Contributed By: Anand S Dhulipala
CHARACTERS: 1. కరణ్ – ears 2. నయన్ – eyes 3. SPECS – కళ్ళజోడు 4. Judge గారు (నోరు) – mouth 5. ఈరింగ – ear rings 6. కనుబొమ్మ – eyebrows 7. నాసిక్ – nose 8. నాలుక – tongue
“Don’t worry brother, విజయం మనదే” అన్నాడు నయన్, కరణ్ తో. ఇద్దరూ court రూమ్ లో judge గారి కోసం ఎదురుచూస్తున్నారు. కోపంతో కరణ్ ముఖం ఎర్రగా ఉంది. “ఇంత మోసం చేసిన దాన్నివదిలిపెట్టకూడదు” అన్నాడు. ఈలోపు judge గారు ప్రవేశించారు. అందరూ లేచి నించున్నారు. ఈ judge గారు చాలా లౌక్యం తెలిసిన వాడు. ఊసరవెల్లి రంగు మార్చినట్టుగా సందర్భాన్ని బట్టి ఇతడు మాట మార్చే అవకాశం ఉన్నా, అలా చెయ్యడు. చాలా నిజాయితిగా ఉంటాడు. అతని పేరు ‘నోరు’. ఆ ఊళ్లో ఏ పంచాయితి అయినా అతనే పరిష్కరిస్తూ ఉంటాడు. స్వతహాగా అదే ఊరివాడైనా, ‘exports’ పని కూడా చూసుకోవడం వల్ల చాలామంది ఆయన్ని వేరే ఊరివాడు అనుకునేవాళ్లు. judge గారు కూర్చుంటూ మిగిలిన వాళ్ళని కూర్చోమన్నారు. “మొదలు పెట్టండి” అన్నారు judge గారు. కరణ్ లేచాడు. ”అయ్యా, నా పేరు కరణ్. ఇతను నా స్నేహితుడు నయన్. ఇద్దరిదీ ఒకే సమస్య అయినా,ఇద్దరం విడివిడిగా ఆ సమస్య దెగ్గరికి ఎలా వచ్చామో చెప్పాలి అనుకుంటున్నాము, దానివల్ల మా వాదన మీకు స్పష్టంగా అర్ధం అవుతుంది. అందుకు మీ అనుమతి కోరుతున్నాను” అన్నాడు. “సరే” అన్నారు judge గారు. కరణ్ మొదలు పెట్టాడు. “అయ్యా, మా ఊరు ‘ముఖము’. నేను మా ఊళ్లో imports బిజినెస్ చేస్తుంటాను. మా ఊరికి ఏ సమాచారం వెళ్ళాలన్నా అది నా ద్వారానే వెళ్లాలి. వేరే వాళ్ళ లాగా నాకు విశ్రాంతి అంటూ ఉండదు. 24 గంటలూ పనే. ఒక రోజు మా ఊళ్లో ఉన్న ‘రెబ్లేసే’ hotel కి భోజనం చెయ్యడానికి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి నాకు ఎదురు వచ్చింది. తనే SPECS.” “HI, మై నేమ్ is SPECTACLES. ఈ ఊరికి కొత్తగా వచ్చాను” అంది. “నమస్కారం నా పేరు కరణ్. ఈ ఊర్లో Imports బిజినెస్ చేస్తూ ఉంటాను.” అన్నాను. “ooh, nice. కరణ్ గారు నాకు ఒక సహాయం చెయ్యగలరా?”. “చెప్పండి”. “నేను ఈ ఊరికి కొత్త కదా. ఉండడానికి ఒక ఇల్లు కావాలి. అద్దె ఇల్లు ఎక్కడ దొరుకుతుందో చెప్తారా?” అంది SPECS. కరణ్ ఒక్క నిమిషం ఆలోచించి, హుషారుగా “అయతే మీరు సరైన వ్యక్తినే అడిగారు. మా ఇంట్లో పై ఫ్లోర్ ఖాళీగా ఉంది. మీరు అందులో ఉండచ్చు.” అన్నాడు. SPECS ఒప్పుకుంది. “అలా SPECS’ని మా ఇంట్లో పై ఫ్లోర్ లో దింపాను. అలా మా ఇద్దరికీ పరిచయం అయింది. కొద్ది రోజులకే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాము. తను నాతో చాలా చనువుగా ఉండేది. మెల్లగా నాకు SPECS మీద ప్రేమ మొదలైంది. ఆ విషయం SPECSకి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు, తను కాదంటే ఏంటి పరిస్థితి అని భయం వేసింది. నాకు ఒక మరదలు ఉంది. దాని పేరు ‘ఈరింగ’. దాని సలహా ప్రకారం ఒక రోజు ధైర్యం చేసి నా ప్రేమ సంగతి తనతో చెప్పాను………” అంటూ మాటలు మధ్యలోనే ఆపేసి తన ముందు ఉన్న బల్ల మీద గట్టిగా పిడికిలితో గుద్దాడు కరణ్. పక్కనే ఉన్న నయన్ వెంటనే లేచి కరణ్ ని బెంచ్ మీద కుర్చోపెట్టాడు. “క్షమించండి అయ్యా, మా వాడు కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. మిగితాది నేను చెప్తాను.” అన్నాడు నయన్. Proceed అన్నట్టుగా తల ఊపారు judge గారు. “నా పేరు నయన్. నేను మా ఊరికి సర్పంచ్ ని. నేను లేనిదే మా వాళ్ళకి ప్రపంచం కనపడదు. పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు విరామం లేకుండా పని చేస్తాను. ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగుండట్లేదు. కొంచెం సేపు 'పని' చేస్తే చాలు బాగా అలసిపోతున్నాను. నాకొక చిన్నప్పటి స్నేహితురాలు ఉంది. తన పేరు ‘ కనుబొమ్మ’. తనకి తెలిసిన డాక్టర్ గారి దెగ్గరికి తీసుకువెళ్ళింది. డాక్టర్ గారు, పని లో ఒక అసిస్టెంట్ ని పెట్టుకోమని సలహా ఇచ్చారు. ఇప్పటికిప్పుడు అసిస్టెంట్ అంటే ఎక్కడ దొరుకుతారా అని ఆలోచిస్తూ ఉండగా పక్క ఊరిలో నా ఫ్రెండ్ ఒకడు SPECSని పరిచయం చేశాడు. తనని మొదటి సారి చూసినప్పుడే ప్రేమ లో పడ్డాను. వెంటనే పనిలో పెట్టుకున్నాను. నాకు SPECS మీద కలిగింది ప్రేమ మాత్రమే, కామం కాదు. తనని నేను మొదటి నుంచే ఒక ప్రియురాలి దృష్టితో చూశాను. తను నాతో కొద్దిగా నవ్వుతూ మాట్లాడితే చాలు, తెగ సంబరపడే వాడిని. తనకి ఎం కావాలన్నా నాతోనే కొనిపించుకునేది. తను కూడా నన్ను ప్రేమిస్తోంది అనుకున్నాను. కరణ్ తో నాకున్న చనువు మూలాన SPECS దగ్గర అద్దె కుడా తీసుకోవద్దన్నాను. అలాంటిది….” ఒక్క నిమిషం ఆగాడు నయన్. “తనని ప్రేమించానని చెప్తే, “I HAVE A GUY IN MY LIFE” అని ఆంగ్లంలో చెప్పింది. నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు. సూసైడ్ చేసుకుందామని మా ఊరి పోలిమేరలకి వెళ్తూ ఉండగా కరణ్ కనిపించాడు. తనూ SPECS బాధితుడని తెలిసింది. ఏం చేద్దామని అలోచించి, ఇక్కడ అయితే మాకు న్యాయం జరుగుతుందని భావించి, వచ్చాం అయ్యా” అన్నాడు నయన్. Judge గారు అంతా విన్నారు. “SPECS!” అని పిలిచారు. SPECS ముందుకి వచ్చింది. “వాళ్ళు చెప్పింది నిజమేనా?” అని అడిగారు judge గారు. “నిజమే” జవాబిచ్చింది SPECS. “నువ్వు ప్రేమించింది ఎవరిని?”. కరణ్, నయన్ ఇద్దరు SPECS వైపు చూశారు. కానీ SPECS నిఠారుగా నించున్న ఒక వ్యక్తి వైపు చూపించింది. అతను ముందుకి వచ్చాడు. “ఇతని పేరు నాసిక్. నయన్ గారి కింద అపార్ట్మెంట్లో ఉంటారు.” అంది SPECS. “నా కింద పని చేస్తూ నన్నే మోసం చేసి, నేను కొనిచ్చిన వాటితో వేరే వాడిని లైన్లో పెట్టుకుంటావా?” అని SPECS మీద అరిచాడు నయన్. “ఆర్డర్ ఆర్డర్. మీరు కూర్చోండి.” అన్నారు judge గారు. నయన్ చెయ్యి పట్టుకొని కిందికి లాగాడు కరణ్. Judge గారు ఒక నిమిషం ఆలోచించి, “Mr. నాసిక్, నీకు ఈ అమ్మాయి అంటే ఇష్టమేనా?” అని అడిగారు. “ఇష్టమేనండీ” అన్నాడు నాసిక్. “ఓకే, SPECS మీరు సంతోషంగా నాసిక్ ని పెళ్లి చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందీ లేదు. మీరు వెళ్ళచ్చు” అన్నారు judge గారు. నాసిక్, SPECS ఆ court గది నుంచి బయటకి వెళ్ళిపోయారు. కరణ్, నయన్లు ఎం జరుగుతోందో అర్ధంకాక judge గారి వైపు చూశారు. “ఎంటండీ ఇది? ఇక్కడ ఎదో న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వస్తే, ఇదేనా మాకు జరిగే న్యాయం?” అని దబాయించాడు కరణ్. “నీకు ఎం అన్యాయం జరిగింది బాబూ?” అడిగారు judge గారు. “నా మీద ఏ ఉద్దేశం లేనప్పుడు నాతో అంత చనువుగా ఎందుకుంది ?” అని అడిగాడు కరణ్. “తను మీ ఇంట్లో ఉన్నందుకు నువ్వు అద్దె తీసుకున్నావా?” అని అడిగారు judge గారు. “లేదు”. “ఎందుకు?”. సమాధానం చెప్పలేదు కరణ్. తాను SPECS దగ్గర అద్దె తీసుకోక పోవడానికి కారణం నయన్ చెప్పడం వల్ల కాదు, తనకి SPECS మీద ఉన్న ప్రేమతో. అందుకని, మౌనంగా తల దించుకున్నాడు. “మరి నా సంగతి? నా కింద పని చేస్తూ, దానికి ఎం కావాలన్నా అది నాతో కొనిపించుకొని, ఆ కొనిపించుకున్న దానితో వేరే వాణ్ణి లైన్ లో పెట్టుకుంది. ఇది మోసం కాదా?” అని అడిగాడు నయన్. “తను నీ కింద అసిస్టెంట్ కదా, మరి తనకి జీతం ఇచ్చావా?” అని అడిగారు judge గారు. “తనకి ఎం కావాలన్నా నేను కొనిస్తున్నాను కదా,మళ్ళీ జీతం ఎందుకు?”.అయోమయంగా అడిగాడు నయన్. “కదా, అదే నువ్వు జీతం ఇచ్చి ఉంటె నిన్ను అడగకుండా తనకి కావాల్సింది తను కొనుక్కునేది కదా, అప్పుడు తను ఆ జీతంతో ఏం చేసినా, అడిగే హక్కు మనకి లేదు కదా” అని అన్నారు judge గారు. నయన్ ఒక్క నిమిషం ఆగి, judge గారి చెప్పింది అర్థం చేసుకొని ” అయినా అన్ని భావాలు చెప్తేనే అర్ధం అవుతాయా అండి? చెప్పకుండానే అర్ధం అయ్యే భావాలు కొన్ని ఉంటాయి. అందులో ప్రేమ ఒకటి.” అన్నాడు బాధపడుతూ. దానికి judge గారు నవ్వారు. “మీ ఇద్దరు ఆ అమ్మాయిని ప్రేమించింది ఎంత నిజమో, ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చెయ్యడం కూడా అంతే నిజం. కాని, అవి నిరూపించడానికి ఆధారాలు లేవు. తనకి ఉచితంగా గది ఇవ్వడం వల్ల నీతో చనువుగా ఉండింది, నువ్వు తనకి విడిగా జీతం ఏమి ఇవ్వలేదు కాబట్టి తనకి ఎం కావాలన్నా నీతోనే కొనిచ్చుకుంది. దీన్నీ కాదంటారా?”. “లేదు” అన్నారు కరణ్, నయన్ ఇద్దరూ. “చట్టపరంగా చూస్తే ఆ అమ్మాయే correct,తను మిమ్మల్ని ఏం మోసం చెయ్యలేదు. ఎదో ఒక రోజు నీ imports బిజినెస్ ఆగిపోవచ్చు, నువ్వు ప్రపంచాన్ని చూపించడంలో విఫలం కావచ్చు, కాని ప్రాణం ఉన్నంత వరకు నాసిక్ బతికి ఉంటాడు. మీ ఇద్దరితో పోలిస్తే అతనే శక్తిమంతుడు. అందుకే అతన్ని కోరుకుంది”. కరణ్ నయన్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. “అయినా ఆ అమ్మాయి, నేను ఇంకొకడిని ప్రేమించాను మొర్రో అంటూ ఉంటె ఇంకా ఆ అమ్మాయిని పట్టుకొని వేళ్ళాడతారెందుకు? అయిందేదో అయింది వదిలెయ్యండి.” అన్నారు judge గారు. “ఎలా ఒదిలెయ్యగలుగుతాం అయ్యా, ఆ అమ్మాయి ఎవర్నో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. తనని ప్రేమించిన పాపానికి మేము బాధపడుతూ ఉండాలా?” అన్నాడు కరణ్ ఏడుపు గొంతుతో. judge గారు లేచి కరణ్ దగ్గరికి వెళ్లి అతని భుజం మీద చెయ్యి వేసి, “ఎంతసేపూ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావ్ కాని నువ్వంటే ఇష్టమైన వాళ్ళ గురించి అసలు పట్టించుకోట్లేదు.” అన్నారు. కరణ్ అర్ధం కానట్టుగా judge గారి వంక చూశాడు. ” ‘ఈరింగ’ నిన్న నా దగ్గరికి వచ్చింది. ఒకవేళ నీది తప్పని తేలితే నీకు ఏ శిక్ష వెయ్యద్దని నన్ను బతిమాలి నా దెగ్గర మాట తీసుకుంది.” అన్నారు judge గారు. కరణ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. Judge గారికి నమస్కారం పెట్టి ‘ఈరింగ’ వైపు పరుగు తీశాడు. Judge గారు నయన్ వైపు తిరిగారు. “ఇందాక ఏమన్నావ్? కొన్ని భావాలు అర్ధం చేసేసుకోవాలా? మరి చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నా, 'కనుబొమ్మ’ ప్రేమని నువ్వు అర్ధం చేసుకున్నావా?” అని అడిగారు. నయన్ అక్కడే ఉన్న‘ కనుబొమ్మ’ వైపు చూశాడు. ‘కనుబొమ్మ’ మౌనంగా తల దించుకుంది. ఆ మౌనం లోనే నయన్ కి సమాధానం దొరికింది. తను కూడా judge గారికి నమస్కారం పెట్టి కన్బొమని తీసుకొని court నుంచి వెళ్ళిపోయాడు. Judge గారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన భార్య ‘నాలుక’, ఆయన్ని court లో ఎం జెరిగిందని అడిగింది. Judge గారు అంతా చెప్పారు. అప్పుడు ‘నాలుక’, “మనల్ని ఇష్టపడని వాళ్ళ కోసం మనల్ని ఇష్టపడే వాళ్ళని నిర్లక్ష్యం చెయ్యకూడదని మళ్ళీ రుజువైంది అన్నమాట” అన్నారు. judge గారు చిరునవ్వు నవ్వారు.