This Short Story Narrated By OSHO About The Purity That Comes With True Love Will Inspire You!

Updated on
This Short Story Narrated By OSHO About The Purity That Comes With True Love Will Inspire You!

ప్రేమకు చిన్నా, పెద్ద లాంటి తేడాలుండవు. ఒకవేళ వారిద్ధరి మధ్య ఇలాంటి భేదాలు వస్తే అక్కడ ఇగో కూడా నెమ్మదిగా పెరిగిపోతుంది. ఇది ఏ ఒక్కరిలో ఉన్నాకాని ఇంకొకరు కూడా అలాగే చేసుకుంటూ పోతే ఆ ప్రేమ పలుచబడిపోతుంది.

ఒక చెట్టు దగ్గరికి ప్రతిరోజు ఒక చిన్ని బాబు ఆడుకోవడానికి వచ్చేవాడు. దాని కొమ్మలు చాలా పెద్దవి, ఆ బాబు దృష్టిలో దాని ఆకారం ఆకాశాన్ని అందుకునే నిచ్చెనలా ఉంటుంది.. ఆ చెట్టులో అసూయ లేకపోవడం వల్ల బాబు కోసం తన కొమ్మలను వంచి పూలను, పండ్లను అందించేది.. ప్రతిరోజు రాగానే తనని తాను ఊపుకుంటు ఆప్యాయంగ ఆ బాబు మీద పూల వర్షం కురిపించేది. ఆ బాబు అలసిపోతే తన పిశాలమైన కొమ్మల మీద పూలు పేర్చి పడుకోనిచ్చేది అది ఆ బాబుకు అమ్మ ఒడిలా అనిపించేది. ఆ బాబు అ చెట్టు పూలను ఏరి ఒక కిరీటంలా చేసుకుని నేను రాజును అంటూ చుట్టు చూస్తూ ఆజ్ఞలు ఇస్తూ ఆడుకునేవాడు.. బాబు పెరుగుతున్న కొద్ది ఆ చెట్టు కొమ్మలు ఎక్కి ఊగుతూ ఆనందపడేవాడు.. ఆ బాబు అనుభవిస్తున్న ఆ ఆనందాన్ని ఆ చెట్టు చూసి ఎంతో మురిసిపోయేది.

ప్రతి ఒక్కరి జీవన గమంలో కొన్ని చేయవలసిన పనులుంటాయి అలాగే ఆ బాబుకు పరీక్షలు దగ్గరపడ్డాయి. ఆ చెట్టుకు, బాబుకు మధ్య కొంత దూరం ఏర్పడింది. నెలలో 30రోజులు తన కోసం వచ్చే బాబు రాక కోసం ఆ చెట్టు ప్రతిరోజు ఎదురుచూసేది.. ఇప్పుడు నెలలో ఒక మూడు రోజులు మాత్రమే వస్తున్నాడు. ఆ చెట్టు చాలా బాధపడుతున్నది. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ఆ ప్రేమను ప్రేమిస్తున్న వారితో పంచుకోకపోతే అంతే విషాదంగా ఉంటుంది. ఆ బాబు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వారిద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోతుంది. ఆ వ్యక్తి తను అనుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఆ చెట్టును పూర్తిగా మరిచాడు. స్నేహితులు పెరిగారు.. చుట్టు ఉన్న పచ్చని పూల వనం కాస్త నెమ్మదిగా ఎడారిగా మారిపోతున్నప్పుడు ఏం చేయాలో తెలియక నిశ్శబ్ధంగా రోదించే తోటమాలి పరిస్థితిలా ఉంది ఆ చెట్టు పరిస్థితి.

చాలారోజుల తర్వాత ఆ వ్యక్తి చెట్టు దగ్గరికి వచ్చాడు. కాస్త దగ్గరికి రావడంతోనే ఆ చెట్టు ఆ అతన్ని ప్రశ్నించింది (దిగులుతో). 'నీకోసం నేను ప్రతిరోజు ఎదురుచూస్తున్నాను. కాని నువ్వు నా దగ్గరికి అస్సలు రావడం లేదు'.

దానికి ఆ వ్యక్తి.. 'నీ దగ్గర ఏముందని రావాలి.? నీ దగ్గర డబ్బులున్నాయా.? నేను డబ్బుకోసం వెతుకుతున్నాను.

చెట్టు: అంటే నేను నీకు ఏమైనా ఇస్తేనే ఇక్కడకు వస్తావా.? ఒక్కసారి ఇటు చూడు (తన పూలను అతని మీద రాలుస్తూ) ఈ పువ్వులలోని పరిమళపు ఆనందం.. అదిగో నా కొమ్మల వైపు చూడు ఆ కోకిలలు ఈ లోకాన్ని మరిచి ఎంత ఆనందంగా పాడుతున్నాయో ఇవన్నీ డబ్బులుంటేనే వస్తాయా మనం డబ్బుతో కొనలేని ఆనందాలు ఇక్కడ ప్రతిచోట ఉన్నాయి.

వ్యక్తి: వీటికోసం ఇక్కడికి రావాలా.. నాకు ఇలాంటివి అక్కర్లేదు. నాకు డబ్బు మాత్రమే కావాలి. డబ్బు ఎక్కడ ఉంటే నేను అక్కడికే వెళ్తాను.

(చెట్టు మధ్యలో కలుగజేసుకుని) నువ్వు బాధపడడం నేను చూడలేను.. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇదిగో నా పూలను, పండ్లను తీసుకో వీటిని అమ్మితే చాలా డబ్బు వస్తుంది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

అలా అనడమే ఆలస్యం.. ఆ వ్యక్తి వెంటనే చెట్టు ఎక్కి ఆ పండ్లనన్నీటిని కోశాడు. పండ్లను కోసే క్రమంలో ఆ చెట్టు కొమ్మలను విరిచాడు. ఆ చెట్టులో ఇప్పుడు ఒక్క పండు, పువ్వు లేదు ఐనా కాని అవన్నీ ఆ వ్యక్తికి ఉపయోగపడుతుందని ఆ చెట్టు భావించి ఆనందపడింది.

ఆ వ్యక్తి పండ్లను పట్టుకుని మార్కెట్ వైపు వెళ్ళాడు. కాని అతను మళ్ళి తిరిగిరాలేదు. పండ్లను అమ్మగా వచ్చిన డబ్బును మరింత పెంచాలని తపనలో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆ చెట్టును పూర్తిగా మరిచిపోయాడు.. రోజులు సంవత్సరాలు దాటిపోతున్నాయి.. కాని ఆ బాబు రాక కోసం ఆ చెట్టు ఎదురుచూస్తునే ఉంది. అమ్మ ఎప్పుడెప్పుడా అని తన పాలను కొడుక్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కొడుకు చనిపోయాడని తెలిస్తే ఆ తల్లి ఎంతలా ఏడుస్తుందో ఈ చెట్టు కూడా అంతే నిశ్శబ్ధంగా ఏడుస్తుంది.. తన కొమ్మల మీద ఆ బాబు ఆడుకున్న సంధర్భాలు, తన పూలను పరిచి తన ఒడిలో హాయిగా పడుకున్న సంధర్భాలు తలుచుకుని ఆ చెట్టు మరింత నిశ్శబ్ధంగా ఏడుస్తుంది..

కొన్ని సంవత్సరాలకు ఆ వ్యక్తి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ బాబు రాకను చూడగానే ఆ చెట్టు.. రా బాబు వచ్చి నన్ను ఒక్కసారి హత్తుకో.. నీ కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నానో తెలుసా..?

వ్యక్తి: ఆపు నీ సెంటిమెంటల్ మాటలు.! నేనింకా చిన్న పిల్లాడిని కాను. అప్పుడంటే చిన్నప్పుడు నీతో ఆడుకున్నాను అంతే ఇప్పటికి అలా ఉండటానికి నేనింకా పిల్లోడిని కాను.

చెట్టు: ఏ.. పెద్దవాడివైతే మన బంధంలో మార్పులు రావాలా. అలసిపోయినట్టున్నవు. కాసేపు నా ఒడిలో పడుకో బాబు..

వ్యక్తి: నీ పనికిరాని మాటలు ఆపుతావా! నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. నాకు నీ పొడవాటి కొమ్మలు కావాలి ఇస్తావా.?

చెట్టు: ఇల్లెందుకు బాబు ఇల్లుంటే మన మధ్య బంధాలు దూరం కావచ్చు ఎక్కడో ఎందుకు నువ్వు నా చల్లని నీడలోనే ఉండచ్చు..(ఆ వ్యక్తి మరింత కోప్పడడం చూసి) నాకు తెలుసు నీకు ఈ మాటలు నచ్చవు. నా కొమ్మలను నరక్కో బాబు నువ్వు మంచి ఇల్లు కట్టుకో..

అలా అనేసరికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ధృడమైన కొమ్మలన్ని నరికేశాడు. అలా నరికేసరికి ఆ చెట్టు అవయవాలు లేని మొండెంలా తయారయ్యింది. ఐనా కాని ఆ వ్యక్తిలో ఏ విధమైన బాధ లేదు. ఆ వ్యక్తి కొమ్మలను తీసుకెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళి అటువైపు తిరిగిచూడలేదు. చెట్టు మాత్రం అలాగే ఎదురుచూస్తుంది.

సంవత్సరాలు గడిచిపోయాయి.. ఆ వ్యక్తి ముసలివాడయ్యాడు.. ఒకరోజు నడుచుకుంటూ అలా చెట్టు దగ్గరికి వచ్చాడు.

చెట్టు మునపటిలా లేదు కొమ్మలు నరికేయడంతో మెండెంలా మారిపోయింది.

చెట్టు: (మళ్ళి ఏదో సహాయం కోసం వచ్చినట్టున్నాడని తెలిసి..) రా బాబు ఏమైనా కావాలా. చాలా రోజులకు వచ్చావు.. ఆరోగ్యం ఎలా ఉంది.

వ్యక్తి: నాకోసం ఏం చేయగలవు.? డబ్బు సంపాదించడం కోసం నేను ఒక ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను.. ప్రయాణం కోసం ఒక బోట్ కావాలి.

చెట్టు: అయితే నన్ను సగం చేసి బోట్ ను తయారు చేసుకుని డబ్బు సంపాదించి ఆనందంగా ఉండు బాబు.. కాని ఒక్క మాట.. నన్ను ఎన్నటికి మరిచిపోకు.. నీకోసం నీ రాకకోసం ఎప్పటికి ఎదురుచూస్తు ఉంటాను.

అలాగే అని చెట్టులో ఉన్న ఆ భాగాన్ని కూడా సగానికి నరుక్కుని వెళ్ళిపోయాడు.

ఆ వ్యక్తి ఇప్పటికి తిరిగిరాలేదు. ఆ చెట్టుకేం తెలుసు. అతను బ్రతికున్నాడా.. ముసలివాడై చనిపోయాడా.. ఒక వేళ బ్రతికే ఉంటే ఇక నా దగ్గర ఏముందరి ఇక్కడికి వస్తాడు. ఐనా కాని ఏదో ఆశతో కొన ప్రాణంతో ఆ వ్యక్తి రాక కోసం కొన్నాళ్ళు ఎదురుచూసింది.. ఆ తర్వాత........