ఉన్న గొప్పదనాలతో పాటు మన తెలుగు నేల మీద పంచారామా క్షేత్రాలు ఉండడం ఒక గొప్ప అనుభూతికి లోను చేస్తుంది. పంచారామాలలో ఈ సోమారామ దేవలయం కూడా ఒకటి. ఈ గుడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుపూడిలో ఉన్నది.
ఆలయాలు సృష్టించబడడానికి పురాణాల్లో ఒక కథ ఉంది. పురాతన కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుని నుండి వరం పొంది అమృత లింగాన్ని పొందుతాడు. ఆ అమృత లింగం ధరించినందు వల్ల తారకాసురుడికి మరణం నుండి రక్షణగా ఉండేది. దీనిని ఆసరాగా చేసుకుని రాక్షసుడు దేవతలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసేవాడట. ఈ బాధల నుండి కుమారస్వామి తమని విముక్తులను చేయగలడని భావించి దేవతలు కుమారస్వామిని వేడుకుంటే కుమారస్వామి రాక్షసుడిని చంపేశారట. రాక్షసుని మరణం తరువాత మెడలో ఉన్న అమృతలింగం కిందపడి ఐదు ముక్కలుగా పగిలిపోయిందట ఈ ముక్కలే పంచారామా క్షేత్రాలుగా వెలిశాయని పురణాల చెబుతున్నాయి.
ఈ దేవాలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం దీనిని చాళుక్య భీమ రాజులు నిర్మించారని ఈ ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఐతే ఇందులోని భగవంతుని ప్రతిమను సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్టించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. చంద్రుడు ప్రతిష్టించడం వల్ల సోమేశ్వర లింగం అమావాస్య రోజు గోధుమ, నలుపు రంగులో మరియు పౌర్ణమి రోజు శ్వేత వర్ణంలోను కనిపిస్తుందనంటారు. ఈ దేవాలయాన్ని పంచ నందీశ్వరాలయం అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో అతి తక్కువ సంఖ్యలో మాత్రమే స్పటిక లింగాలు దర్శనమిస్తాయి అలాంటి దేవాలయాలలో ఇది కూడా ప్రముఖమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ మహా శివరాత్రి పర్వదినాలలో స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు వైభవంగా జరుగుతాయి. అలాగే దసర నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.