"Street" అనే సంస్థ భిక్షాటన చేసేవారిని కలుసుకుని మోటివేట్ చేసి తాము చేయగల పనిని కల్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఒకరోజు వైజాగ్ బీచ్ లో బెగ్గింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని ఇలాగే మోటివేట్ వాచ్ మెన్ గా ఉద్యోగం ఇప్పించారు. వాచ్ మెన్ ఉద్యోగానికి వెళ్లిన సదరు వ్యక్తి గంటలోనే తిరిగివచ్చాడు. ఏంటని అడిగితె కోపంగా మాట్లాడకుండా తిరిగి బెగ్గింగ్ మొదలుపెట్టాడు. పోనీ వాచ్ మెన్ ఉద్యోగం ఇచ్చిన ఓనర్ కి కాల్ చెస్తే దిమ్మతిరిగే సమాధానం వారికి వచ్చింది. "మొదటి నెల జీతం 8 వేలు ఆ తర్వాత Performance చూసి పెంచుతాం అని చెప్పాను, కాని ఆయన వింటేగా మొదటి నెల నుండే 30,000 జీతం కావాలట, నేనేమి రాజకీయ నాయకుడి బినామీ కాదు నేను ఇవ్వలేను నన్ను క్షమించు అని చెప్పి తప్పించుకున్న." Street సభ్యులకు దిమ్మతిరిగి పోయింది. అంటే వైజాగ్ బీచ్ లో బెగ్గింగ్ ద్వారా వచ్చే పెట్టుబడి లేని ఆదాయం నెలకు 30,000 అనమాట.
ఇది ఒక స్వచ్చంద సంస్థగా ఏర్పాటుచేయలేదు, వారి కుటుంబ సభ్యులలో ఒకరిగా, వారి ఉన్నతి కోసం ఒకేరకమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఇందులో సభ్యులు. గాయత్రి విజ్ఞాన్ విద్యార్థిని, శివ ది చైతన్య ఇంజినీరింగ్ కాలేజ్. ఒకసారి హ్యాకథాన్ లో వీరు కలుసుకోవడం జరిగింది. ఇద్దరి ఆలోచనలు కలవడంతో మంచి స్నేహితులవ్వడానికి అట్టే కాలం పట్టలేదు. గాయత్రి ఇల్లులేని యాచకుల కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచన శివతో వివరించడంతో Street ప్రారంభమయ్యింది. వైజాగ్ లో 60% బెగ్గర్స్ ఫేక్, ప్రతి నెల వీరు సంపాదించే ఆదాయం నెలకు కోటి రూపాయలకు పైగానే. హైదరాబాద్ లో ఐతే ఫేక్ బెగ్గర్స్ 98% వీరందరికి ఇల్లు, కుటుంబాలు ఉంటాయి. బెగ్గింగ్ ను ఇన్ కం సోర్స్ గా తీసుకునే వీరి ఆదాయం ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అసలైన బెగ్గర్స్ ని, నకిలీ బెగ్గర్స్ ని గుర్తించి వారందరికి ఒక ఉపాధిని కల్పించడమే Street నిరంతర లక్ష్యం.
అసలైన బెగ్గర్స్ ఎక్కువగా ఉండేది, బిక్షాటన చేసేది దేవాలయాలు, బస్టాన్డ్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నెల్స్ దగ్గర.. వీళ్ళలో చాలామందికి ఆరోగ్యకారణాలతో పాటుగా మత్తు పదార్ధాలకు అలవాటు పడి ఉంటారు. వీరిని కూర్చోబెట్టి మార్చడం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఎంతగా చెప్పి చూసినా బెగ్గింగ్ కే ఇష్టపడేవారే అధికం. ఆత్మాభిమానం అన్నిటికన్నా విలువైనది మనిషిగా పుట్టి ఎదుటివారిని చెయ్యి చాచి అడగడం మీ తల వంచడం.. దీని కన్నా అవమానకరమైనది ఏది లేదు. ఇలా రోజులతరబడి వారితో మాట్లాడుతూ ఇప్పటివరకు పదుల సంఖ్యలో తోటమాలిగా, వాచ్ మెన్ లు గా, వివిధ వృత్తి విభాగాలలో హాయిగా గౌరవంగా పనిచేసుకుంటున్నారు.
Street స్థాపనకు ప్రధాన కారణం గాయత్రి, శివ. వీరు వైజాగ్ విజ్ఞాన్ కాలేజ్ లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే దీనిని మొదలుపెట్టారు. Street చేస్తున్న మరో గొప్ప కార్యక్రమం "స్ట్రీట్ స్టోర్". ఆసక్తి ఉన్నవారికి పేపర్ బ్యాగ్ లు, టెర్రారియం గార్డెన్స్, మట్టి గణపతులు, క్యాండిల్స్ ఇలా మొదలైన వాటికి శిక్షణ ఇప్పిస్తున్నారు. వీరు తయారుచేసిన వస్తువులను వైజాగ్ లోని పూర్ణా మార్కెట్, బీచ్ రోడ్ లాంటి ప్రాంతాలలో స్టాల్స్ వేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు. ఇలా వచ్చిన ఆదాయంతో తిరిగి వారి సంక్షేమం కోసమే ఉపయోగిస్తుంటారు. ఇది నిజంగా శుభపరిణామం కదా భిక్షమెత్తుకునే వారిని చీదరించుకోవడం కన్నా, భిక్షాటన చేస్తే ఫైన్ వెయ్యడం కన్నా ఇది ఊహకుమించిన గొప్ప చర్య కదా..
Call us at 7382047877