అధికారం తో అణిచేయలేరు అన్నిటిని...విశ్వంభర - సింగిరెడ్డి నారాయణ రెడ్డి!

Updated on
అధికారం తో అణిచేయలేరు అన్నిటిని...విశ్వంభర - సింగిరెడ్డి నారాయణ రెడ్డి!
సింగిరెడ్డి నారాయణ రెడ్డి అదేనండి మన సినారె గారు నవీన తెలుగు సాహిత్యానికి ఎంతో సేవ చేసిన కవి, పండితుడు, రచయిత ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సాహితీవేత్త. ఆయన రాసిన విశ్వంభర చదవక ముందు వరకు నేను ఆయన్ని కేవలం కవి మాత్రమె అనుకునేవాడ్ని, అది చదువుతుంటే అర్ధం అయ్యింది ఆయన కేవలం సాహితీ వేత్త మాత్రమె కాదని. విశ్వంభర లో ఆయన రాసిన పదాలు, అడిగిన ప్రశ్నలు, చేసిన వర్ణనలు, ఇచ్చిన సమాధానాలు, చూపిన చతురత, తెలిపిన విషయాలు, ఎంచుకున్న మార్గం, నడిచిన దారులు, పడిన శ్రమ, అనుభవించిన వేదన, ఆలోచనలతో చేసిన ప్రయాణంతో పాటుగా నాకు తెలిసిన పదాల్లో వివరించలేని ఎన్నో సత్యాల గురించి నా తెలివికి గల పరిదిలో నేను అర్ధం చేసుకున్న దాన్ని బట్టి చూస్తె ఆయనో వేదాంతి, శాస్త్రవేత్త, రుషి, సత్యాన్వేషకుడు ఒక్క మాటలో చెప్పాలంటే తన అస్తిత్వాన్ని ప్రశ్నించిన మనిషి. ఆయన కలం పాడని సాహిత్య విధానం లేదు. పద్య, గద్య, గేయాలు, యాత్రా కథనాలు, చలన చిత్ర గేయాలు, సాంఘీక నాటకాలు, సంగీత నృత్య రూపాలు, బుర్ర కథలు, ఘజల్లు, విమర్శన గ్రంధాలూ, అనువాదాలు ఇలా ప్రతి దానిలో ఆయన ప్రవేశం ఉంది. గులేబకావళి చిత్రంలో నన్నుదోచుకుందువటే ఆయన సినిమాలకు రాసిన మొదటి పాట. అలా మొదలయిన ఆయన ప్రస్థానం 3500 గేయాలకు విస్తరించింది. తెలిసిందిలే..., నువ్వు నా ముందుంటే..., ఈ రేయి తీయ్యనిది..., చిత్రం హాయ్ భళారే విచిత్రం..., పగలే వెన్నెలా..., గున్నమామిడి కొమ్మ మీద..., నీ మది చల్లగా స్వామీ నిదురపో... వంటి మధురమైన పాత గేయాలు ఇప్పటకీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. విశ్వనాధ సత్యనారాయణ తర్వాత తెలుగు సాహిత్యం లో జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న వ్యక్తి సినారె గారు. భూమీ పుట్టుక నుండి నేటి ఆధునిక సమాజం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలపై ఆయన శైలిలో రాసిన విశ్వంభర కు జ్ఞానపీఠ పురస్కారం దక్కించుకున్నారు. ఆయన రచనలు చాలా భాషల్లోకి అనువదించబడినాయి. తెలుగు లోనే కాదు ఉర్దూ లో కూడా ఆయన రచనలు చేసారు. పద్మ భూషణ్ అందుకున్న అతి తక్కువ మంది కవుల్లో ఒకరు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి కళా ప్రపూర్ణ బిరుదు అందుకున్నారు. ఆసక్తి ఉంటె దిగుమతి చేసుకొని చదవండి ::: విశ్వంభర విశ్వంభర కావ్యం నుండి కొన్ని అద్భుత వివరణలు, వర్ణనలు, విషయాలు... అధికారం తో అణిచేయలేరు అన్నిటిని...అనవసరంగా అధికం చేయటం తప్ప ప్రయోజనం ఉండదు. ఈ విషయం తెలీని మూర్ఖులు ఎందరో. సినారే గారు ఎప్పుడో చెప్పారు అర్ధం చేసుకోండి మాష్టారు !! 1-1 మన చుట్టూ ఉన్న ప్రకృతి ఏర్పడిన తీరును ఆయన వర్ణించిన తీరు వివరించలేను నేను. rendu నిజమే కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చునేమో కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం. అందరు కాకపోయినా చాలా మంది తమ జీవిత కాలం లో ఒక్క సారైనా ఈ ఆలోచన చేయక మానరు. Untitled-2 copy గర్వం తో విర్ర వీగే వాడిని చూసి భయపడతారేమో గాని గౌరవం మాత్రం పెంచుకోరు. ఈ సత్యం అర్ధం చేసుకోగల వాడికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. Untitled-3 copy ఈ కాలం లో దైవ ప్రీతే కాదు పాప భీతి కూడా లేదు. ఆ స్థాయి దాటి అధోపాతాలనికి పడిపోతున్నారు మనుషులు. పాప పుణ్యాలు పట్టించుకునే వారిని పాతతరం కింద లెక్కేసి, తప్పు ఒప్పుల హద్దులు దాటేసి ఎగురుతున్నారు. Untitled-4 copy ముగింపు ఉందని తెలిసికూడా ఎందుకో ఈ అర్ధం లేని ఆరాటాలు,అనుచుకోలేని ఆవేశాలు, అవసరం లేని పోరాటాలు. అంతా కొంతకాలమే అని తెలిసి కొందరు, తెలియక ఇంకొందరు. Untitled-6 copy ఇదండీ మన సినారే గురించి మీకు నేను చెప్పదలుచుకున్నది. మీకు ఆయన గురించిన గొప్ప విషయాలు తెలిసుంటే కామెంట్లలో పెట్టేయండి మరి, ఆర్టికల్ ని నవీకరిద్దాం(అప్డేట్).