తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన శంకరాభరణం గురించి ఈ తరం వారికి తెలియని విషయాలు !

Updated on
తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన శంకరాభరణం గురించి ఈ తరం వారికి తెలియని విషయాలు !
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో మొదటివరుసలో ఉండే చిత్రం ఈ శంకరాభరణం. హీరోలు విలన్లు హీరోయిన్లు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమాని కథ, కథనం, బలమైన పాత్రలవైపు నడిపించింది ఈ చిత్రం. ఈ సినిమా చూసాక శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వారు కోకొల్లలు. శంకరాభరణం విశేషాలు : ఏదైనా ఒక్కడి తో నే మొదలవుద్ది... * ఈ చిత్రం విడుదల మొదటి రోజు కేవలం ఒక్క ధియేటర్ లో నే ప్రదర్శన జరిగింది, అది కూడా దాదాపు ఖాళీ. * తర్వాతి రోజు నుండి 1980 లో తెలుగు చిత్రాల్లో అత్యంత ఆదరణ పొందిన చిత్రం గా అవతరించింది. * అప్పటి ప్రఖ్యాత సమీక్షకుడు గుడిపాటి శ్రీహరి గారు "మాయా బజార్ తర్వాత అంతటి గొప్ప తెలుగు చిత్రం" అంటూ కీర్తించారు. shankarabharanam ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు.. సెట్ చేస్తారు. * సినిమా స్థాయి పెంచే దర్శకులు చాలా మంది ఉంటారు, కాని ప్రేక్షకుడి స్థాయిని పెంచే దర్శకులు ఉంటారని మీకు తెలుసా !? మన పరిశ్రమలో ఉన్న ఆ స్థాయి దర్శకుడు కాశీనాధుని విశ్వనాధ్ (K. విశ్వనాధ్) గారే ఈ చిత్ర దర్శకులు. * చిత్రం ప్రారంభం లోనే "శిశుర్ వేత్తి పశుర్ వేత్తి వేత్తి గానరసం ఫణిః (సంగీతం లోని ఆనందాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆనందిస్తాయట)" అంటూ తనేం చూపించబోతున్నారో ఒక్క వాక్యంతో చెప్పేశారు. * ఈ చిత్రం లో హావాభావాలతోనే అద్భుతంగా చూపించారు కొన్ని సన్నివేశాలు. ముఖ్యం గా శాస్త్రి గారు కోర్ట్ దగ్గర చూసే చూపు, అప్పుడు తులసి మామ ఆమెని విడిచిపెట్టడం.. అబ్బో శాస్త్రి గారిని ఒక్క సారిగా పక్కా మాస్ హీరోని చేసేసారూ విశ్వనాధ్ గారు. * బ్రోచే వారెవరురా పాటని ఆధునిక సంగీతం లో పాడినట్టు చూపించిన సన్నివేశం ఇప్పుడున్న చాల మంది సంగీత దర్శకులకు ప్రతిబింబం గా చెప్పొచ్చు. ఎప్పుడూ అవే సినిమాలా... మనసుకి హత్తుకునేవి తీద్దాం. * వాణిజ్య పరమైన చిత్రాలు తప్ప కథాబలం ఉన్న చిత్రాలు రాని కాలం లో ఈ సినిమా తీయటానికి ముందుకు వచ్చిన నిర్మాతలు "పూర్ణోదయ మూవి క్రియేషన్స్" ఏడిద నాగేశ్వర్ రావు, ఆకాశం శ్రీ రాములు. * ఈ చిత్రం అనే కాదు ఈ ప్రొడక్షన్ లో వచ్చిన ప్రతి చిత్రం ఆణిముత్యమే. ఆపద్భాందవుడు, సాగర సంగమం, సీత కోక చిలుక వంటివి అందులో కొన్ని. * దాదాపు వీరు నిర్మించిన చాలా చిత్రాలకు దర్శకుడు విశ్వనాధ్ గారే. poorna ఎవడున్నాడీ పరిశ్రమ లో ఆ పాత్ర చేసేవాడు? * ఈ చిత్రానికి బలం పరమ నిష్టా గరిష్టుడు, సంగీతం లో దిట్ట అయిన శంకరశాస్త్రి పాత్ర. * జొన్నలగడ్డ వేంకట సోమయాజులు (J.V సోమయాజులు) గారు శంకర శాస్త్రి పాత్ర లో ఒదిగిపోయారు కాదు పరకాయ ప్రవేశం చేసారు కాదు ప్రాణం పోసారు అనటం సమంజసం అనుకుంటా. * ఈ చిత్రానికి గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు అవార్డ్ తో పాటు, భారతీయ సినిమా వంద సంవత్సరాల సందర్భం గా ఫోర్బ్స్ ప్రకటించిన "25 అద్భుత నటన ప్రదర్శన" లో స్థానం పొందారు. ఇక్కడే కాదు...అక్కడ కూడా... * జాతీయ చలన చిత్ర అవార్డుల్లో నాలుగు విభాగాల్లో అవార్డ్లు అందుకుంది. * రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులలో ఐదు విభాగాల్లో అవార్డ్లు అందుకుంది. * 1981 ఫ్రాన్స్ బెసంకాన్ ఫిలిం ఫెస్టివల్ లో "ప్రజల బహుమతి(PRIZE OF THE PUBLIC)" గెలుచుకుంది. సరిగమపదనిసలు... * కృష్ణకోయిల్ వెంకటాచలం మహదేవన్ (K.V మహదేవన్) సంగీతం అందించారు. * సంగీత ప్రధానంగా సాగే చిత్రం కనుక ముందు బాలమురళీ కృష్ణ గారితో పాడిద్దం అనుకున్నారట, కాని మహదేవన్ గారు SP బాలసుబ్రమణ్యం గారిని ఎంచుకున్నారు. * అన్ని పాటలు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(SP బాలసుబ్రమణ్యం) గారే పాడారు. * వాణి జయరాం గారికి, SP బాలసుబ్రమణ్యం, K.V మహదేవన్ గారికి పాటల విభాగం లో జాతీయ, రాష్ట్ర అవార్డులు వచ్చాయి. sankarsastry ఇంకొన్ని విషయాలు... * CNN - IBN వారు ప్రకటించిన ఎప్పటికి నిలిచిపోయే భారతీయ 100 అత్యుత్తమ చిత్రాల్లో స్థానం. * 8వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా, తష్కెంట్ ఫిలిం ఫెస్టివల్ సహా మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శన జరిగింది. * ఈ చిత్రం తమిళ్, మలయాళం భాషల్లో అనువాదం అయి కూడా అపూర్వ ఆదరణ పొందింది. * ఈ చిత్రం హిందీ లో జయప్రద, గిరీష్ కర్నాడ్ లతో "సుర్ సంగం" గా రీమేక్ అయ్యింది. * 2014 లో కూడా తమిళ్ వాళ్ళు ఈ సినిమా ని తిరిగి విడుదల చేసారు. manju సాహిత్యం కాదు సమజానికి హితం భోదించె తత్త్వం: * అద్వైత సిద్దికి అమరత్వ లభ్దికి గానమే సోపానమూ... సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతం ప్రాణము... శంకరా భరణము పాట. * రాగం తానం పల్లవి.. నా మదిలోనే కదలాడి కడ తెరమన్నవి... రాగం తానం పల్లవి పాట * మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ... ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు ... శంకరా నాధ శరీరా పరా పాట. * క్రూర కర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామా... ఏ తీరుగు నను దయ చూపేద వో(భక్తరామదాసు)పాట. shank సంభాషణలు కాదు సంధించిన బాణాలు : జంధ్యాల గారు రాసిన మాటలు ఈటెల్ల గుచ్చుకున్నాయి. మచ్చుకు కొన్ని... * పురోహితుడికి నత్తి మనలాంటి వాళ్ళకు భక్తీ ఉండకూడదమ్మ. * ఆ డెక్కల చప్పుడు లో కూడా కోపం కనపడుతుంది రా దేవుడా. * ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయటానికి కాదు. * ఆకలేసిన బాబు అమ్మ అని ఒక విధం గా అంటారు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని ఒక విధం గా అంటారు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా అంటాడు. * బావుందయ్యా..రోలొచ్చి మద్దెలతో మొరపెట్టుకుందంటా; నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు, నాకసలే నీరసం వస్తుంటే. * సంగీతానికి భాషా బేధాలు, స్వపర బేధాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. * మొగుడికి ఉత్తరాలు రాసేంతవరకు చదువుకుంది. * శారదా చెప్పు... నువ్వు ఎంచుకున్న రాగమేమిటి పాడుతున్న రాగమేమిటి... * రసికులు కాని వాళ్ళకి కవిత్వాన్ని వినిపించే రాత రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ఇదండీ మన విశ్వనాధ్ గారి శంకరాభరణం గురించినవిశేషాలు , మీకు ఇంకా మంచి విశేషాలు తెలిసుంటే కామెంట్ చేయండి.