నీ సమస్యలపై పొరాడాల్సింది నువ్వే - A Short Story

Updated on
నీ సమస్యలపై పొరాడాల్సింది నువ్వే - A Short Story

Contributed By Raviteja Ayyagari

హైటెక్ సిటీ... హైదరాబాద్... సమయం: రాత్రి 11:00... అప్పుడే పని ముగించుకుని ఇంటికి బయదేలుదేరాడు నీరవ్. పార్కింగ్ లో బండి వెతికి, ఒక ఎనిమిది నిముషాల తర్వాత, ఇవాళ బండి మీద రాలేదు అన్న విషయం గ్రహించి బస్సు స్టాప్ వైపు పయనం సాగించాడు. ఒక పదిహేడు నిమిషాల నడక తర్వాత బస్సు స్టాప్అ చేరుకున్నాడు. అర్థ రాత్రి కావొస్తోంది కదా, బస్సులు సంఖ్యా తగ్గింది. ఈ లోపులో ఫోన్ తీసి,

నీరవ్: జనని! నేను రావడం లేట్ అవుతుంది. మీరు నిద్రపోండి. నా దగ్గర స్పేర్ కీ ఉంది. అని వాళ్ల అమ్మగారికి చెప్పి, అవతల వైపు నుంచి రెండు చివాట్లు తిని, ఫోన్ పెట్టాడు. నీరవ్: అనవసరంగా ఫోన్ చేసినట్టు ఉన్నాను. ఎలాగో ఇంటికి వెళ్ళాక పడతాయ్ కదా! మధ్యలో ఈ ఫోన్ అవసరమారా నీరవ్? అలా అనుకుంటున్నా సమయంలో, పక్కన ఉన్న సందులో నుంచి ఆ బస్సు స్టాపుకి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అన్న విషయం అర్థమయిన తర్వాత మొహం అవతల వైపు తిప్పుకుని కూర్చున్నాడు. ఆలా కూర్చున్న ఒక నిమిషం తర్వాత, ఎదురుగ వస్తున్న కార్ హార్న్ మోగిస్తూనే ఉన్నాడు, ఏమైంది అని వెనక్కి తిరిగి చూస్తే, ఈ అమ్మాయి రోడ్ మీద ఏడుస్తూ నిల్చుంది. చావటానికి నిల్చుంది అని అర్థం చేసుకున్న వెంటనే, పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయిని కాపాడాడు.

కాపాడి బస్సు స్టాప్ చైర్ లో కూర్చోబెట్టి కొంచం గమనించిన తర్వాత అర్థం అయ్యింది. ఆ అమ్మాయి బట్టలు చినిగిపోయి ఉన్నాయ్. శరీరం మీద గాట్లు, అన్ని చూసి ఆ అమ్మాయి ఎందుకు చావాలి అనుకుందో. రూపిణి: నన్ను వదలండి. నాకు బ్రతకాలి అని లేదు. ప్లీజ్! కనీసం చావు అయినా నన్ను ప్రశాంతంగా చావనివ్వండి! నీరవ్: నా మాట వినండి! హాస్పిటల్ కి వెళ్దాం పదండి. మీకు ట్రీట్మెంట్ అవసరం. ఆ మాట చెప్పేలోపు కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే అంబులెన్సు కి ఫోన్ చేసాడు. పది నిమిషాలలో అంబులెన్సు వచ్చి, హాస్పిటల్ కి తీస్కుని వెళ్ళింది. కూడా తాను కూడా వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళకి ఆక్సిడెంట్ వరకు మాత్రమే చెప్పాడు, ఆ అమ్మాయిపై జరిగిన అత్యాచారం చెప్పలేదు.

మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్... హైదరాబాద్... సమయం... రాత్రి 3:25... అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ గారు వచ్చారు. నీరవ్: డాక్టర్ గారు! ఎలా ఉన్నారు ఆవిడ? డాక్టర్: చాలా దారుణంగా రేప్ చేసారు! It is a miracle that she survived! ఇంతకీ మీకు ఆవిడ ఏమవుతారు? నీరవ్: ఏమి కారండి! బస్సు కోసం వెయిట్ చేస్తుంటే అక్కడకి వచ్చి రోడ్ మీద ఆత్మ హత్య చేసుకోబోయారు. రోడ్ మీద నుంచి లాగి, బస్సు స్టాప్ లో కుర్చోపెట్టాను. ఈ లోపులో స్పృహ తప్పి పడిపోయారు. వెంట తీస్కోచ్చాము. డాక్టర్: ఆవిడ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? నీరవ్: లేవు డాక్టర్ గారు! డాక్టర్: All her wounds have been will heal in a few days. But she will be shattered. శరీరానికి తగిలిన గాయం పోయినంత తేలికగా మనసుకి తగిలిన గాయం పోదు. అందులో, మనిషి దుఃస్థితిని వినోదంగా చూసే ఈ సమాజంలో ఆ గాయం పెరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి తప్పు లేకపోయినా, శిక్షను అనుభవించింది. అనుభవిస్తుంది. She is conscious. మీరు కావాలంటే ఆ అమ్మాయిని చూడచ్చు. I will be back.

నీరవ్ ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి అటు వైపు తిరిగి ఏడుస్తోంది. నీరవ్ ఆవిడతో ఎం మాట్లాడాలో తెలియక సతమతమవుతున్నాడు. ధైర్యం తెచ్చుకుని, నీరవ్: మీరు ఏమి తప్పు చెయ్యలేదు. It is not your fault. ఎవరో చేసిన తప్పుకి మీరు ఇలా శిక్ష అనుభవించడం తప్పే. మీకు జరిగిన విషయానికి నేను బాధని మాత్రమే చూపించగలను. కానీ, గాయం మాత్రం మీదే. రూపిణి: మా అమ్మ, నాన్న, మా హస్బెండ్, తెలిస్తే నన్ను క్షమించరు. నన్ను దూరం పెట్టేస్తారు. నీరవ్: మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని ఎలా అయినా ప్రేమిస్తారు, మీకేమైనా ప్రేమిస్తారు. రూపిణి: ఈ సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను. నేను బ్రతకలేను. నీరవ్: అగ్ని ప్రవేశం చేసి ఆవిడ పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న సీతమ్మని అవమానించిన సమాజం, నిండు సభలో ద్రౌపది వస్త్రోపహరణాన్ని ఆపకుండా వినోదాన్ని చూసిన సమాజం, అర్థ రాత్రి ఒక స్త్రీ ఒంటరిగా వెళ్తుంటే రక్షణ ఇవ్వడం మానేసి అపహరణ చేసిన సమాజం, స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం అని కేవలం బుస్సులకే పరిమితమై మనసులో మాత్రం ఆ భావన లేని సమాజం. అమ్మాయిలపై అత్యాచారం చేసారని తెలిసిన కూడా వాళ్ళని కాపాడడానికి చూసే మనుషులున్న సమాజం. ఆడపిల్లలని గర్భంలోనే చంపేసుకుంటున్న సమాజం. ఇలాంటి సమాజం గురించా మీరు భయపడుతుంది? నేను మీకు ధైర్యాన్ని ఇవ్వలేను. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు అందించిన అది మీకు సరిపోదు. మీకు, మీరు ఇచ్చుకునే ధైర్యం మాత్రమే ఇప్పుడు అవసరం. ఆత్మహత్య చేసుకుంటే మీ పైన అనుమానం, అవమానం పెరుగుతాయి కానీ, మీకు విముక్తి ఉండదు. మీ తలిదండ్రులకు, మీ ఆయనకి మనశాంతి కూడా ఉండదు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. కొంచం సేపు గ్యాప్ ఇచ్చి,

నీరవ్: మీ డీటెయిల్స్ ఇస్తే మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తాను. ఆలా ఆ అమ్మాయికి తన వంతు ధైర్యం చెప్పటానికి ప్రయత్నం చేసి, వాళ్ల ఇంట్లో వాళ్ళకి జాగ్రత్త గా అప్పచెప్పి, అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాడు నీరవ్.

ఒక సంవత్సరం తర్వాత... Human Icon awards... హైదరాబాద్... MC: The youth icon award for this year goes to Mrs. Roopini! Mrs. Roopini has successfully helped 27 rape victims in a span of just 10 months. She has provided a morale boost for all those women by various methods and has succeeded in helping them move on. So, inviting on to the stage, Mrs. Roopini. రూపిణి: అందరికి నమస్కారం! Good Evening Ladies and Gentlemen! ఈ అవార్డు నాకు దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఈ రోజు నేను చచ్చిపోయి ఉండాలి. ఆడియన్స్ అందరు ఆశ్చర్యంతో చూస్తారు.

రూపిణి: I am a rape victim myself. I was raped by 5 men on this very day last year. ఆ బాధతో చచ్చిపోదాం అనుకున్నాను. కానీ, ఆ రోజు ఒక మహానుభావుడు దేవుడిలా నన్ను కాపాడారు. జరిగిన దాంట్లో నా తప్పేమి లేదు అని నాకు నచ్చ చెప్పి, నాకు కొండంత ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేసారు. కొన్ని రోజులు భయం, బాధలతో బ్రతికిన, తర్వాత అతను చెప్పిన మాటలు నాలో ధైర్యం నింపి, నా ఫామిలీ తో ఈ విషయం చెప్పేలే చేసాయి. ఆ సమయంలో వాళ్ళు నా పైన చూపిన ప్రేమ, నా ప్రాణ దాత నాకు ఇచ్చిన ధైర్యం తోనే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒక అమ్మాయి అత్యాచారానికి గురైతే అందులో ఆ అమ్మాయి దోషం ఏమి లేదు. తనని దోషిలాగా చూడకండి. వీలైతే ఆ అమ్మాయికి కాస్త ప్రేమ అందించి మాములు మనిషి గా మారేలా సహాయం చెయ్యండి. నాకు పునర్జన్మ ప్రసాదించిన ఆ మహానుభావుడు ఇది చూస్తున్నట్టు అయితే, Brother! Thank you so much! I dedicate this award to you! You are my inspiration for making this happen! Ladies and Gentlemen! Thank you! Thank you very much! Jai Hind! ఈ కథ ద్వారా నేను నేను చెప్పాలనుకున్న నీతి ఈ కథలో పాత్రల ద్వారా చెప్పించేసాను. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏమి లేదు. అత్యాచారానికి గురైన ఆడవాళ్ళూ దోషులు కారు. వాళ్లకి మనమే ధైర్యం ఇవ్వాలి, ఆ ధైర్యమే వాళ్ళల్లో ధైర్యాన్ని నింపుతుంది. మన అందరి ఆలోచన మారాలి అని ఆశిస్తూ,