This Short Poem Explains The Spirit & Greatness Of Telangana

Updated on
This Short Poem Explains The Spirit & Greatness Of Telangana

Contributed by Madhu Koudagani

ఎక్కడి వాళ్లొచ్చి అడిగినా కాదనక ఇంత జాగిచ్చి టక్కున అక్కున చేర్చుకునే చక్కని నేల ఇది... గుట్టలు ,గుళ్ళు ,మసీదులు ,వాగులు, ఒర్రెలు ,చెరువులు,చెల్కలు రంగులు పూసుకుని ప్రాణం ఉట్టిపడే జాగా ఇది.. పండుగలు,పీర్లు, జాతర్లు,సంతల సందడితో ఆనందం విరబూసే చోటు ఇది.. డోళ్లు, డప్పులు,చిరుతల చప్పుళ్ళు, కవి గాయకుల గానాలు..వికసించే మట్టిది... గాయాల గేయాలు,త్యాగాల రాగాలు,కోటలు,బురుజులు,అడవులు,అలజళ్లు కలిసి వసియించు తీరమిది... ధిక్కార మార్గపు దివిటీలు రూపుదిద్దుకున్న పోరాటాల గడ్డ ఇది.. ఇన్ని వర్ణాలనద్దుకున్న తల్లీ తెలంగాణా నువ్వీ దేశానికి మకుటానివే కాదు హృదయనివి కూడా..!!