హాస్పిటల్ incharge మా ఫ్యామిలీ ఫ్రెండ్...ముందు treatment continue చేయమని చెప్తా... money గురించి కూడా నువ్వు కంగారు పడకు... Adjust చేద్దాం.. నేను కొంచెం కాన్ఫిడెన్స్ తో చెప్పాక వాడు కొంచెం రిలాక్స్ అయ్యాడు... వెంటనే ఈ విషయం నా ఆఫీస్ WhatsApp group లో పోస్ట్ చేశా...అందరం కలిసి adjust చేశాం ఆ అబ్బాయి మళ్లీ లేచి నిలబడ్డాక, మా manager మా కంపెనీ లోనే తనికి job offer కూడా ఇచ్చాడు..

ఏదో కొంచెం satisfaction... life లో ఎన్ని ఉన్నా, అవేం ఇవ్వని ఓ చిన్న satisfaction.. నాకు థాంక్స్ చెప్దామని ప్రతాప్ ఇంటి వరకూ వచ్చాడు... కాదు రా నేనే నీకు థాంక్స్ చెప్పాలి... infact తిట్టాలి... వాడు కొంచెం షాక్ అయ్యాడు... ఎందుకు రా అన్నాడు..

అరేయ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మంచి పని చేస్తూనే ఉన్నావు... ఇంత satisafction ఫీలింగ్ ని పొందుతున్నావు... చిన్నప్పటి నుంచి నువ్వు చేసే మంచి పనులు మాక్కూడా చెప్తే మేము కూడా తలా మాకు తోచిన సాయం చేస్తాం కదా! నాలాగే చాలా మంది ఉంటారు రా... స్వతహాగా గా.. సొంతంగా...సాయం చేయటం రాదు..మంచి చేయాలి అని ఉన్నా ఎక్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియదు..మోహమాటం అనుకో..టైమ్ లేక అనుకో..ఇంకేమైనా అనుకో.. సాయం చేయాలి అని ఉన్నా సైలెంట్ గా ఉంటారు...ఉండిపోతారు... స్వార్థం తోనే తెలిసి తెలియకుండా బ్రతుకుతున్నాం... నువ్వు ఆ రోజు ఎదురు పడే వరకు నేను కూడా సాయం చేయగలను అని నాకు తెలియదు రా..

నలుగురు చేస్తున్నారు అని ఇంకో నలుగురు కి తెలిస్తేనే కదా... దాని విలువ తెలిసేది. ఇంకో నలుగురు ముందుకు వచ్చేది... వాళ్ళు పెట్టే పోస్ట్స్ వల్ల ఇంకో పది మందికి తెలుస్తుంది... సాయం చేయాలి అని ఉండి, ఏం చేయాలో..ఎలా చేయాలో తెలియని వాళ్ళకి ఓ దారి చూపిస్తుంది... అలా సాయం చేసే చేతులు పెరుగుతాయి కానీ తగ్గవు గా.. అలా నీలాగే ఆలోచించే ఇంకో నలబై మందిని నువ్వు inspire చేయగలవు కదా!

చిన్న incident కూడా ఇవాళ వైరల్ అయ్యి వేల మందికి తెలుస్తుంది, పబ్లిసిటీ వల్ల వేస్ట్ గాళ్లు కూడా ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతున్నారు... చెడుకే ఇంత పబ్లిసిటీ ఇస్తున్నప్పుడు.. మంచికి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలి రా.. infact దీనికే ఇంకా ఎక్కువ అవసరం...

ఒక్క ముక్క లో చెప్పనా.. "మంచిని కూడా మార్కెటింగ్ చేయాల్సిన రోజులు రా ఇవి". నేను చెప్పింది అంతా విన్నాక, అరేయ్ ఇన్ని రోజులు నాకు ఉన్నంతలో చేశా కానీ...ఎక్కువ గా ఆలోచించల.. నాలాగే అందరూ ఎవరికీ వాళ్ళు ముందుకు వచ్చి సాయం చేయాలి అని అనుకునేవాడిని... కానీ నువ్వు చెప్పాక ఇప్పుడు అర్దం అవుతుంది... నిజంగా ఇలా అలోచించి ఉంటే ఇంకా ఎక్కువ మందికి సాయం చేసే అవకాశం వచ్చి ఉండేది కదా.. అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ పెడదాం.. తప్పకుండా ఇక నుంచి మనం చేసే మంచి... చేయాలి అనుకునే సాయం గురించి అందరకీ తెలిసేలా చేద్దాం..

అలా ఒక organization పెట్టి అప్పట్నుంచి దాని తరుపున ఏం చేసినా అందరకీ తెలిసేలా posts పెడుతున్నారు... "ఏం సాయం చేస్తున్నామో దాని వరకే ఫోటోలు పెడతారు... సాయం పొందిన వాళ్ల ఫోటోలు మాత్రం పెట్టరు, మనం చేసే సాయం ఇంకొకరికి inspiration అవ్వాలి అనే ఆ పోస్ట్స్ కూడా పెట్టేది" ఈ కండిషన్ ఒప్పుకున్న వాళ్ళనే volunteers గా తీసుకుంటాం..

ఇలా ఇపుడు నాలాగే చాలా మంది అందులో భాగస్వాములం... Weeknd lo వచ్చే కుర్రోళ్ళు చాలా మందే ఉన్నారు... వాళ్ల పోస్ట్స్ వల్ల వచ్చే వాళ్ళు ఎక్కువ అయ్యారు... మా ఆక్టివిటీస్ కూడా పెరిగాయి... ఇలా అనుకుంటూ... ఫోన్ తో పాటు నేను కూడా flash back తో recharge అయ్యి , ఇదే విషయాన్ని మా కృష్ణ కి తీరిగ్గా ఫోన్ చేసి చెప్పాను... అవి biscuit packets యేరా... కానీ పంచింది 400 కాదు...40000... ఒక్క biscuit packets మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. ఒక్క రోజు కాదురా.. పది రోజులు గా... ఒక్కడు కాదు.. వంద మంది ఇదే పని లో ఉన్నారు అని..

ఒక్క హీరో ఇచ్చాడు అని తెలిస్తేనే గా.. వెంటనే మిగతా హీరో లు అందరూ తమ వంతు గా ఎంతో కొంత ఇచ్చారు... అలా మొదలు పెట్టేవాడు ఒకడు కావాలిరా.. మన ప్రతాప్ కూడా అలాంటివాడేరా..

"Sorry రా అన్నాడు" కృష్ణ . మనలో మనక ఇవన్నీ ఎందుకు రా... కుదిరితే ఎవరైనా లాక్ డౌన్ వల్ల నీ చుట్టు పక్కల ఇబ్బంది పడుతూ ఉంటే నీకు తోచినంత సాయం చెయ్ ! నీతో పాటు ఇంకో నలుగురిని కూడా involve చేయరా ! "అందరం ఇంట్లోనే కూర్చుని ఉంటే కాయ కష్టం చేసుకునే వాడి ఆకలి ఎలా తీరుతుంది రా..!" "అర్దం అయ్యింది రా" అన్న కృష్ణ గాడి మాటల్లో ఈ సారి వెటకారం వినపించలేదు.. ఇంక ఉంటా రా అని ఫోన్ పెట్టేశాను.. నేను చెప్పిన ఆ నాలుగు మాటలు సాయం రూపం లో మారి ఇంకో నలుగురికి ఉపయోగపడితే చాలు అనే ఆశ తో...

అనుకున్నట్టే కృష్ణ గాడు నన్ను Tag చేస్తూ రెండు రోజుల్లో పోస్ట్ పెట్టాడు.. "Good job man" అని same comment పెట్టాను.. కానీ ఈ సారి ఇంకా ఎక్కువ ఆనందం తో...