Contributed By Sri Sudha Sesham
మంగళ వాద్యాలకు పురోహితుడి మంత్రాలకు దూరంగా పెళ్లికి తొడుక్కుని చప్పుడు చేస్తున్న మట్టి గాజులకి దగ్గరగా అత్తింట్లో బెడ్ మీద కూర్చున్న కావేరి మదిలో ఎక్కడున్నావ్? ఎందుకున్నావ్? ఎలా ఉన్నావ్? ఇలా ఎన్నో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం ఆలోచించే లోపల షాంపూ బాటిల్ ఇచ్చింది అత్తగారు అప్పటికప్పుడు తేరుకుని షాంపూ తీసుకుని స్నానానికి వెళ్ళింది. స్నానం చేసేంత వరకూ అదే ప్రశ్నల సమూహం తన ఆలోచనలు తన పరమితిలేకుండా ఎదురౌతున్న క్షణం ఎన్నో భావాల నడుమ స్నానం ముగించుకుని తయారైంది. చుట్టాల ఇంటికెలితెనే గంటన్నరలో తన ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసే గుణం తనది అలాంటిది జీవితంలో ఒక్క పూట కూడా గడపని మనుషులతో ఒక్క రోజైనా ఉండని ఇంట్లో ఇకపై తన సంసారం సాగించాలి అన్న విషయం మెదడుకు అర్ధమయ్యి వెన్నులో పుట్టిన భయం కళ్ళలో కనబడకుండా చిరునవ్వుతో సర్దుతూ రూంలో నుండి బయటికి వెళ్ళింది.
అందరూ తన కోసమే చూస్తున్నట్టు అనిపించింది ఒకేసారి అందరినీ ఎలా పలకరించాలో తెలీక నెమ్మదిగా అందరినీ నవ్వుతూ చూస్తూ వంటింట్లో ఉన్న దేవుడి గదికి వెళ్ళింది అంతమందిలో తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆ దేవుడే కొద్ది సేపు కళ్ళు మూసుకుని దండంపెట్టుకుంది. “ఏమైనా నీదే బాధ్యత” అని చెప్పి కళ్ళు తెరిచి వంటింట్లో అత్తగారి దగ్గరకి వెళ్ళి ఏమైనా సహాయం కావాలో అని అడిగి పక్కనే ఉన్న టీ గ్లాసులు అందించింది. మొదటి రోజే పని చేయించుకోవడం ఇష్టం లేని అత్తగారు నవ్వుతూ “అప్పుడే వంటింట్లో ఎందుకు అక్కడ కూర్చో నేను చేస్తాలే” అని చెప్పింది. ఇంకా ఏం చేయాలో తెలీక వెళ్ళి కుర్చీలో కూర్చుంది. ఈలోపు ఎవరో పెద్దావిడ వచ్చి చూసి “బాగున్నావు..” అన్నది మామగారు వాళ్ళ పిన్ని అని పరిచయం చేసేసరికి దండం పెట్టడానికి లేచింది ఇంతలో తోటికొడలు వచ్చి “మీ ఆయన్ని కూడా పిలువు” అనేసరికి ఒక్క క్షణం ఎవరూ కనపడలేదు చేతికి దొరికాల్సిన ఉప్పు డబ్బా ఎదురుగా ఉన్న కనపడనట్టు తన భర్త పక్కనే ఉన్న ఎక్కడా అనట్టు వెతికింది ఈలోపు ఒక చేయి ఇక్కడే ఉన్నా అని తట్టినట్టు అనిపించింది మళ్ళీ స్పృహలోకి వచ్చి ఇద్దరూ దండం పెట్టారు, “సుఖంగా ఉండండి” అని దీవించి వెళ్ళిపోయింది. తన స్థితి తెలుసుకుని మళ్ళీ రూంలోకి వెళ్లి గట్టిగా ఊపిరి వదులుతూ పీలుస్తూ ఒక రెండు నిమిషాలు ఉండిపోయింది.
అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటూ “you need to keep it together, I know it’s scary and crazy but you can do this” అని చెప్పుకుంది. డోర్ చప్పుడు కాగానే తెరిచి బయటికి వెళ్ళింది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న అమ్మని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి “నన్ను తీసుకుపోవే” అనాలనుకుంది కానీ వెళ్లి అమ్మ చేయి పట్టుకోగానే కొండంత ధైర్యం వచ్చినట్టనిపించింది అప్పటి వరకూ ఎప్పుడూ నాన్నని వెతుకుని, నాన్న కోసం ఎదురుచూసే గారాల కూతురు అమ్మని పట్టుకొని లోపలికెళ్లుతుంటే ఆ తండ్రికి కొత్తగా అనిపించింది. ఇద్దరినీ కూర్చోబెట్టుకునేసరికి గుండెలోని ధైర్యం మెదడుకి ఆసరా ఇచ్చింది. అందరూ కలిసి భోజనం చేసి ఎవరికి వారు రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుని terrace మీదకి వెళ్ళింది. “ఎలా చేసావే నువ్వు.. అంటే అదే అందరూ ఎలా చేస్తున్నారు?” అనగానే అమ్మ “ఏమైందే దీని గురించి మాట్లాడుతున్నావ్”
కావేరి : ఇదే ఈ పెళ్లి, అత్తగారిల్లు చుట్టాలు... నా వల్ల కాదేమోనే అసలు మనల్నే పంపించాలని ఎందుకు రాసరే ఎవరు చెప్పారు మా ఆయన చూడు హ్యాపీగా మొన్న ఒకరోజు వచ్చి వెళ్ళిపోయాడు నేనేమో అన్నీ సర్దుకుని వదులుకుని ఇక్కడికి permanent గా వచ్చా this is not fair. ప్రపంచంలో అమ్మాయిని చూడలే అనట్టు అందరూ నన్నే చూస్తున్నారు, నడుస్తున్న, తింటున్నా, చివరికి కళ్ళు మూతి తుడుచుకుంటున్నా నన్నే చూస్తున్నారు. ఇవన్నీ నేను expect చేయాలే more over I’m not ready ఏదో ఒకటి చేసి తీసుకుపోవే.
అమ్మ : ఆగు ఆగు ముందు ఇక్కడ కూర్చో ఇలా రా అంటూ అక్కడే ఉన్న steps మీద కూర్చోబెట్టింది.
అమ్మ :ఎవరు రాశారో ఎవరు చెప్పారో నాకు తెలీదు కానీ ఇలానే జరగాలి అని ఎప్పటి నుండో వస్తున్న పద్ధతి ఇది. ఎవరికైన చెప్పి చూడు ఇందులో ఏముంది అందరమ్మైలు చేసేదేగా నువ్వే మొదటిసారి కాదు అంటారు అలా అనేవాళ్ళలో ఆడవాళ్లే ఎక్కువ ఉంటారు. చూడు కావేరి ఇది 1960s కాదు ఎవరైనా వచ్చి ఏమంటారో అని భయపడ్డానికి ఒకవేళ ఏమైనా అన్నా you’re not a kid ధైర్యంగా మాట్లాడు. ఇక కొత్త ఇల్లు జనాలు అంటావా it’s part of life ఏదైనా నువ్వు మొదలు పెట్టినప్పుడు కొత్తగానే ఉంటుంది కొద్దిగా సమయం ఇచ్చి చూడు అన్ని సర్దుకుంటాయి. మొదటి సారి job లో join అయినప్పుడు ఎలా డీల్ చేసావు same ఇక్కడ కూడా
కావేరి : అప్పుడు evening కల్ల ఇంటికి వచ్చేదాన్ని హ్యాపీగా ఇక్కడ అలా కాదే
అమ్మ: (నవ్వుతూ) మన జీవితంలోకి వచ్చే వాళ్ళని ఎవరు నిర్ణయిస్తారో తెలీదు కానీ ఎవరితో ప్రయాణం సాగిస్తమో మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అందరూ కొత్తవాల్లే కాదనట్లే అందుకే అర్థం చేసుకోడానికి టైం ఇవ్వు. మన ఇల్లు వేరే ఊర్లో కాదుగా ఒక గంట ప్రయాణం అంతే నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావొచ్చు ఎవరూ అడ్డుచెప్పరు ఎందుకంటే అది నీ హక్కు, ఇక్కడ ఉండడం నీ బాధ్యత so ఎక్కువ ఆలోచించకు నీకు అలవాటు అయ్యేవరకు ఒక వారం మన దగ్గర ఒకవారం ఇక్కడ ఉండు నేను మాట్లాడతా మీ అత్తగారి వాళ్ళతో... ఒకే నా? ఇంకొక విషయం ఇవన్నీ పక్కకి పెడితే నీ tension నాకు అర్థమైంది అనుభవమూ అయ్యింది ఐతే ఇది అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి తోడుండాల్సిన మనిషి నీ పక్కనే ఉంటే ఇంకా easy అయితది ఒక్కసారి చెప్పి చూడు you will feel better.
అని చెప్పి కిందకి వెళ్తుంటే కిరణ్ (అల్లుడు) పైకి వస్తూ ఉంటాడు
అమ్మ: తనూ పైన ఉంది బాబు పైకి వెళ్తున్నప్పుడు “ఒక్క నిమిషం బాబు”
అమ్మ: నిన్నటి ‘మన’లో ఉన్న మనుషులకి , నేడు ‘మన’లో ఉన్న మనుషులకి మధ్య నలిగే జీవితం స్త్రీ ది
దాన్ని అర్థంచేసుకునే మనసు ఆ రెండు ‘ మనలో ‘ ఉన్న వ్యక్తులకు లేదు. మీకు అమ్మాయిలు ఎక్కువ expect చేస్తున్నారు అనిపిస్తుంది కానీ నిజానికి వాళ్ళది భయం అది దాటే సమయంలో మీరు పక్కన ఉంటే చాలు, నువ్వు పక్కనే ఉంటే చాలు. జాగ్రత్త అది ఏమైనా తొందరపడి అంటే కొంచెం సర్దుకో బాబు.
కిరణ్: don’t worry అత్తయ్య నేను చూసుకుంటాను , అని చెప్పగానే అమ్మ దిగుతుంది.. కిరణ్ పైకి వెళతాడు.
“ఒకరికొకరు అని వేసే కొంగుముడి తాలూకు మొదటి మెట్టు నిన్ను నమ్మి వచ్చే అమ్మాయికి నీ ఇంటిని తన ఇంటిని చేసే ప్రక్రియలో తోడుండడం అది ప్రతీ మగాడి మొగుడి బాధ్యత”