Here's The Beautiful Meaning & Lyrics Of The Special Srikaakulam Song 'Sitharaala Sirapadu' from Ala Vaikuntapuram Lo

Updated on
Here's The Beautiful Meaning & Lyrics Of The Special Srikaakulam Song 'Sitharaala Sirapadu' from Ala Vaikuntapuram Lo
Recent times anni songs hit ayina albums lo Ala Vaikuntapuram lo Album okati. Jukebox lo unna prathi song chaala mandi favorite list tappakunda long time untundi. Kaakapothe Ee songs tho paatu surprising cinema climax lo vache "Sitharaala Sirapadu" ane song kuda same hype create cheskundi. Vinna first time ey andariki nachesina aa song official audio kosam chaala mandi edhuru chusaaru and it is finally out. ఈ పాట లోని పదాలు అచ్చ తెలుగు జానపదాలని ప్రతిబింబిస్తుంది. ఈ పాటని రాసింది విజకుమార్ బల్లా గారు. ఈయన LIC IT Manager గా పని చేస్తున్నారు. శ్రీకాకుళం యాస లో ఒక పాట కోసం తన అసోసియేట్ డైరెక్టర్ ద్వారా విజయ్ గారిని కలుసుకున్నారు త్రివిక్రమ్ గారు. విజయ్ కుమార్ గారు సినిమా కోసం పాట రాయడం మొదటిసారైనా ఆ పాట ని చాలా తక్కువ టైం లోనే రాసారంట. ఈ పాట climax ఫైట్ అప్పుడు వస్తుంది. ఒక పాట తో fight ని compose చేయడం చాలా అరుదు గా జరుగుతుంటుంది కాబట్టి. ఆ fight చూడటానికి చాలా కొత్తగా ఉంటుంది. ఈ పాట "ఎంకి పాటలు" లాగ ఒక వ్యక్తిని వర్ణిస్తూ సాగుతుంది. విజయ్ గారు తన youtube channel లో ఎంకి పాటలని, మరెన్నో అలాంటి జానపద, లలిత సంగీతాన్ని సేకరించి తాను పాడి, తన స్నేహితుల చేత పాడించి upload చేసేవారు. ఆ పాటల ప్రభావం ఈ "సిత్తరాల సిరపడు" బాగా కనిపిస్తుంది.
    "సిత్తరాల సిరపడు" పాట లోని సాహిత్యం ఇది.
సిత్తరాల సిరపడు.. సిత్తరాల సిరపడు.. ఉత్తరాన ఊరి సివర సిత్తరాల సిరపడూ.. పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు. పెత్తనాలు నడిపేడు-సిత్తరాల సిరపడు- మంతనాలు సేసినాడు - సిత్తరాల సిరపడు ఊరూరూ ఒగ్గేసిన ఉడుం పట్టు ఒగ్గడు. బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతె కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో...... జడలిప్పె మర్రి సెట్టు దెయ్యాల కొంపంటే దెయ్యం తో కయ్యానికి తొడగొట్టి దిగాడు.... అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు గుంటలెంట పడితేను. గుద్దిగుండ చేసినాడు... గుంటలెంట పడితేను. గుద్దిగుండ చేసినాడు... వరదలో గుంటగాళ్లు సిక్కుకొని బిక్కుమంటే వరదలో గుంటగాళ్లు సిక్కుకొని బిక్కుమంటే ఈతీదుకుంటుపోయి ఈడ్చుకొచ్చినాడు రో... ఈతీదుకుంటుపోయి ఈడ్చుకొచ్చినాడు రో... పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు.. రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు.. పదిమందినాగలేని పదిమూర్ల సొరసేపా పదిమందినాగలేని పదిమూర్ల సొరసేపా ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు ఒడుపుగా ఒంటి సేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ. సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ. అడుగడుగు యేసినాడా అదిరేను అవతలోడు .. అడుగడుగు యేసినాడా అదిరేను అవతలోడు .. సిత్తరాల సిరపడు-సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరిసివర -సిత్తరాల సిరపడు గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చేడు. గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చేడు. సక్కనమ్మ ఎనుకబడ్డ పోకిరోళ్ళనిరగదంతె సక్కనమ్మ ఎనుకబడ్డ పోకిరోళ్ళనిరగదంతె సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె. సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె.. Telugu chadavaleni vaalla kosam Sittharala Sirapadu Sittharala Sirapadu uttharaana oori chivara sittharala sirapadu pattu pattinaada oggane oggadu Petthanaalu nadipedu Sittharala Sirapadu oorooru oggesina udumpattu oggadu Bugathodi aambothu rankesi kummabothe Bugathodi aambothu rankesi kummabothe kommuloodadeesi maripeepaloodinaduro.. Jadalippi marri settu deyyala kompante Jadalippi marri settu deyyala kompante deyyamutho kayyaaniki thodakotti digadu Ammori jaatharalo onti tala raavanudu ammori jaatharalo onti tala raavanudu guntalenta padithenu guddi gunda sesinadu guntalenta padithenu guddi gunda sesinadu Varadalo guntagaallu chikkukoni bikkumante varadalo guntagaallu chikkukoni bikkumante eedeedhukuntuboyi eedchukocchinaaduro.. eedeedhukuntuboyi eedchukocchinaaduro.. Ponnuru vasthadhu dhammunte rammante ponnuru vasthadhu dhammunte rammante rommumeedhokkatichi kummi kummi poyadu rommumeedhokkatichi kummi kummi poyadu Padi mandi naagaaleni padi moorla sorasepa padi mandi naagaaleni padi moorla sorasepa odupugaa ontisetho oddukottukochinaadu saamusese kandathoti denikaina gattipoti adugadugu esinada adhirenu avathalodu Sittharala SirapaduSittharala Sirapadu uttharaana oori chivara sittharala sirapadu gandupilli soopulathogundelona guchaadu Sakkanamma enakabadda pokirolla iragadanthe sakkanamma enakabadda pokirolla iragadanthe Sakkanamma kallallo yela yela sukkaloche sakkanamma kallallo yela yela sukkaloche భావం: ఉత్తరం దిక్కున ఉండే సిరపడు అనే వ్యక్తి ఎన్నో చిత్రాలు చేస్తాడు(సిరపడు అనే పదాన్ని సురుకైన వాడు, ఏదైనా చేద్దామనుకుంటే చేసేసేవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు. వంశధార, నాగవల్లి ప్రాంతం లో ఈ పదాన్ని వాడతారు. అక్కడ LIC officer గా పనిచేస్తున్నప్పుడు ఈ పదాన్ని విన్నారంటా విజయ్ కుమార్ గారు.). పెత్తనాలు (పెద్ద పెద్ద పనులు) చేస్తాడు. ఒక్కసారి తను ఏదైనా అనుకుంటే అస్సలు వదలడు. ఊరంతా వదిలినా కానీ, ఆ పని మీద తను పట్టిన ఉడుంపట్టు వదలడు. (ఉడుము = Monitor lizard). బుగుతడి(బుగత అంటే భుక్త కి వికృతి. భుక్త అంటే పెత్తనం చలాయించేవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు అనే అర్ధం లో ఉపయోగిస్తారు.) ఆంబోతు కుమ్మడానికి వస్తే, ఆ ఆంబోతు కొమ్ములని విరిచి ఆ కొమ్ములని పీపలుగా (trumpet) లా ఊదడంట. జడలున్న మర్రిచెట్టు ని అందరు దెయ్యాలు ఉండే చోటు అనే భయపడుతుంటే, ఆ దెయ్యము తో కయ్యానికి తొడకొట్టి దిగాడు. అమ్మోరు జాతర రావణుడు లాంటి మనిషి అమ్మాయిలని ఏడిపిస్తూ వెంట పడుతుంటే, వాళ్ళని కొట్టి మట్టి కరిపించాడు (నేలకూల్చాడు). వరదలో చిక్కుకుని కుర్రాళ్ళు భయపడుతుంటే, ఆ వరదలో కూడా ఈదుకుంటూ పోయి వాళ్ళని ఒడ్డు కి తీసుకొచ్చాడు. పొన్నూరు కి చెందిన వస్తాదు(కండలు తిరిగిన బలవంతుడు), దమ్ముంటే తనతో పోటీకి రమ్మంటే, అతని రొమ్ము మీద ఒక దెబ్బకొట్టి కుమ్మి అవతలేసాడు. పది మంది కూడా లాగలేని పది మూరల (మన చెయ్యిని మోచెయ్యి వరకు 10సార్లు కొలిస్తే ఎంతుంటుందో అంత) సొరచేపా ని కూడా ఒడుపుగా (జాగ్రత్త గా gripping గా) పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చాడు. రోజు సాము (excercise) చేసే కండ అతనిది. దేనికైనా గట్టి పోటీ ఇవ్వగలడు. అతడు అడుగువేస్తే అవతల ఎవరున్న బెదిరిపోతాడు. అలాంటి ఎన్నో వింతలు చిత్రాలు చేసే సిరపడు. గండు పిల్లిలాగ చురుకైన చూపు తో శత్రువు గుండెలో గుచ్చాడు.. అలా తన వెంట పడిన పోకిరోళ్ళని సిరపడు తంతుంటే, ఆ సక్కనమ్మ కళ్ళు సుక్కలు వచ్చినట్లు వెలిగిపోతున్నాయి.. పూర్వం పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఆ పని అలసట తెలీకుండా ఉండటానికి ఇలా తాము చుసిన కథలను, వ్యక్తుల గురించి పాటలుగా పాడేవాళ్లు వాటినే జానపదాలు అంటారు. సినిమాలో కూడా ప్రతినాయకుడు పని చేస్తూనే ఈ పాట పాడుతాడు. ఒక పక్క ఈ పాట వస్తుంటే ఆ సాహిత్యానికి తగ్గట్టు గా fight ని fight masters Ram - Laxman చాలా బాగా compose చేశారు. జానపదాలు మన సంపద, వీటిని ఇలా సినిమాలలో ఇమడ్చడం వల్ల వాటిని కొంతైనా తరువాతి తరానికి తెలిసేలా చేసే ఆస్కారం ఉంది.