Finally I Made it! This is a long cherished dream .I’ve been waiting for this moment since my childhood . I’ve been practicing this speech from many years in my dreams and today I Made it…………………
వరుణ్ - రేయ్ నీ ఎంకమ్మా ఏందిరా, అసలేందిది , అరె ఇట్ల నిద్రపోతానో లేదో,నీ లొల్లి మొదలుపెడ్తావ్. మళ్ళా అదే కలనా, అవార్డు తీస్కుంటున్నట్టా ,ఈసారి ఎవరు ఇచ్చార్రా నాగార్జునా చిరంజీవా. ఇట్లనే ఒదిలితే పిచ్చోడివి ఐతవ్. ఇప్పుడు మళ్ళా ఆ పుస్తకం పట్టుకొని రాస్కుంటా కుసుంటావ్ అంతే కదా,నీకు నిద్ర రాదు,నాకు నిద్ర పట్టదు. రేయ్ నీ అంత పాగల్ గాడు ఉంటడారా ?? మంచి 50k జీతం ఉన్న జాబ్, రోజు 10 - 5 వర్క్ ,వీకెండ్స్ లో బిందాస్ లైఫ్ ఇవన్నీ వదిలేసి , ఇప్పటికి దాదాపు ఏడాదిన్నర అయింది, పగలంతా ఎవరెవర్నో కలుస్తావ్, కనపడ్డోనికి నీ కథలు చెప్తావ్,రోజంతా తిరిగి తిరిగి ఒస్తావ్ , మల్ల రాత్రంతా రాస్కుంటా కుసుంటావ్, బావ నిజం చెప్పు నువ్ peace full గా నిద్రపోయి ఎన్ని రోజులైంది , heart full గా నవ్వి ఎన్ని నెలలైంది ,నువ్ వస్తా అంటే కళ్ళకి అద్దుకుని తీసుకుంటారు,కాళ్లు పట్టుకొని రమ్మంటున్నారు జాబ్ లో జాయిన్ అవ్వమని , ఇవన్నీ ఒదిలి నీకు అవసరమారా, మీ చుట్టాలు,ఇంటిపక్కన వాళ్ళకి ఎం చెపుకుంటార్రా ఆంటీ, అంకుల్ వాళ్ళు. ప్లీజ్ రా నా మాట విను,మన మిడిల్ క్లాస్ గాళ్ళకి ఈ సినిమాలు ఇవన్నీ సెట్ అవ్వవు రా,జాబ్ లో జాయిన్ అయిపోరా…
ఆదిత్య - బావ ఇదేదో నిద్రపోతే వచ్చే కల కాదు,నిన్న మొన్నటి నుండి ఉన్న పిచ్చి కాదు,చిన్నప్పటి నుండి ఉన్నది, ఇది నా డ్రీం రా,రేయ్ ప్రతీ మనిషికి ఒక ambition ఉంటది,నీకు , మీ పేరెంట్స్ కి ఒక duplex విల్లా ఇవ్వాలని నీ కల,దానిని వొదులుకొమ్మంటే నువ్ ఒదులుకుంటావా ?? నువ్ చెప్పింది నిజమేరా 10- 5 జాబ్,50 k శాలరీ .బయట ప్రపంచానికి నేనో success full పర్సన్ ని కానీ నా వరకు నాకు satisfaction లేదురా,ప్రతీ రోజు దాదాపు ఒకేలా ఉంటుంది, ప్రతీ నిమిషం అనిపిస్తుంది,ఇది కాదు కదా నేను కోరుకుంది, మనసులో ఎప్పుడూ నన్ను నేను మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ , కానీ ఇప్పుడు నా కలని నిజం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నా , ఇప్పుడు రోజంతా ఓ పది మందిని కలుస్తున్నా, నలుగురికి నా కథలు వినిపిస్తున్నా,వాళ్ళు ఇది బాగుంది అని appreciate చేస్తే గర్వపడుతున్నా,ఇది బాలేదు అని చెప్తే ఇంప్రూవ్ చేస్కుంటున్నా,నేర్చుకుంటున్నా,కొత్త ఆలోచనలు వస్తున్నాయ్,రాత్రి ప్రశాంతంగా రాస్కుంటున్నా , పడుకునే కాసేపు హాయిగా ఉంది,కష్టపడుతున్నా ,ఆ కష్టం ఇచ్చే సుఖం ఎక్కడా దొరకదు బావా ,ఇలాంటి కష్టమే కావాలి,ఈ కష్టం వల్లే రోజు రోజుకి నాలో ఒక డెవలప్మెంట్ ఒక బెటర్మెంట్ , ఒక కసి,ఒక కాన్ఫిడెన్స్ . టైం పడతది ,కానీ ఎదో ఓరోజు గెలుస్తా.
వరుణ్ - రేయ్,positivity కి practicality కి చాలా తేడా ఉందిరా ఆదిత్య - ఒప్పుకుంటా రా,కానీ మనలో ఉండే ఒక చిన్న ఆశ చాలురా మనల్ని ముందుకు కదిలించడానికి . అరె కాన్సర్ ని కూడా ఓడిస్తున్నారు కదా ఆ చిన్న ఆశ తోనే , అవకాశాల్ని సృష్టించుకోడానికి,ఆకాశాన్ని చేరడానికి ఆ ఆశ చాలు రా. Before being an Achiever one have to be a Believer.
నేనిప్పుడు నా కలని వెంటాడుతున్నా , అదే జాబ్ లో ఉంటె ఆ కల నన్ను రోజూ వెంటాడేది ప్రతీ రోజూ నేను ఫెయిల్ అవుతున్నా అని అనుకుంటున్నావు,కానీ రోజూ ఓ ఛాలెంజ్ లానే ఉంది, నిన్నటి కంటే ఇవాళ బెటర్ గా ఉండాలని,నన్ను నేను ఇంప్రూవ్ చేస్కుంటున్నా. ఎదో రోజు నేనేంటో ప్రూవ్ చేస్తా . ఇది పొగరుతో చెప్పే మాట కాదు గెలవాలనే కసి , తపన ఉన్నవాడు ఎవడైనా ఇదే మాట చెబుతాడు
ఇదో తప్ససు - గమ్యం చేరేదాకా నా ఫోకస్ వేరేదానిమీదకి మళ్లించను ఇదో దీక్ష - లక్ష్యం చేరాక సంబరాలు చేసుకోవొచ్చు ఇదో యజ్ఞం - నేనే హవిస్సుని నా అవసరాల్ని తగ్గించుకున్నా నా కోరికలని వాయిదా వేసుకున్నా,నా ఇష్టాలని వొదులుకున్నా . లక్ష్యాన్ని చేరడానికి ఏదైనా వదిలేస్తా . శిల శిల్ప౦ గా మారాల౦టె ఉలి దెబ్బలు తప్పవు రా ఔను బావ,నాది ముళ్లబాటే సింపుల్గా He came He saw He conquered అంటే ఎం ఉందిరా He Suffered He Struggled He Succeeded అంటేనే కదా మన గొప్పతనం. ఇంక బయట జనాల గురించి అంటావా మనం చేసేది వాళ్లకి నచ్చితే మనది పట్టుదల అంటారు,నచ్చకపోతే మనది మూర్ఖత్వం అంటారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి,మన ఆలోచనలు మనవి,ఇవాళ మనల్ని చూసి నవ్వుకుంటారు,రేపు మనం గెలిచాక ఆ గెలుపు చూసి ఏడుస్తారు , మొదట వీడు సాదించలేడంటూ అవమానం,వీడు సాధించగలడా అంటూ అనుమానం తీరా గెలిచాక వీడు మనవాడే అంటూ సన్మానం . ఇదే జరుగుతది . వాళ్ళ కోసం మన లక్ష్యాన్ని ఒదులుకోడం ఏంటి . మన లక్ష్యాన్ని చూసి అవతలివాడు నవ్వకుంటే మనం చాల చిన్న గోల్ ని సెట్ చేసుకున్నాం అన్నట్టు . ఇలాగే ఉంటె నేనేమైతానో అనే భయం తోనే నాతో argue చేస్తున్నావ్ అని తెలుసు,నేను డైరెక్టర్ అయ్యాక నాకంటే ఎక్కువ సంతోషపడతావ్ అని కూడా తెలుసు,
After 1 Year Finally I Made it, This is a long cherished dream .I’ve been waiting for this moment from my childhood . I’ve been practicing this speech from many years in my dreams and today I Made it. Holding the Film Fare Award for Best Writer and Best Debut Director in my hand with tears filled in my eyes and feeling the joy and happiness in my parents face .This is the Best moment in my life . I Dedicate this award to all the Ambitious upcoming youngsters in the world of Cinema. I’d like to say Just one word “CHASE YOUR DREAMS, BECAUSE THEY DO COME TRUE “ . Thank You