A Fan Note To SPB & Sirivennela Garu For Giving Us Nostalgia

Updated on
A Fan Note To SPB & Sirivennela Garu For Giving Us Nostalgia

Contributed By Nimmagadda Saroja

“దిం దిగి ప ప దిగిడి దిగిడి... దిం దిగి ప ప...” ఇదే 80s & 90s kids ఫీలింగు. థమన్ ‘డిస్కో రాజా’ పాట ‘బాలు’ గారితో పాడించారు. సాహిత్యం ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ గారిచే వ్రాయించారు అని తెలిసి అది విన్నతరువాత..

‘Jungle Book’మళ్ళీ తీస్తున్నారంటే ఆఫీసుల్లోనే గంతులేసి చప్పట్లు కొట్టిన వాళ్ళం మనం. ‘Lion King’ మళ్ళీ తీస్తున్నారంటే "Yess" అని రోడ్ మధ్యలో అరిచిన బాపతు మనం, చూసే వాళ్ళంతా పిచ్చి పట్టిందేమో అని అనుకున్నా సరే! మహా అయితే ఆ నిమిషం కొంచెం embarass అయినా మళ్ళీ మామూలే. ఎందుకంటే, Nostalgia is such a strong feeling. గతమైపోయిన బాల్యం అంటే మమకారం ఎవరికి ఉండదు? We are not an exception. అలాంటి మనకు బాలు, శాస్త్రి గార్ల పాట ఒకటి retro స్టయిల్ లో, ఇళయరాజా శివ తాండవం చేసిన 80s , 90s ని గుర్తు చేస్తూ, ఆయనతో పాటు అక్కడక్కడా చక్రవర్తి గారిని, బప్పీ దా (బప్పీ లహరి)ని గుర్తు చేస్తూ ఉండే పాట అంటే... ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది??? ఈ పాటలోనే అన్నారుగా “భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా... స్వరమంటూ లేని సంగీతాన్నై నీ మనసునే తాకనా ?" అని అలాగే ఉంటుంది.

పాట గురించి చెప్పుకునే ముందు పాటగాడి గురించి చెప్పుకుందాం... ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగులా ‘వేరే సింగర్స్ season లాంటి వారు. వస్తుంటారు, పోతుంటారు. కానీ బాలు గారు చెట్టు. శ్రోతల హృదయాల్లో పాతుకుపోయారు’. సాహిత్యాన్ని స్వచ్ఛంగా ఉచ్చరించడమే కాదు, దానిలో ఉన్న భావం కూడా ధ్వనిలోనే అర్ధమయ్యేలా పాడగల ఉద్దండుడు ఆయన. ఎమన్నా doubts ఉంటే ఇదే పాటలో "చిరునామా లేని లేఖంటి నా గానం... చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి... నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం తీర్చేశావేమో ఈనాటికి..." అనే లైను వినండి. అక్కడ ఆయన ‘నేను నచ్చానో లేదో అని సందేహిస్తున్నా, దాన్ని తీర్చేశావు ఈనాటికి’ అని గోముగా అంటారు కదా... ఆయన డైలాగులోనే ‘అద్భుతః’

ఇక పాట వ్రాసిన వారి దగ్గరకి వద్దాం... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారంటే చాలా మందికి ‘ఆయన inspirtaional songs బాగా వ్రాస్తారు’అనే ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. వాటితో పాటు రొమాంటిక్ పాటలు కూడా చాలా అద్భుతంగా వ్రాస్తారు. అందుకు ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పాటే ఓ ఉదాహారణ. అలాగే, youthful పాటలు కూడా బాగా వ్రాస్తారు. మీకేమైనా అనుమానం ఉంటే ‘son of సత్యమూర్తి’లోని ‘Come to the party subbalakshmi’ పాట వినండి, తీరిపోతుంది. ఇక ఈ పాటలో "రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్ని దాటి విహరించుదాం... రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం" ‘ఎంత భావుకత! ఎంత రొమాంటిక్!’ అనిపించక మానవు. అలానే Atlas shrugged పుస్తకం చదివిన వారికి పై లిరిక్స్ విన్న తరువాత Ayn Rand's Herioine Dagny Taggart " It's amazing right the pleasure we can get with our bodies" అన్న మాటలు గుర్తురాక మానదు.

థమన్ గారు, retro స్టైల్ ని ఎంత అద్భుతంగా tune చేశారో.. శాస్త్రి గారి చేత సాహిత్యం వ్రాయించి, బాలు గారి చేత పాడించి, ‘ఆ పాత మధురం’ అనిపించేలా 90's kids ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినేలా, మళ్ళీ మళ్ళీ బాల్యాన్ని గుర్తు చేసుకునేలా చేసినందుకు ఎన్నిసార్లు ‘thanks’ చెప్పినా సరిపోదేమో. ఇదే తరహా retro style లో 'బలుపు' సినిమాలో బాలు గారు పాడిన, శాస్త్రి గారు వ్రాసిన " ఏమైందో " పాట కూడా థమన్ గారు స్వరపరిచినదే.

ఎన్ని పాటలు, ఎన్ని జ్ఞాపకాలు, 80s 90s యువకులకి, వీళ్ళు పాడిన ఎన్నో పాటలే ప్రేమలేఖలు అయ్యాయి. ప్రేమ విహారానికి తీసుకుని వెళ్ళాయి. అప్పటి ఆ రుచిని అప్పుడప్పుడు ఇలా రుచి చూపించే పాటలు ఇంకా రావాలి. అప్పటి వాళ్ళ పాటలలో ఇప్పటికి మీకు గుర్తుండిపోయే పాట ఏంటి?

It's amazing right the pleasure music can give us, the pleasure nostalgia can give us, the pleasure Balu garu can give us by absolutely loving the song he is singing, the pleasure Sastry garu gives us by writing his every song as if it were his first love letter, the pleasure they give us by working together on these songs... May be they even sing the following while working and absolutely loving their work “దిం దిగి ప ప దిగిడి దిగిడి... దిం దిగి ప ప...”