Meet Sruthi, The Woman Who Has Invented A Way To Convert Waste Into Bio Gas

Updated on
Meet Sruthi, The Woman Who Has Invented A Way To Convert Waste Into Bio Gas

నాన్న వ్యాపారి అవ్వడంతో శృతి గారికి కూడా వ్యాపారంపై ఆసక్తి పెరిగింది. అమెరికాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాక ఇక్కడే ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని అనుకున్నారు. అందరూ బంగారం ఉన్నచోటుకే వెళ్తారు చెత్త దగ్గరికి వచ్చేది, చెత్తలోనూ సంపద ఉన్నదని తెలుసుకునేది తక్కువ మందే. శృతి దానిని గుర్తించింది.

మొదట పౌల్ట్రీ నుండి బయో గ్యాస్: దేశంలో పౌల్ట్రీ రంగంలోని వ్యర్ధాలు అత్యధికంగా విడుదల అవుతాయి. చాలా వరకు వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగిస్తారు లేదంటే వృధాగా పడేస్తుంటారు. మొదట మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆ తర్వాత రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లి ఆయ ప్రాంతాలలోని పౌల్ట్రీ వ్యాపారస్థులు, మరియు రైతులతో మాట్లాడారు. "పౌల్ట్రీ నుండి వచ్చే వ్యర్ధాలలో అమ్మోనియా ఉంటుంది వీటి వల్ల ఆరోగ్య సమస్యలు, దుర్వాసన వస్తుంది.. వీటి నుండి గ్యాస్, పవర్ ను ఉత్పత్తి చేయవచ్చని ఒక వీడియో రూపంలో స్థానికులకు వివరించేవారు. వారు అడిగే ప్రశ్నలను ఓపికగా విని సమాధానాలు చెప్పేవారు. రైతులు కూడా నమ్మకం కుదిరాకనే బయోగ్యాస్ ప్లాంట్ ను మొదటిసారి మెదక్ జిల్లాలో ప్రారంభించారు.

పండ్లు కూరగాయల వ్యర్ధాలు: అభివృద్ధి చెందిన దేశాలలో ఇంట్లోని కూరగాయలు, పండ్ల నుండి వచ్చే వ్యర్ధాల నుండి గ్యాస్, పవర్ ను సృష్టిస్తున్నారు. మన దగ్గిర మాత్రం "ఏంటి వంటింటి చెత్త నుండి గ్యాస్, కరెంట్ తయారు చేస్తారా?"" అనే ఆశ్ఛర్యంలొనే ఉన్నారు. పౌల్ట్రీ నుండి శృతి వంటింటికి చేరుకున్నది 2014 లో. నగరంలోని పెద్ద హోటల్స్, కూరగాయల మార్కెట్ యార్డులు, పండ్ల మార్కెట్, అక్షయ పాత్ర మొదలైన ప్రాంతాల నుండి ఆహార పదార్ధాల అత్యధిక చెత్త వస్తుంది. శృతి వాళ్లందరిని సంప్రదించి అక్కడ యంత్రాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీలు, క్యాంటీన్లు, హాస్పిటల్స్ మొదలైన ప్రాంతాలలో బయోగ్యాస్ ప్లాంట్ లను స్థాపించారు. వెలువడే వ్యర్ధాల స్థాయిని బట్టి ఈ ప్లాంట్ ధర ఆధారపడి ఉంటుంది.

ప్లాంట్ ఏర్పాటుచేయడం దగ్గరి నుండి దానికి ఏమైనా సమస్యలు వచ్చినా శృతి చూసుకుంటున్నారు. 2011లో రూపుదిద్దు కున్న శృతి ఎంటర్ప్రజైస్ ప్రస్తుతం చాలా చోట్లకు విస్తరించింది. అందరు కాంపిటీషన్ పెరిగిపోయింది అని అనుకుంటుంటారే తప్ప అవకాశాలను సృష్టించుకోవడంలో వెనుకబడి ఉంటున్నారు. నాటి ఆదిమానవుడి నుండి చూసుకుంటే మారుతున్న ప్రకృతికి మన శరీర భాగాలను ఎలా మార్చుకోగలిగామో అవకాశాలను కొత్త వ్యాపారాలను సృషించుకోవచ్చు ఆ స్వేచ్చే మన దగ్గర ఉన్న అతి గొప్ప సంపద.