'జయసుధ' ఈ పేరు వినగానే, జయసుధ గారిని చూడగానే మన ఇంటి మనిషిగా ఇంకా చెప్పాలంటే మన అమ్మ లాంటి భావన కలుగుతుంది. నిజంగా ఇలాంటి గుర్తింపు రావడం చాలా కష్టం. ఈ గుర్తింపుకు కారణం కేవలం తన సహజ నటన మాత్రమే కాదు ఉన్నతమైన వ్యక్తిత్వం కూడా. దాదాపు 44 సంవత్సరాల సుధీర్ఘ తెలుగు సినీ ప్రస్థానంలో ఒక హీరోయిన్ గా, వదినగా, కన్నతల్లిగా, నాయనమ్మలా ఇలా ఎన్నో పాత్రలలో నటించి మెప్పించి తరతరాలుగా తన నటనతో మన అభిమానాన్ని దోచుకున్న మన సహజనటి జయసుధ గారి పుట్టినరోజు ఈరోజు. 12సంవత్సరాల నుండే నటించడం మొదలుపెట్టిన జయసుధ గారు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణంరాజు, కమల్ హాసన్, చిరంజీవి గారి లాంటి నాటి టాప్ హీరోలందరితో హీరోయిన్ గా చేసి వారి స్థాయికి తగ్గట్టు సమానంగా నటించారు.
Generalగా స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్లందరికి స్టార్ డమ్ వచ్చేస్తుంది.. అభిమానులు తమని ఏ విధంగా ఐతే చూశారో అదే హీరోయిన్ గా వారి మదిలో అలాగే ఉండిపోవాలి అని హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోగానే నటనలో రిటైర్ ఐపోతారు.. ఇక వెండితెర మీదకు రారు.. ఒకవేళ వచ్చినా ఏ లేడి విలన్ గా వస్తారే తప్ప ఒక అమ్మగా వదిన లాంటి క్యారెక్టర్ లో ఎవ్వరు నటించలేరు.. ఒకవేళ నటించినా సక్సెస్ అయ్యేవారు చాలా తక్కువ కాని జయసుధ గారు నటించిన ఏ పాత్రకైనా సరైన న్యాయం చేస్తు తనరంగంలో తనే అగ్రస్థానంలో ఉన్నారు.. 44సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్ని పాత్రలు చేసినా కాని మన తరానికి మాత్రం జయసుధ గారు మన అమ్మలా ఎప్పటికి గుర్తుండిపోతారు.
జయసుధ గారి కొన్ని మరుపురాని పాత్రలు..
కొత్త బంగారు లోకం
బొమ్మరిల్లు
అమ్మ నాన్న ఓ తమిలమ్మాయి
ధర్మాత్ముడు
యువకుడు
ఇది కథ కాదు
శివరంజని
మేఘసందేశం
ప్రేమాభిషేకం
జ్యోతి
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
శతమానం భవతి