Here's Why Superstar Krishna Is The Evergreen Legend Of Tollywood!

Updated on
Here's Why Superstar Krishna Is The Evergreen Legend Of Tollywood!

అప్పటి వరకు మన సినీ పరిశ్రమ ఒకే రకమైన మూస పద్దతిలోనే ముందుకు సాగేది కాని కృష్ణ సాహసాల నిర్ణయాల ద్వారా తెలుగు సినిమా అంటే ఏ విషయంలో తక్కువ కాదు అని నిరుపించారు... కౌ బాయ్, జేమ్స్ బాండ్ లాంటి హలీవుడ్ స్థాయి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు తనదైన శైలిలో పరిచయం చేశారు. పరిచయం చేయడం అంటె కేవలం చూపించడం మాత్రమే కాదు ఇప్పటికి కౌబాయ్ లాంటి సినిమాలు తీసెటప్పుడు మోసగాళ్ళకు మోసగాడు లాంటి కృష్ణ సినిమాలను చూసి ఇప్పటి తరం నటులు చూసి నేర్చుకునేంతలా తన హీరోయిజాన్ని ఒలికించారు..

6 copy
2 copy
1 copy
5 copy

కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ. రాఘవయ్య చౌదరి నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31వ రోజున గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు కృష్ణకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమనులు. డిగ్రి బి.ఎస్.సి పూర్తిచేసి నటన మీద అభిమానంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్వతహాగ అందగాడు అయిన కృష్ణ ఇండస్ట్రీ నుండి అవకాశాలు ఏవి వెతుక్కుంటు రాలేదు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తు పరిచయాలు పెంచుకుంటు ఒక్కో మెట్టు ఎదిగారు.. అలా 1965లో మంచి ఎమోషనల్ సినిమాలు తీసే దర్శకుడు అదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు లో మొదటిసారిగా కథానాయకుడి వేషం వేశారు ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హీరోగా తన స్థానం సుస్థిరం అయ్యింది. కేవలం మూడో చిత్రం గూడచారి 116 సినిమాతోనే ఆడియన్స్ కి హాలివుడ్ జేమ్స్ బాండ్ తరహ హీరోను వెండితెర వెలుగులో చూపించారు.

11 copy
9 copy

ఎవ్వరు అందుకోలేని అరుదైన రికార్ఢులు కేవలం కృష్ణగారికే సొంతం అలాంటి వాటిలో.. మెదటి ఈస్ట్ మెన్ కలర్ ఈనాడు(1982), మొదటి 70MM సినిమా సింహాసనం(1986) మొదటి సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు(1974) మొదటి D.T.S సినిమా తెలుగు వీర లేవరా(1988) లాంటి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రముకు ఒక కొత్త టెక్నాలజీని అందించారు. దాదాపు ఐదు దశాబ్ధాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 350 చిత్రాలకు పైగా నటించారు. కృష్ణ అంటేనే సాహసానికి మారుపేరుగా వర్ణించేవారు. సినిమాల ద్వారా తాను సంపాదించుకున్న డబ్బును ఎక్కడా పెట్టుబడి పెట్టకుండా పద్మాలయ స్టూడియోస్ నిర్మించి ఆ బ్యానర్ లో నుండి తన అభిరుచికి తగ్గ సినిమాలను నిర్మించారు.. మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామ రాజు, సింహాసనం వంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు.. 17 చిత్రాలకు దర్శకత్వం వహించారు.. పరిశ్రమలో అందరి కన్నా ఎక్కువ డ్యుయల్ రోల్(25) ట్రిపుల్ రోల్(7) లో నటించి నటన మీద తనకున్న ప్రతిభను రుచి చూపించారు. మంచి హిట్ చిత్రాలతో అగ్రహీరోలలో ఒకడిగా కొనసాగుతునే ఏ భేషజం లేకుండా తోటి నటి నటులతో ఎన్.టి.ఆర్. ఏ.ఎన్.ఆర్, శోభన్ బాబులతో కలిసి పనిచేసి ఇతర అభిమానుల మన్ననలు కూడా అందుకున్నారు.

4 copy
3 copy
8 copy

కెరీలో అత్యధికంగా విజయ నిర్మలతో దాదాపు 50చిత్రాలలో నటించారు, జయప్రదతో 47, శ్రీదేవితో 30 చిత్రాలలో కలిసినటించారు. తొలి 30 సంవత్సరాల కెరీర్ లో దాదాపు 296 చిత్రాలలో నటించారు, కేవలం 1969 నుండి 1972 మధ్యగల నాలుగు సంవత్సరాల కాలంలోనే 60 సినిమాలు చేశారంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా అంటే ఆయనకున్న ప్రేమను..సూపర్ స్టార్ కృష్ణ అంటేనే మనకు వెంటనే గుర్తుకు వచ్చె రూపం అల్లూరి సీతారామ రాజు సినిమా. ఆ సినిమా దర్శకులు వి. రామ చంద్రరావు స్వాతంత్ర సమరయేదుడు తెలుగువాడు అయినా సీతారామరాజు జీవిత కథను తెరకెక్కించాలని ఎందరి ఇంటిచూట్టు తిరిగినా ఎవ్వరు ధైర్యంగా ముందుకు రాలేదు ఎందుకంటే ఆ కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ జనాలు చూడకపోవచ్ఛు అని.. కాని కృష్ణ మాత్రం ఏ ఒక్కరి మాటలను లెక్కచేయకుండా కథ మీద, తెలుగు ప్రేక్షకుల మీద నమ్మకంతో తన సొంత నిర్మాణ సంస్థలో ఆ వీరుని గాధను మనకు చూపించారు.. పెద్ద సక్సెస్ కావడమే కాకుండా ఉత్తమ నటుడు అవార్ఢుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నందిని అందుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాక రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు కాంగ్రెస్ పార్టి తరుపున 1989,1997లో ఎం.పి గా ప్రజలకు సేవచేశారు. సినీరంగంలో ఆయన సేవకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్(2009) అవార్ఢతో సత్కరించింది అంతేకాకుండా ఆంద్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు కృష్ణ ఇప్పటికి 70వసంతాలు పూర్తిచేసుకున్నా తనదైన అందంతో అభిమానులను ఆనందపరుస్తున్నారు.

10 copy
7 copy