షెర్లి థర్డ్ క్లాస్ నుండే కరాటే నేర్చుకుంది(ప్రస్తుతం బ్లాక్ బెల్ట్ హోల్డర్) తన 17 సంవత్సరాల వయసు నుండే స్కూల్స్, కాలేజీలకు వెళ్లి అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టి దాదాపు 3,000 మందికి ఎక్కడో ఎదో మూలన ఉన్న భయాలను తొలగించింది. చిన్నతనం నుండే "గుడ్ టచ్, బ్యాడ్ టచ్" అంటే ఏమిటి.? అలాగే అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలని దాని వల్ల వారి ఉన్నతి ఆధారపడుతుందని షెర్లి నమ్మకం. తన ఆలోచనలు తెలియజేసే ఓ చిన్న ఇంటర్వ్యూ..
1. హాయ్ షెర్లి గారు.. ఇప్పుడు పోలీస్ ఫోర్స్ చాలా పెరిగింది. షీ టీమ్స్, విమెన్ పోలీస్ స్టేషన్లు, అలాగే టెక్నాలజీ కూడా చాలా పెరిగింది. చిన్న కాల్ చేసినా కానీ వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి పోలీసులు వస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా విమెన్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలా.? షెర్లి: అన్నిసార్లు మన దగ్గర టెక్నాలజీ ఉంటుందని చెప్పలేము.. ఒక్కోసారి మన దగ్గర ఫోన్ ఉండదు, లేదంటే నేరం చేసే వ్యక్తి ఫోన్ లాక్కోవచ్చు. అసలు ఫోన్ లేని, టెక్నాలజీపై అవగాహన లేని మహిళలు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. వారికి మొదట బేసిక్ థింగ్స్ తెలియాలి! ఎలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి.. తర్వాత పోలీసులను ఎలా అప్రోచ్ కావాలి. "నాకు కరాటే తెలుసు కాబట్టి నాకు ఎక్కడైనా ఏ చోటైనా భయం ఉండదు". అందరితో త్వరగా కలిసిపోతాను, అనుమానం లేకుండా నా అడుగులు ఉంటాయి. విమెన్ కు కూడా సెల్ఫ్ డిఫెన్స్ తెలిస్తే అంటే "కొరకటం కానీ, చుట్టూ ఉన్న వస్తువులతో అటాక్ చెయ్యడం కానీ, మట్టి ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చల్లడం వల్ల కానీ, బాడీలో సెన్సిటివ్ పార్ట్స్ కొన్ని ఉంటాయి అక్కడ అటాక్ చెయ్యడం" మొదలైన బేసిక్స్ తెలియడం వల్ల పోలీసులు వచ్చేలోపే లేదంటే, పోలీసులు లేకపోయినా కానీ విమెన్ చాలా రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
2. ఒకవేళ మీరు కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ కాకుంటే విమెన్ కి సెల్ఫ్ డిఫెన్స్ తప్పనిసరి అనే ఆలోచన మీకు వచ్చేదా.? షెర్లి: తప్పకుండా వచ్చేది!!
3.అసలు ఇలాంటి థాట్ ఎప్పుడు వచ్చింది.? మీ పర్సనల్ లైఫ్ లో కానీ బయట ఎక్కడైనా జరిగిన సంఘటనల వల్ల మీరు మోటివేట్ అయ్యారా.? షెర్లి: నేను అదే చెప్పబోతున్నాను.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ కానీ, టీవీ చానెల్ ఎక్కడ చూసినా కానీ రేప్ ఇన్సిడెంట్స్, విమెన్ పై జరిగే వేధింపులు చాలా చూస్తుండేదానిని!! త్రీ మంత్స్ బేబీని రేప్ చెయ్యడం, ఐదుసంవత్సరాలలోపు పిల్లలపై లైంగిక దాడులు చేయడం ఇంకా చాలా చూస్తున్నాను వాళ్ళకి ఏమి నేర్పించలేము, కానీ యంగ్ గా ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ సెల్ఫ్ డిఫెన్స్ మనం నేర్పించవచ్చు ఎందుకంటే వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి. ఒక వేళ నేను కరాటే నేర్చుకోకపోయినా కానీ ఇలాంటివి జరుగుతుండటం చూసి మొదట నేను సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని ఆ తర్వాత మిగిలిన వారికి నేర్పించి ఉండేదానిని!! అలాగే నేను గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురుంచి కూడా క్లాస్ తీసుకుంటాను. రేప్ అనేది ఎక్కువగా మన చుట్టూ ఉండే వ్యక్తులు, మనల్ని ఎప్పటి నుండో గమనిస్తున్న వ్యక్తుల నుండే జరుగుతుంది.. "వారి చూపులు, మాటతీరు మన శరీరాన్ని తాకాలని ప్రయత్నించడం" మొదలైనవి జరుగుతుంది. వీటన్నిటి గురుంచి కూడా నేను వివరిస్తాను.
4. ఇప్పుడు మీ ఏజ్ కేవలం 19 సంవత్సరాలు, ఇంత చిన్న వయసులోనే మూడు వేల అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు కదా మీ తోటి స్నేహితులతో పోల్చుకుంటే ఇంత చిన్న వయసులోనే నేను చాలా సాధించానని మీరు అనుకుంటున్నారా.? షెర్లి: నిజానికి నాకు ఎప్పుడూ అలా అనిపించలేదండి(నవ్వుతూ..) ఇంకా చాలా తక్కువ చేశాననే అనిపిస్తుంటుంది.. 3,000 పీపుల్ నే ట్రైన్ చేశానా ఇంకా... 3,00,000 పీపుల్ ని ట్రైన్ చేసి ఉండేదుంటే ఎంతోమందికి కాన్ఫిడెన్స్ ఇచ్చివుండే దానిని కదా.. అరే!! సెవంటీన్ ఇయర్స్ నుండి మొదలుపెట్టాను, అదే థర్టీన్ ఇయర్స్ నుండి మొదలు పెట్టి ఉండేదుంటే నేను నేర్చుకున్న విద్యను చాలామందికి చెప్పి ఉండేదానిని కదా అనిపిస్తుంటుంది.. ఈ మూడు వేల మందిలో ఏ ఒక్కరికైనా నేను నేర్పించింది ఉపయోగపడితే అప్పుడే నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంటుంది.
5. కాలేజీలు, స్కూల్స్ మీరే అప్రోచ్ అవుతారా.? లేదంటే వారే Invite చేస్తారా.? అసలు Educational institutions, పేరెంట్స్ విమెన్ సేఫ్టీ గురుంచి ఎలా స్పందిస్తున్నాయి.? షెర్లి: మొదట్లో ఐతే నేనే అప్రోచ్ అయ్యేదానిని.. ఈ టాపిక్ గురుంచి మాట్లాడేవారు నేనొకదానిని ఉన్నాను అని మొదటవారికి తెలియాలి అని ముందుగా నేనే కలుసుకుంటున్నాను. ఒక్క స్పీచ్ ఇచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీ మూలంగా మిగిలిన కాలేజీలు, స్కూల్ మేనేజ్మెంట్ వారు ఇన్వైట్ చేస్తున్నారు. (పేరెంట్స్ కు గైడెన్స్) ఇంకా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు పేరెంట్స్ కి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురుంచి చెబుతుంటాను. మీ పాప, బాబు ఏడుస్తూ ఇంటికి వస్తే కనుక ఆకలేస్తుందనో, దెబ్బ తగిలిందనో అనుకోకుండా దగ్గరికి తీసుకుని ఎందుకు ఏడుస్తున్నారని అడిగి తెలుసుకుని.. అలాగే పాప ఒకరిని చూసి భయపడుతుంది అలా కొన్ని కొన్ని సింటోమ్స్ ఉంటాయి ఒక రెండు మూడు రోజులు మీ పాపను గమనించండి అప్పుడు తెలిసిపోతుంది ఎవరైనా ఏమైనా చేశారా అని వీటన్నిటి గురుంచి కూడా పేరెంట్స్ కు చెబుతుంటాము.
6. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది.? షెర్లి: చాలా ఉంది.. మా అమ్మ నాన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం, నేను లాస్ట్. పెద్దక్క భరతనాట్యం నేర్చుకున్నారు తను ప్రస్తుతం పాండిచ్చేరిలో ఎం.బి.ఏ చేస్తున్నారు, చిన్నక్క కూడా కరాటే లో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు చెన్నై లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారు. మీకు తెలుసుకదా నేను కూడా సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాను.. నాన్న అంతగా చదువుకోలేదు కానీ పేదరికంలో నుండి ఇప్పుడు 40 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదిగారు. అమ్మ ఐఎఎస్ అవ్వాలని అనుకున్నారు, ప్రిలిమ్స్ వరకూ కూడా వెళ్లారు. నేను ఎలాగూ అవ్వలేదు కనీసం తన బిడ్డలమైన మమ్మల్ని ఐన ఐఎఎస్ గా చూడాలని ఆశిస్తున్నారు. అమ్మ నాకు భరతనాట్యం, కరాటే నేర్పించారు. మా ముగ్గురికి కూడా ఏ లోటు లేకుండా, మా ఇష్టాలకు అనుగూణంగా గైడెన్స్ ఇస్తుంటారు.
7. నెరవేర్చుకోవాల్సిన కలలు ఏమైనా ఉన్నాయా.? షెర్లి: (ఆకాశంలోకి చూస్తూ..)చాలా ఉన్నాయి.. అందులో ముఖ్యమైనది నేను డబ్బులు బాగా సంపాదించాలి.. ఆ డబ్బులతో చాలా పెద్ద ఇంటిని నిర్మించుకోవాలి.. అందులో అనాథ పిల్లలను, పెద్దవారిని, సింగిల్ విమెన్ ని ఇంకా నా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారందరికి అండగా నిలబడాలి అదే నాకు అతిపెద్ద డ్రీమ్, అత్యంత సంతోషాన్ని కలిగించే అంశం.