NTR గారి శ్రీకృష్ణ పాండవీయం సినిమా చూసి శివ ప్రసాద్ గారు వీరాభిమాని అయ్యారు. అందులో NTR గారి కాస్ట్యూమ్, బాడీ లాంగ్వేజీ చూసి గంటల తరబడి సమ్మోహణంగా ఆలోచించేవారు. తదనంతరం తనలోని టాలెంట్ వల్ల NTR గారితో కలిసి పని చెయ్యబోతున్నాను అని ఊహించి కూడా ఉండకపోవచ్చు ఆనాడు.
శివ ప్రసాద్ గారిది గుడివాడ. అమ్మ నాన్నలిద్దరూ పెయింటింగ్స్ వేస్తారు(ఇప్పటికీ) మంచి ఆర్టిస్టులు. బొమ్మలు వేయించుకోవడానికి అమ్మ నాన్నల దగ్గరికే కాదు ప్రసాద్ గారి దగ్గరికి మిత్రులు, బంధువులు వచ్చేవారు. ఒక వయసు వచ్చేసరికి తనని తాను మొయ్యాల్సిన పరిస్థితికి తీసుకువచ్చింది కాలం. బ్రతుకు తెరువు కోసం గుడివాడ నుండి హైదరాబాద్ కు వచ్చారు. 1975 నుండి 1977 వరకు చిన్న చిన్న చోట్ల నచ్చిన పనులు చేశారు. 1977 సెప్టెంబర్ 7న 200రూపాయల జీతంతో ఈనాడు లో పనులు మొదలుపెట్టడంతో శివ ప్రసాద్ గారి పేరు తెలుగు ప్రజలకు తెలిసిపోయింది.
ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఈనాడు లో పనిచేసేవారు. ఆ తర్వాత ఈవారం, దాసరి నారాయణ రావు గారి ఉదయం, శివరంజని, ఇలా మొదలైన చోట్ల ఆత్మాభిమానంతో పనిచేశారు. ఇదంతా తాను ఎదగడానికే అనుకున్నారు తప్పా కష్టపడుతున్నానని అనుకోలేదు. ఆయన భావించినట్టు గానే నేర్చుకున్నారు, ఎదుగుతున్నారు, అన్నిటి కన్నా ముఖ్య విషయమేమిటంటే నేర్చుకున్న విద్యను పది మందికి చెప్పి ప్రసాద్ గారితో సమానంగా ఎదిగేలా కృషి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న "లేపాక్షి, రామబ్రహం, రమేష్, శివరాం మొదలైన వారు శివ ప్రసాద్ గారి శిష్యులే. "సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ల లోగో డిజైన్ చేసింది కూడా శివ ప్రసాద్ గారే.
శివరంజని మ్యాగజైన్ లో NTR గారి విశ్వామిత్ర విశ్వరుపాన్ని అద్భుతంగా పెయింటింగ్ వేసి కవర్ ఇమేజ్ తో పబ్లిష్ చేశారు. దానికి మధ్యవర్తుల సహాయం లేకుండానే NTR గారిని చేరుకుంది, అంతే!! NTR గారు స్వయంగా పిలుపించుకుని రాచ మర్యాదలు చేసి "బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్" సినిమాల కోసం పెయింటింగ్స్, కాస్ట్యూమ్ కై ఏ లుక్ బాగుంటుందని బొమ్మలు వేయించుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు పనిచేశారు. ఈ మధ్య కాలంలో క్రిష్ గారి డైరెక్షన్ లో వచ్చిన "కృష్ణం వందే జగద్గురుమ్" కోసం ప్రత్యేకంగా బొమ్మలు వేయించుకున్నారు. "మీరు వేసిన విశ్వరుపానికి సాటి రాగల బొమ్మ నాకు మరొకటి కనిపించలేదు" అని క్రిష్ గారు ఇప్పటికీ పొగుడుతుంటారు కూడా.. ఆధ్యాత్మికంగ ఎవరెస్ట్ స్థానానికి చేరుకున్న రామకృష్ణ మఠం కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. మఠం లో కనిపించే వివేకానంద రథం శిల్పం, శ్రీరామకృష్ణ ప్రభ లో పబ్లిష్ చేసే బొమ్మల కోసం కూడా ప్రసాద్ గారు పనిచేశారు.
60 సంవత్సరాల జీవన ప్రయాణంలో శివ ప్రసాద్ గారు వేసిన కొన్ని వర్ణ చిత్రాలు..
1. NTR ఓకే చేసిన టైటిల్ నీ, ఆయన చేసిన సంతకాన్ని చూసి మీరంతా సంతోషిస్తారనీ ఈ టైటిల్స్ మీకు చూపిస్తున్నాను.
2. శివప్రసాద్ గారూ! మీరు వేసిన విశ్వరూపం బొమ్మ మా ఫోటో అల్బమ్స్ లోని అన్ని ఫోటోలను డామినేట్ చేస్తోంది.అందుకే మీ బొమ్మతోనే మెయిన్ పోస్టర్ రిలీజ్ చేశాం -డైరెక్టర్ క్రిష్.
3. NTR హృదయాన్ని గెలుచుకున్న ఈ పెయింటింగ్ డైలీ పేపర్ యాడ్
4. ఇది ధర్మంగా ఉందా బ్రదర్..? మీ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా వెళ్లిపోతే మీకోసం ఎదురు చూస్తున్న మీ మనుషుల పరిస్తితి ఏమిటనే ఆలోచన చెయ్యకపోవడం ధర్మంగా ఉందా బ్రదర్?
5. మీరంతా ఇలా పిల్లల వలే మారాలి.అప్పుడే మీకు మోక్షం దొరుకుతుంది
6. విశ్వనట చక్రవర్తి
7. స్వయంవద ' సినిమా Super Hit కావాలని కోరుకుంటూ..
8. ప్రపంచం మొత్తాన్ని తన కంఠంతో ఆనందసాగరంలో ఓలలాడించిన ఆ మహానుభావుని బొమ్మ.. మిమిక్రీ మాంత్రికుడు వేణుమాధవుడు.
9. తన శిష్యుడు అభేదానందస్వామికి అన్నీ తానై దర్శనమిచ్చిన గురుమహరాజ్ శ్రీరామకృష్ణ పరమహంస
10. తెలుగు భాషకి, తెలుగు వాడికి ఎనలేని గుర్తింపు తెచ్చిన తెలుగు వారి ఏకైక అన్న
11. కోటాను కోట్ల సైన్యం
12. రావణబ్రహ్మ గెటప్ లో బాలకృష్ణ
13. అప్పట్లో 'శివరంజని'విశ్వరూపం కోసం
14. 'చాణక్య' గా NTR, 'అశోకుడు'గా బాలకృష్ణ
15. అందం - అక్కినేని
16. శివప్రసాద్ కళ్ళు మూసుకొని వేసినా NTR బొమ్మ వస్తుంది
17. ఈ జగన్మాత పెయింటింగ్ ని 1993 సం.లో వేశారు. అప్పట్లో ఇది సక్సెస్ ఫుల్ క్యాలెండరు.