This Conversation Between A Girl And A Boy Will Surely Remind You Of Your First Crush!

Updated on
This Conversation Between A Girl And A Boy Will Surely Remind You Of Your First Crush!

Contributed By Vishnu Vardhan Reddy Gadikota

May 2, 2017 నేను మొదటి సారి ఏడ్చి ఈరోజుతో 24 సంవత్సరాలు. నా పేరు మహి ఈ రోజుల్లో అందరు ముందు ఇంజనీరింగ్ చదివి తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఏం చెయ్యాలి? అని ఆలోచిస్తే నేను మాత్రం M.sc Chemistry పూర్తి చేసి లెక్చరర్ గా చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితం లో మరిచిపోలేని ఓ వ్యక్తి ఉంటారు. దానికి క్రష్, ఫస్ట్ లవ్ ఇలా చాలా పర్యాయ పదాలున్నాయి. నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని ఆ వ్యక్తి విక్కీ.

2003 ఇద్దరం ఒకే స్కూల్ 5th class కాకపోతే తరగతులు వేరు అయిన ఒకే ట్యూషన్ వెళ్ళేవాళ్ళం. ఎప్పడూ వాడి చుట్టూ పది మంది ఉండేవాళ్ళు అందరితో ఉండేవాడు కానీ అన్నింటిలో అందరికన్నా ముందుండేవాడు. వాడంటే టీచర్ల కి కూడా ఇష్టం.. వాడికి నాకు ఒక్క క్షణం కూడా పడేది కాదు ఎప్పుడు ఆటపట్టించేవాడు,ఎడిపించేవాడు, కానీ నన్ను వాడి గ్యాంగ్ లో ఒకరిలా చూసేవాడు.

2005 8th class తరగతులు మారినా వాడి అల్లరి మారలేదు వాడి చుట్టూ గోల మారలేదు. అలా 8th class అయిపోయింది. తరవాత వాడ్ని హాస్టల్ లో చేర్పించారు. నన్ను ఎడిపించేవాళ్లు లేరని చాలా సంబరపడ్డా. మధ్యలో ఒకసారి ఇంటికొచ్చినపుడు అందర్నీ కలవడానికి స్కూల్ కి వచ్చాడు. నేను ఎదురుపడినా కనీసం ఎలా ఉన్నావని అడగలేదు వీడు మారడు అనుకుని వెళ్లిపోయా

తరువాత నాకు తెలియకుండానే నా రోజు వాడి ఆలోచనతో మొదలయ్యేది. రోజు మొత్తం వాడు ఎలా ప్రవర్తించేవాడో అదంతా నా బుర్రలో రంగుల రాట్నంలా తిరిగేది. వాడి typical look ఒకటి ఉండేది ఒక కనుబొమ్మ పైకెత్తి పొగరు వెటకారం కలిపిన చూపు నాకు తెలియకుండానే అలా చేయడం మొదలుపెట్టాను. వాడు ఎక్కడో ఉండి నా ఆలోచనలన్నింటిని వాడి చుట్టూ తిప్పుకునేవాడు అప్పుడు అర్థమైంది నాకు వాడి మీదున్నది కోపం మాటున దాగిన ఇష్టం అని. అలా స్కూల్ అయిపోయింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ లో చేరాను. నా ఫైనల్ ఇయర్ లో ఒక ఫ్రెండ్ ద్వారా తన సెల్ నెంబర్ తెలుసుకున్నాను. నా గుండె చప్పుడు వేగం పుంజుకుంది దాన్ని ఆపుకుంటూ వాడికి కాల్ చేసాను. చాలా సంవత్సరాల తరువాత విన్న వాడి స్వరం నా బోరింగ్ జీవితం లో మోగిన లాంగ్ బెల్ లా అనిపించింది. వాడు ఏమాత్రం మారలేదు అదే వెటకారం,పొగరు అప్పటినుండి తరచుగా మాట్లాడేదాన్ని , మెసేజ్ చేస్తూ విసిగించేదాన్ని. వాడి ప్రతి పుట్టినరోజుకి సరిగ్గా 12 కి విష్ చేసేదాన్ని. వాడికి మాత్రం నా పుట్టిన రోజు అసలు గుర్తుండేది కాదు. మనసు చంపుకొని నేనె అడిగి మరీ చెప్పించుకునే దాన్ని ఒక్కసారైనా వాడంతట వాడు విష్ చేస్తాడేమో అని చిన్న ఆశ. ఇద్దరి జాబ్స్ ఒకే దగ్గర అవ్వడంతో వాడ్ని కలవచ్చు అనుకునేదాన్ని. కానీ వాడు అపోయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అయ్యేది . ఈ సారి బర్త్ డే కి తప్పకుండా విష్ చేస్తా చూడు అన్నాడు .

May 2 2017: రాత్రంతా వాడు కాల్ చేస్తాడేమో అని చూశా వాడు చేయలేదు. పొద్దున్న ఇంక నా వల్ల కాకా వాడికి కాల్ చేసా. ఆఫీస్ లో ఉన్నా ఏదైనా ముఖ్యమైన విషయమా అనేసరికి కోపం బాధ కలిసిన కన్నీళ్లని అపుకుంటూ ఏమి లేదని కాల్ కట్ చేసా .సాయంత్రం మళ్ళీ వాడికి మెసేజ్ చేసా

Me: Ochhava Him: Yes Me:How was your day? Him: As usual

Me:Goodnight & gd bye I will never disturb you again Him: Em chachipotunnva?

Me: I am very serious Him: Enduko Me: today you made me cry a lot Him: nakenduko aa papam Me: It's my fate and I hate myself for this Him: Korean movie subtitles lekunda nakentidi?

Me: andari daggara bhayankaramian attitude chupinche nenu nee daggara ila wish cheyamani adukkuntna chudu You stupid Nenante epdu chinnachoope neeku Him: flow bagundi continue

Me : I hate you Him: actually night padukunna so first elagu cheppaledu kada last chepdamani waiting Kani nuv wait cheyledu. Sorry and Happy birthday Me: idi nijame kada ? Na birthday neeku gurtundi kada? Him: Undi ante nammutava? Ledu ante oppukuntava?

Me: Can I ask you something? Him: sure Me: what exactly do you think of me? Annoying! Irritating! Him: you are my best friend with all these add ons

Me: I should stop all these .I am unable to focus . Him: what should you stop? Why are you unable to focus? Me: nothing tq for wishing .Now I will sleep happily Him: Nuv matram answer cheppaledu na question ki Me:Not now some other time Him: Now or Never? Never ante matram gd bye forever antanu Me:Cheppaka nuv matladatam manakudadu Him: Okay Me: You are my 10 years crush and nee alochana lekunda gadipina roju ledu ee ten years lo Him: All of a sudden intha twist ichaventi? Was there any behavioral fault from my side? Me: No .Kani okkasariana ala alochinchaleda.... Him: eppudu nakunna best friends lo nuv okarivi anukunna ilanti oka alochana epdu raledu. Sare idanta vadilesi paduko Gdnt Me : Advice em cheppakundane Gdnt antav? Him: naku telsina vallalo Ne antha mentally strong persons Chala takkuva. Em cheyalo neeke Baga telsu

ఆ క్షణం అంతా శూన్యంలా అనిపించింది .నా చుట్టూ ఉన్న కలల ప్రపంచం అబద్దం అని నన్ను కన్విన్స్ చేయడానికి నా కళ్ళు ఆ కలల్ని కన్నీళ్లలా వదిలాయి. మా ఇద్దరి స్నేహం మాత్రం ఎప్పటికి అబద్దం అవ్వని నిజం అని తెలిసి నా పెదవి మీద చిన్న నవ్వు బహుశా ఇలాంటి ఒక ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది అనుకుంటా . నేను మోసిన ఊహల బరువుని దించేసి నా మనసుకి కళ్ళకి విశ్రాంతిని ఇచ్చా.

Every one is going to hurt us at some point or other. You just got to find the ones worth suffering for - Bob Marley