శోభన్ బాబు గారు ఆ రోజుల్లోనే డిగ్రీ పూర్తిచేశారు. చిన్నతనం నుండి నటనంటే అమితాసక్తి.. ఆ ఆసక్తితోనే ఎన్నో స్టేజేస్ మీద ఎన్నో నాటకాలు వేసి తన అభిరుచిని తెలియజేశారు. "తన టాలెంట్ ను మరింత మందికి తెలియజేయాలి, నాటకాలంటే వందలమందే చూస్తారు కాని సినిమా అలా కాదు లక్షలు, కోట్లాది మందికి నా గురించి తెలుస్తుంది" అని నమ్మి మద్రాస్ రైలెక్కారు. అందరిలా పూర్తిగా సినీ అవకాశాల కోసమే కాకుండా తన కెరీర్ కు సెక్యూరిటీగా ఉండడానికి "లా" చదువుతూ ఉదయం కాలేజికి వెళ్ళడం, ఆ తర్వాత అవకాశాల కోసం వేట ప్రారంభించడం.. ఇది మద్రాస్ చేరుకున్న తొలిరోజుల్లో శోభన్ బాబు గారి దినచర్య. స్వతహాగా శోభన్ బాబు గారు అందగాడు అవ్వడంతో అవకాశాలు తొందరగానే అందిపుచ్చుకున్నారు. మొదట ఎన్.టి.ఆర్ దైవబలం(1959)లో ఒక చిన్న పాత్రలో సినీ ప్రవేశం చేశారు. ఆ తర్వాత మరిన్ని పాత్రలు చేస్తుండడం, క్రమశిక్షణ, నటన మీద మంచి పట్టుండడం చేత హీరోగా అవకాశాలు వచ్చాయి. వాటిని అద్భుతంగా ఉపయోగించుకోవడంతో ప్రేక్షకుల నుండి అద్భుతమైన అభిమానాన్ని అందుకున్నారు.
ఒక పక్క ఎన్.టి.ఆర్ మరో పక్క ఏ.ఎన్.ఆర్, కృష్ణల నుండి నటన పరంగా ఎంతో పోటిని ఎదుర్కుని తనకంటూ ఒక ప్రత్యేకతను ఇండస్ట్రీలో, ప్రేక్షకులలో ప్రదర్శించడమనేది ఒక నటుడికి మామూలు విషయం కాదు. కాని అది శోభన్ బాబు గారు పట్టుదలతో సాధించారు. నటుడిగా శోభన్ బాబు గారు అంటే ఇద్దరు భార్యల మధ్య నలిగే భర్తగానే అనుకుంటారు చాలామంది కాని శ్రీ కృష్ణుడిగా, శ్రీ రాముడిగా, అభిమన్యుడిగా, అర్జునుడిగా ఇలా తన నటన పటిమను అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులకు రుచి చూపించారు. శోభన్ బాబు గారు 220 పైగా చిత్రాలలో నటించి ఉత్తమ నటుడిగా ఐదు సార్లు నంది అవార్డులను అందుకున్నారు. తనని అభిమానించిన అభిమానుల మదిలో చివరి వరకు హీరోలానే ముద్ర పడిపోవాలని ఆయన ఆశించారు.. అందుకు తగ్గట్టుగానే హీరోగా రిటైర్ అయ్యాక బాబాయ్, తాతయ్య లాంటి పాత్రలు చేయకుండా చిరస్థాయిగా సోగ్గాడిగానే తెలుగువారికి గుర్తుండిపోయారు.
శోభన్ బాబు గారి కొన్ని మరుపురాని చిత్రాలు
సోగ్గాడు
కార్తీక దీపం
ధర్మపీఠం దద్ధరిల్లింది
ఆస్థిమూరెడు ఆశ బారెడు
దేవత
ఏమండి ఆవిడ వచ్చింది
చెల్లెలి కాపురం
శారద
బంగారు పంజరం
గోరింటాకు
మల్లెపువ్వు
సంపూర్ణ రామాయణం
జీవన జ్యోతి
కాలం మారింది
మనుషులు మారాలి
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.