A Short Poem About How Self Doubting Affects You In Pursuing Your Passion Is Spot On

Updated on
A Short Poem About How Self Doubting Affects You In Pursuing Your Passion Is Spot On

Contributed By: Sriram Madhiraju

ఎక్కడికి వెళ్లాలో తెలుసు ఎలా వెళ్లాలో తెలుసు కానీ కదలకపోతే చేరగలమా ?

ఊహ గమ్యానికి చేర్చదు ఆశ దూరాన్ని తగ్గించదు కానీ పయనిస్తే చేరుకోలేమా ?

ఓటమిని ఒప్పుకోలేక గెలుపుని చేరుకోలేక సందేహిస్తూ ఎన్నాళ్ళు?

చూస్తూ ఉంటే కేవలం చూడటానికే అంకితం జీవితం చేయడం కోసం నువ్వేసే మొదటి అడుగు పేరే ప్రయత్నం

సందేహం అడుగు వేయనీయకుండా ఆపేస్తుంది నిన్ను

భయం కల్పించిన ముసుగులో దాగిపోయాయి నీ దారులన్నీ

సంకల్పం ఉంటే జయించలేవా ఈ రెంటిని ?

పడమట ప్రతి రోజు వాలిపోతున్నా కూడా సూర్యుడు ఆ దిశ వైపు పయనించడానికి సందేహిస్తాడా?

తనని పదే పదే మింగేస్తున్న కృష్ణ పక్షానికి చంద్రుడు ఒక్కసారైనా భయపడి ఉంటాడా ?

ఆకాశాన్ని చూస్తూ ఉంటే గువ్వ పిల్ల గూటికే పరిమితం అదే ఒక్కసారి రెక్క విప్పితే ?