20 Songs By Suddhala Ashok Teja Garu That Prove Why He's A Gifted Writer For TFI !

Updated on
20 Songs By Suddhala Ashok Teja Garu That Prove Why He's A Gifted Writer For TFI !

"అగ్నినేత్రమహోగ్రజ్వాల దాచిన ఓ రుద్రుడా - అగ్నిశిఖలను గుండెలోన అణచిన ఓ సూర్యుడా" రోమాలు నిక్కపొడుచుకునేంత కసి, ఆవేశం ఆ పాటలో, ఆ పదాలలో చూపించిన సినీ, గేయ రచయిత "సుద్దాల అశోక్ తేజ" . 'పదవ తరగతైనా పాసయ్యావా ?' అంటూ ఎన్నో ప్రశ్నలు... రేకుల షెడ్డులో కాపురం... సైకిల్ మీద ప్రయాణం... లాంటి పళ్ళ బిగువన బిగించిన కష్టాలు దాటి.. తన పాటలతో తెలుగును బ్రతికిస్తూ, తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. "ఒకటే జననం ఒకటే మరణం.. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు" అంటూ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

ఉద్యమ గేయాలే కాదు "రేగుముల్లోలే నాటుచిన్నాది బొడ్డు మల్లెను చూడు అన్నాది" అంటూ సరికొత్త జానపథ బాణీలు లను సినిమాకు పరిచయం చేసారు. "సూవి సువాళ్ళమా" అంటూ పేగు బంధాన్ని ఎంతో గొప్పగా వర్ణించారు. "దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరు కుంటాలే" అంటూ ప్రేమ పాటలు రాసారు. "ఏం సక్కగున్నావ్ రో నా సొట్ట బుగ్గలోడా" అంటూనే "నువ్ యాడికెళ్తే ఆడికోస్త సువర్ణ" అన్నారు. "ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు..ఒక్కడే దేవుడు" అంటూ దేవుని చేతనే దేవుడు ఒక్కడే అనిపించారు,'అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నేగా నిచ్చెన' అంటూ 'కడుపు తీపినే హేళన చేసిన జులాయి ని' అని పాండురంగడి బాధని మనకి తన పాటతో చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు వందల పాటలు, మరెన్నో ఉద్యమ గేయాలు.

తెలుగు భాష లోని అసలైన అందం పల్లెటూరులోనే కనిపిస్తుంది. ప్రపంచం పట్నాల వైపు పరిగెతున్నా ఆయన పాటతో మనల్ని పల్లె వైపు తిరిగి చూసేలా చేసారు. ఆయన పాటలప్రపంచం లో కొన్ని ఆణిముత్యాలు మీ కోసం...

1. Vachinde

2. Na mogudu rampyari

3. Regumullole

4. Nuv yadi kelte aadikostha Suvarna

5. Suvi suvallamma

6. Osey ramullamma

7. Nemali kannodo

8. Nenu saitham

9. Bangaru kalla buchammo

10. Aha allari

11. Mathrudevobhava

12. Okate jananam

13. Rayalaseema Ramanna Chowdary

14. Devudu varamandiste

15. Kanapadaledha

16. Etayyinde Godaramma

17. Suryude selavani

18. Alanati ramachandrudu

19. Evvare nuvvu

20. O bapu nuvve ravi