This Director's FB Post On The Harsh Reality Of Film Industry After A 'Faded Stardom' Is Bang On!

Updated on
This Director's FB Post On The Harsh Reality Of Film Industry After A 'Faded Stardom' Is Bang On!

Everyone who has watched "MAHANATI", might have definitely experienced 'the pain' of Savitri garu watching the climax. Moved by her 'helpless death', there's been a lot of talk for quite some time about why Savitri Garu didn't receive proper aid from the film industry.

A simple question in the climax by Madhuravani to Susheela, "Aina meeru ekkadiki vellaaru??" tells us how the actress was neglected and died a pauper in real life. Addressing the same topic, director Sai Rajesh a.k.a 'Steven Shankar', who directed 'Hrudaya Kaleyam', has put up a hard hitting post on how the basic human nature is intertwined with film industry - when it comes to the death of a 'star'. Here's what he had posted on Facebook:

"మహానటి" సినిమా చూసిన మా అమ్మ నన్నొక ప్రశ్న అడిగింది....సావిత్రి లాంటి మహానటి అన్ని కష్టాల్లో ఉంటే మరి సినిమా వాళ్లంతా ఏం చేస్తున్నట్టు ??? ఆమెనే కాదు....చాలా మంది మనసులో నానుతున్న ప్రశ్న ఇది..... అనుభవంలో నేను చాలా చిన్నవాడిని...కానీ ఇండస్ట్రీ గురించి నాకు అర్థమైన భాషలో చెప్తాను....

సావిత్రి (గారు) చనిపోయేనాటికి ఆమె మహానటి కాదు......Fade Out అయిపోయిన ఒక నటి....ఆమె నటించే సినిమాలకి కానీ....ఆమెకి కానీ ఎటువంటి డిమాండ్ లేదు.... ఆవిడతో ఎవరికీ అవసరం కూడా లేదు....

ఈ రోజు మనకి జంధ్యాల అంటే ఎవరు....ఆహా నా పెళ్ళంట, శ్రీ వారికి ప్రేమలేఖ, చంటబ్బాయ్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలు అందించిన ఒక మహా మనిషి.......కానీ ఆయన చనిపోయేనాటికి ష్ గప్చుప్...ఓహో నా పెళ్ళంట, విచిత్రం, బాబాయ్ హోటల్ లాంటి 12-15 వరస అపజయాలతో ఉన్న ఒక దర్శకుడు.... ఈ రోజు అగ్ర హాస్యనటులు అనే ప్రతి ఒక్కరి జీవితం...ఆయన పెట్టిన భిక్ష....మరి ఈ రోజు ఆయన వర్ధంతి, జయంతి లాంటివి జరిగినప్పుడు ఆయన తొలి సినిమా హీరో ప్రదీప్ గారు తప్ప...ఆయన్ని స్మరించుకునే నాధుడు లేడు.... ఎందుకు ???

మరో రెండు ఉదాహరణలు చెప్పి ...point లోకి వెళ్తాను....

దాసరి నారాయణరావు గారు సాధించిన achievements గురించి నాకు ఎలాంటి idea లేదు...నాకు సినిమా పిచ్చి మొదలయ్యే నాటికి....ఆయన సినిమాలకి ఎటువంటి డిమాండ్ లేదు.... కానీ ఇండస్ట్రీ కి వచ్చాక ఆయన ఒంటిచేత్తో సమస్యలని పరిష్కరించటం చూసి ఆయన అంటే ఇష్టం ఏర్పడింది.... సంపూర్ణేష్ లాంటి ఒక హీరోని తయారు చేశావ్ అని కొబ్బరిమట్ట ముహూర్తం వచ్చి క్లాప్ కొట్టారు...

ఆయన చనిపోయిన రోజున...ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి వచ్చి చూసి వెళ్లారు....కానీ ఆయన ఎస్టేట్ లో దహన సంస్కారాలు జరుగుతుంటే....ఆయన శిష్యులు తప్ప ...యువ హీరోలు, యువ దర్శకులు రావటం నేను చూడలేదు...ఆఖరికి TOP10 దర్శకుల్లో ఒక్కరూ ఆయన దహనసంస్కారం attend అయిన వారు ఎవరో కూడా గుర్తు రావట్లేదు...

కానీ రామానాయుడు గారి దహణసంస్కారాలకి అందరూ హాజరు అయ్యారు...ఎందుకంటే ఎవరొచ్చారో చూడటానికి ఆయన వారసులు ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్లో వున్నారు....

మనుషుల్లో ఈ తరహా behaviour సర్వసాధారణమే అయినా.....సినిమా వాళ్ళకి మరింత ఎక్కువ అవలక్షణాలు.....ఇక్కడ కృతజ్ఞత అనేది చాలా తక్కువ....ఎందుకంటే ఒకరిని మించిన మరొక ఉద్ధండులు ..నీకు అడుగడుక్కి పరిచయం అవుతూ వుంటారు....కాబట్టి వారికి నీతో అవసరం లేదు...నువ్వు కాకపోతే ఇంకొకరు...

నాకు ఇతని వల్లే అవకాశం వచ్చిందనో, ఇతని వల్లే నేనీ స్థాయిలో వున్నాననో ఎవరికి పెద్ద కృతజ్ఞతా భావం ఉండదు.....

నా వరకే చూసుకుందాం....హృదయకాలేయం తర్వాత నేను చాలా ఆటుపోట్లు చూసాను....ఆ సినిమాతో లాభ పడ్డ చాలా మంది వ్యక్తులో....ఒక్క సంపూర్ణేష్ బాబు తో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు తప్ప .....ఇంకెవరు నిలబడలేదు.... ఇప్పుడు వారి కారణాలు వారు చెప్పేస్తారు ☺️ రేపు మరో విజయం రాగానే తిరిగి వచ్చేస్తారు..... విజయం రాకపోతే మాకు ముందే తెలుసంటారు....నేను మాత్రం నాకు బాట వేసిన వారి పట్ల కృతజ్ఞతగా ఉన్నానా ఏంటి ,☺️

ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ....ఆయన మీద జాలి చూపించిన వారెవరు..ఆయన బ్రతికి వున్నప్పుడు...ఆయన తో సినిమాలు తియ్యలేదు...ప్రేక్షకులు టిక్కెట్లు కొనలేదు...

చావు తర్వాతే....సావిత్రి లాంటి వారికి మహానటి స్థాయి ఏర్పడింది....ఇప్పుడు బ్రతికి ఉండి.... పట్టించుకోబడని ఎందరో గొప్ప వ్యక్తులకి... వారి చావుతోనే ఈ ఇండస్ట్రీ మరియు జనం....వారికి Legendary స్టేటస్ ఇస్తారు...

వారసుడు గొప్ప స్థాయిలో ఉంటే....చావు తర్వాత కూడ గొప్పగా బతకొచ్చు.... లేకపోతే..పట్టించుకునే నాధుడు లేడు..... నాగ అశ్విన్ లేకుండా సావిత్రి గారి కి ఈ ప్రతిష్ట ఒక generation తో అంతం అయిపోయేది....నిజంగా దర్శకుడు అభినందనీయుడు...

విజయాన్ని ఎప్పుడు తలకి ఎక్కించుకోకండి..... అపజయం శాశ్వతం కాదు.... సినిమా మీద ప్రేమతో వచ్చావు....సినిమా కోసమే బతుకు....నీ చుట్టూ ఈ రోజు ఉన్న భజన బృందం...మరో సంవత్సరానికి వేరొక దగ్గర చిడతాలు వాయిస్తూ వుంటారు....

నిన్ను అభిమానించే మనిషి....నెల్లూరు లో ఒక గ్రామంలో....రాజమండ్రి లాంటి పట్టణంలో....ఎక్కడో ఒక దగ్గర తమ మనసులో...కొన్ని దశాబ్దాలు దాటినా.... నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు

నువ్వు పోవచ్చు.... నీ సినిమా మాత్రం ఈ భూమ్మీద శాశ్వతంగా నిలిచిపోతుంది.....అలాంటి సినిమాకి మాత్రం మనసా వాచా కర్మణా .... నీలోని best ఇవ్వు....అదే శాశ్వతం....అదే జీవితం...

నీతి : రాజు గారి కుక్క చచ్చిపోతే ...అందరూ వస్తారు... రాజు గారే పోతే.....ఎవరూ రారు....

Here's his Facebook Post