Contributed By Vineeth Alladi
నిన్న రాత్రి రోజుటి లాగానే 12 గంటలకి పడుకున్నాను. ఈరోజు ఉదయం 8 కి లేచాను ఇంకా మామూలుగా నా పని చేసుకున్నాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక 12:45pm కి నవల చదువుదామని అలా మంచం పైన కూర్చోని చదవడం మొదలుపెట్టాను. 1:30pm వరకు బాగానే చదివాను కానీ అప్రయత్నంగా నిద్రలోకి జారుకున్నాను మళ్ళీ 4pm కి మెలకువ వచ్చింది. అప్పుడు అనిపించింది ఛా!! ఊరికే రెండున్నర గంటలు వృథా అయిపొయాయి అని!! లేదంటే నవల ఐనా అయిపోయేది లేదా ఇంకేదైనా పని చేసేవాడిని.
మనం రోజూ చేసే పనుల్లో ఇష్టంగా ఎక్కువగా చేసే పని నిద్రపోవటం. సగటున ఆరోగ్యంగా ఉండడానికి మనిషికి 6-8 గంటల నిద్ర సరిపోతుంది. అంటే ఒకరోజు లోని ఆ మిగిలిన సమయమంతా ఎంతో హుషారుగా ఉపయోగించుకోవచ్చు. నేను ఎక్కడో చదివాను "నిద్ర అంటే తాత్కాలిక మరణం, మరణం అంటే శాశ్వత నిద్ర" ( Sleep is temporary death and death is permanent sleep) అంటే మనకి మరణించడం ఇష్టం అన్నమాట.. అలా మనం ఎక్కువ కాలం ఆ తాత్కాలిక మరణ స్థితి లోనే ఉంటే మరి అసలైన జీవితాన్ని గడిపేదెపుడు. మంచం అనేది నిద్ర అనే సంకెళ్ళను వేసి రోజులోని కొంతభాగం మనని ఉరితీస్తుంది. నిద్ర అనే మహమ్మారి మనల్ని మెల్లగా మత్తులోకి జారేటట్టు చేసి తన వశం చేసేసుకుంటుంది.
నిద్రపోవడంలో తప్పులేదు కానీ ఎంత సమయం దానికోసం వెచ్చిస్తున్నాం అన్నది తెలుసుకోవాలి. కుంభకర్ణుడికి బ్రహ్మ గారు శాపంగా నిద్రనిచ్చాడు. మనకి అటువంటి శాపం ఎవరూ ఇవ్వనిదే మన తల మీద వేసుకొని చేయని తప్పుకి నిద్రపోతున్నాం. అతడైనా 6 నెలలకి ఒక్కసారి లేస్తాడు కానీ మనలో కొందరు అది కూడా లేకుండా విలువైన సమయాన్నంతా ఆ చీకటి స్వర్గానికే ధారపోస్తున్నారు. నా దృష్టిలో మెలకువగా ఉండి పగటికలలు కనడం కొంతవరకు మంచిది. తను తన మెదడుకు పని అయినా చెబుతున్నాడు అలా ఊహించు ఇలా ఊహించు అని కానీ నిద్రలో కనే కలలు గుర్తుండవు ఒకవేళ ఉన్నా అవి దేనికీ పనికిరావు. నిద్ర ఎక్కువగా పోవడం వలన ఎన్నో ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. అతినిద్ర వల్ల sleeping cycle డిస్టర్బయ్యే అవకాశం ఉంటుంది.
మనం అతినిద్రకి లొంగకుండా ఉండాలంటే చేయాల్సినవి 1. ఉదయం అలారం ని పక్కనే కాకుండా కొంచెం దూరంలో దాన్ని తీసేయడానికి మీరు మంచం దిగే లాగా పెట్టాలి. 2. చేసే యే పని ఐనా మంచం మీద కూర్చోని మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే నిద్ర ఏ ముసుగులోనైనా వచ్చి మనకి తెలియకుండానే మనల్ని తనలోకి తీసుకెళుతుంది.
3. మధ్యాహ్న భోజనంలో కాస్త పెరుగును తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే అది నిద్రకి ప్రేరకంగా(catalyst) పనిచేస్తుంది. 4. మీకు ఇంకొంచెం దూరంలో నిద్ర వస్తుంది అనే signals కనిపించినా లేదా వినిపించినా లేచి ఏదైనా చేయండి లేదా కనీసం అటు ఇటు నడవండి.
So మిత్రులారా ఏదైనా పరిమితిలో చేస్తే అందంగా ఉంటుంది. ఆ పరిమితులని మనమే గీసుకొని దాటకుండా ఉండడానికి ప్రయత్నించండి కలల్లో కాకుండా నిజంలో జీవించండి.. Haaaawwh.. bye guys నాకు నిద్రొస్తుంది??